Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే

    Best Prepaid Recharge Plans | రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్లకు అనేక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. మరి వాటిలో ఏది బెస్ట్, ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకోండి.

    news18-telugu
    Updated: April 28, 2020, 1:00 PM IST
    Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే
    Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
    • Share this:
    మీరు రిలయెన్స్ జియో సబ్‌స్క్రైబరా? ఎయిర్‌టెల్ యూజరా? వొడాఫోన్ ఐడియా నెట్వర్క్ వాడుతున్నారా? ప్రస్తుతం ఈ మూడు టెలికామ్ కంపెనీలు అనేక రకాల ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. అయితే వాటిలో ఏది సెలెక్ట్ చేయాలో మీకు అర్థం కావట్లేదా? సెలెక్ట్ చేయడం చాలా సింపుల్. ఇందుకోసం మీకు మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మీరు మీ మొబైల్ నెట్వర్క్‌ ఎక్కువ ఉపయోగించేది కాల్స్ కోసమా? డేటా కోసమా? మీరు నెలలో చేసే కాల్స్ ఎక్కువా? తక్కువా? డేటా ఎక్కువ వాడుతారా? వైఫై ఎక్కువ ఉపయోగిస్తారా? ఇలా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే ప్లాన్ సెలెక్ట్ చేయడం సులువు. ఈ ఆర్టికల్‌లో మూడు రకాల కేటగిరీలను వివరించాం. అందులో మీరు ప్లాన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో సులువుగా తెలుస్తుంది.

    Type A: కాల్స్ తక్కువ చేస్తారు. డేటా తక్కువ ఉపయోగిస్తారు. ఇన్‌కమింగ్ కాల్స్ మొదటి ప్రాధాన్యత. ఔట్ గోయింగ్ కాల్స్ తక్కువ.

    Type B: ఎక్కువ లోకల్, నేషనల్ కాల్స్ చేస్తుంటారు. కానీ డేటా తక్కువ ఉపయోగిస్తారు. రోజంతా వైఫై వాడతారు.

    Type C: ఎక్కువగా ప్రయాణించేవాళ్లు. వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎక్కువ డేటా ఉపయోగిస్తారు. కాల్స్ కూడా ఎక్కువ మాట్లాడతారు.

    మీరు ఈ మూడు కేటగిరీల్లో ఏదో ఓ కేటగిరీలో ఉంటే రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకోండి.

    Reliance Jio: మీరు టైప్ ఏ యూజర్ అయితే మీకు జియోలో రూ.98 ప్లాన్ చాలు. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. 2జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. 300 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. ఇతర నెట్వర్క్‌కి కాల్ చేయాలంటే రూ.10 టాప్ అప్ రీఛార్జ్ చేస్తే 124 నిమిషాల టాక్‌టైమ్ లభిస్తుంది.

    Reliance Jio: టైప్ బీ యూజర్ అయితే రూ.329 ప్లాన్ రీఛార్జ్ చేయాలి. 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 6 జీబీ హైస్పీడ్ డేటా, జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. ఇతర నెట్వర్క్స్‌కి కాల్ చేయడానికి 3,000 నిమిషాల టాక్‌టైమ్ లభిస్తుంది. 1,000 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. 28 రోజులకు రూ.98 రీఛార్జ్ చేయడం కన్నా 84 రోజులకు రూ.329 రీఛార్జ్ చేయడం మేలు.

    Reliance Jio: ఇక మీరు టైప్ సీ యూజర్ అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా అంటే మొత్తం 42 జీబీ డేటా లబిస్తుంది. జియో నెట్వర్క్‌కు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్వర్క్స్‌కి 1,000 నిమిషాలు ఉచితం. ఇదే ప్లాన్ 84 రోజులకు తీసుకుంటే రూ.555 రీఛార్జ్ చేయాలి. ఇతర నెట్వర్క్స్‌కి 3,000 నిమిషాలు ఉచితం. మీకు రోజూ 2 జీబీ డేటా కావాలంటే రూ.599 రీఛార్జ్ చేయాలి. మిగతా బెనిఫిట్స్ అన్నీ రూ.555 ప్లాన్‌లో ఉన్నట్టే ఉంటాయి. రోజూ 3 జీబీ డేటా కావాలంటే 28 రోజులకు రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేయాలి.

    Airtel: మీరు టైప్ ఏ యూజర్ అయితే రూ.79 ప్లాన్ రీఛార్జ్ చేయాలి. రూ.64 టాక్‌టైమ్ వస్తుంది. నిమిషానికి 60 పైసలు ఛార్జీలుంటాయి. 200 ఎంబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు.

    Airtel: టైప్ బీ యూజర్ అయితే రూ.379 రీఛార్జ్ చేయాలి. 84 రోజుల వేలిడిటీ. 6 జీబీ డేటా, 900 ఎస్ఎంఎస్‌లు, ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉచితం. 365 రోజులకు రూ.1,498 రీఛార్జ్ చేస్తే 3,600 ఎస్ఎంఎస్‌లు, 24 జీబీ డేటా వస్తుంది. వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాక్సెస్ ఉచితం.

    Airtel: మీరు టైప్ సీ యూజర్ అయితే రూ.598 రీఛార్జ్ చేయాలి. 84 రోజుల వేలిడిటీ. రోజూ 1.5 జీబీ డేటా లభిస్తుంది. రోజూ 2 జీబీ డేటా కావాలంటే రూ.449 లేదా 3జీబీ డేటా కావాలంటే రూ.558 రీఛార్జ్ చేయాలి. వేలిడిటీ 56 రోజులే. అన్ని ప్లాన్స్‌పై రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఏ నెట్వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాలింగ్, వింక్ మ్యూజిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం యాక్సెస్ ఉచితం.

    Vodafone: మీరు టైప్ ఏ యూజర్ అయితే రూ.79 ప్లాన్ రీఛార్జ్ చేయాలి. రూ.64 టాక్‌టైమ్ వస్తుంది. సెకనుకు 1 పైసా చొప్పున ఛార్జీలుంటాయి. 200 ఎంబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. రూ.95 రీఛార్జ్ చేస్తే రూ.74 టాక్‌టైమ్ వస్తుంది. సెకనుకు 2.5 పైసా చప్పున ఛార్జీ ఉంటుంది. 200 ఎంబీ డేటా లభిస్తుంది. 56 రోజుల వెలిడిటీ.

    Vodafone: టైప్ బీ యూజర్ అయితే రూ.379 రీఛార్జ్ చేయాలి. 84 రోజుల వేలిడిటీ. 6 జీబీ డేటా, 1,000 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉచితం. రూ.1,499 రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ. 3,600 ఎస్ఎంఎస్‌లు, 24 జీబీ డేటా వస్తుంది. వొడాఫోన్ ప్లే, జీ5 యాక్సెస్ ఉచితం.

    Vodafone: టైప్ సీ యూజర్ అయితే రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేయాలి. రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వేలిడిటీ 28 రోజులు. రూ.449 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వేలిడిటీ 56 రోజులు. రూ.699 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వేలిడిటీ 84 రోజులు.

    ఇవి కూడా చదవండి:

    మీ అకౌంట్‌లోకి రూ.1,500 వచ్చాయా? చెక్ చేయండి ఇలా

    SBI Personal Loan: జస్ట్ 4 క్లిక్స్‌తో ఎస్‌బీఐలో పర్సనల్ లోన్... స్టెప్స్ ఇవే

    Police Pass: అత్యవసరమైన పనులున్నాయా? పోలీస్ పాస్ తీసుకోండి ఇలా
    Published by: Santhosh Kumar S
    First published: April 28, 2020, 12:59 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading