news18-telugu
Updated: November 30, 2020, 5:46 PM IST
WhatsApp Trick: సీక్రెట్‌గా వాట్సప్ స్టేటస్ చూడొచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
వాట్సప్... ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. వాటిలో పాపులర్ అయిన ఫీచర్స్ కొన్ని మాత్రమే. వాట్సప్‌లోని బెస్ట్ ఫీచర్స్‌లో స్టేటస్ ఫీచర్ కూడా ఒకటి. వాట్సప్‌లో స్టేటస్ ఫీచర్ ఉపయోగించేవారు ఎక్కువ. రోజూ స్టేటస్ అప్డేట్ చేయడం వాట్సప్ యూజర్లకు అలవాటు. వాట్సప్‌లో స్టేటస్ అప్డేట్ చేస్తే 24 గంటలపాటు లైవ్‌లో ఉంటుంది. అంటే ఆ స్టేటస్ 24 గంటల పాటు అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతుంది. స్టేటస్ అప్డేట్ చేయనివారు కూడా ఇతరులు అప్డేట్ చేసిన స్టేటస్ చూస్తుంటారు. అయితే వాట్సప్‌లో ఎవరెవరు స్టేటస్ చూశారో అవతలివాళ్లకు తెలుస్తుంది. వాట్సప్ మెసేజ్ చదివినప్పుడు బ్లూటిక్స్ వచ్చినట్టు, వాట్సప్ స్టేటస్ ఎంతమంది చూశారన్న విషయం తెలుస్తుంది. ఎవరెవరు స్టేటస్ చూశారో కూడా తెలుస్తుంది. అయితే అవతలివారికి తెలియకుండా స్టేటస్ ఎలా చూడాలి? చాలా సింపుల్. ఇందుకోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఓ వాట్సప్ ట్రిక్ ఫాలో అయితే చాలు. మీరు స్టేటస్ చూసినా ఆ విషయం అవతలివారికి తెలియదు. అయితే ఇందుకోసం మీరు వాట్సప్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్స్ మార్చిన తర్వాత మీరు ఎవరి స్టేటస్ చూసినా ఆ విషయం వారికి తెలియదు. మరి ఆ సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.
Nokia 2.4: రూ.10,399 ధరకే నోకియా 2.4 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవేMoto E7: మోటోరోలా నుంచి తక్కువ ధరలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్
వాట్సప్‌లో Read Receipts అనే ఫీచర్ ఉంది. రీడ్ రిసిప్ట్స్ ఫీచర్ ఛాట్స్ కోసం ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు. మీకు వచ్చిన వాట్సప్ మెసేజ్ మీరు చదవగానే అవతలివారికి బ్లూటిక్స్ కనిపిస్తాయి. ఇలా కనిపించకూడదంటే Read Receipts ఆఫ్ చేస్తే చాలన్న విషయం వాట్సప్ యూజర్లకు తెలుసు. వాట్సప్ స్టేటస్‌కు కూడా రీడ్ రిసిప్ట్స్ ఫీచర్ ఇలాగే పనిచేస్తుంది. మీరు వాట్సప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అందులో అకౌంట్స్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ప్రైవసీ ఓపెన్ చేస్తే Read Receipts కనిపిస్తుంది. ఆఫ్ చేస్తే చాలు. మీరు ఎవరి స్టేటస్ అయినా చెక్ చేస్తే మీరు స్టేటస్ చూసినట్టు తెలియదు. అయితే ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. మీరు రీడ్ రిసిప్ట్స్ ఆఫ్ చేస్తే మీ మెసేజ్ అవతలివారు చదివారో లేదో తెలియదు. దీంతో పాటు మీరు అప్డేట్ చేసిన స్టేటస్ అవతలివారు చూశారో లేదో కూడా తెలియదు. అయినా పర్లేదు అనుకుంటే ఈ ఫీచర్ ఆఫ్ చేయొచ్చు.
Published by:
Santhosh Kumar S
First published:
November 30, 2020, 5:46 PM IST