WhatsApp: వాట్సప్‌లో వీడియోను ఆడియోగా ఇలా మార్చేయండి

WhatsApp | వాట్సప్‌లో వీడియో ఫైల్‌ని ఆడియోగా మార్చి పంపొచ్చు. ఇందుకోసం మీరు థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.

news18-telugu
Updated: April 14, 2019, 2:58 PM IST
WhatsApp: వాట్సప్‌లో వీడియోను ఆడియోగా ఇలా మార్చేయండి
WhatsApp: వాట్సప్‌లో వీడియోను ఆడియోగా ఇలా మార్చేయండి
  • Share this:
వాట్సప్‌... ఇప్పుడు అందరి స్మార్ట్‌ఫోన్‌లో కనిపించే యాప్ ఇది. స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారందరికీ వాట్సప్ అకౌంట్లు ఉంటాయి. వాట్సప్‌లో ఫోటోలు, వీడియోలు, మెసేజ్‌లు పంపిస్తుంటారు. అయితే వాట్సప్‌లో రకరకాల ఫీచర్లు ఉన్నాయి. షార్ట్ కట్స్ ఉన్నాయి. వాటి గురించి కొద్ది మందికే తెలుసు. వాట్సప్‌లో వీడియో ఫైల్‌ని ఆడియోగా మార్చి పంపొచ్చు. ఇందుకోసం మీరు థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్సప్‌ యాప్‌లోనే వీడియోని ఆడియోగా ఈజీగా మార్చేయొచ్చు. అదెలాగో తెలుసుకోండి.

ముందుగా మీ వాట్సప్‌లో ఛాట్ విండో ఓపెన్ చేయండి.
టెక్స్ట్‌ బాక్స్ పక్కన కెమెరా ఐకాన్‌ను క్లిక్ చేయండి.

మీరు ఆడియోగా పంపాలనుకుంటున్న వీడియోను సెలెక్ట్ చేయండి.
వీడియోను ఓపెన్ చేసిన తర్వాత రైట్ టాప్‌లో పెన్సిల్ టూల్ క్లిక్ చేయాలి.


రైట్‌ సైడ్ కలర్ బార్ కనిపిస్తుంది.
కలర్ బార్‌లో ఏదైనా ఓ కలర్ సెలెక్ట్ చేయాలి.వీడియోపైన రెండు వేళ్లతో ఒకేసారి టచ్ చేయాలి.
మీరు సెలెక్ట్ చేసుకున్న కలర్ వీడియోపై అప్లై అవుతుంది.
సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే చాలు.
ఆ ఫైల్‌ను మీరు ప్లే చేస్తే వీడియో కనిపించదు. కేవలం ఆడియో వినిపిస్తుంది.
వాట్సప్ స్టేటస్‌లో కూడా ఇదే టెక్నిక్‌తో వీడియోను ఆడియోగా మార్చొచ్చు.
Yamaha MT-15: యమహా కొత్త బైక్ ఎలా ఉందో చూశారా?

ఇవి కూడా చదవండి:

UPSC Jobs: మొత్తం 965 ఖాళీలు... మొదలైన దరఖాస్తు ప్రక్రియ

IRCTC Rules: టికెట్ రీఫండ్ రిజెక్ట్ కావడానికి 10 కారణాలివే...

SBI Charges: ఎస్‌బీఐ వసూలు చేసే ఈ 5 ఛార్జీలు తెలుసుకోండి...
First published: April 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు