KNOW HOW TO CHECK HOW MANY SIM CARDS OR MOBILE NUMBERS LINKED TO YOUR AADHAAR CARD SS
Aadhaar Card: మీ పేరుతో ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి
Aadhaar Card: మీ పేరుతో ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Aadhaar Card | మీరు మీ ఆధార్ కార్డుతో (Aadhaar Card) సిమ్ కార్డులు తీసుకున్నారా? మరి మీ ఆధార్ కార్డుకు ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయి? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి.
ఒకప్పుడు ఏదైనా ఐడీ ప్రూఫ్ జిరాక్స్ కాపీ ఉంటే చాలు... ఈజీగా సిమ్ కార్డు (SIM cards) తీసుకునేవారు. ఇలా ఒకరికి తెలియకుండానే వారి పేర్ల మీద సిమ్ కార్డులు ఉండేవి. ఆ తర్వాత ప్రభుత్వం నిబంధనల్ని కఠినతరం చేయడంతో ఇలాంటి మోసాలు (SIM Frauds) తగ్గిపోయాయి. ఇప్పుడు ఇతరుల పేర్ల మీద సిమ్ కార్డులు తీసుకోవడం అంత సులువు కాదు. మరి మీ పేరు మీద ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారని అనుమానం ఉందా? అసలు మీ ఆధార్ కార్డుతో (Aadhaar Card) ఎన్ని సిమ్ కార్డులు యాక్టివేట్ అయ్యాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) కొత్తగా వెబ్ పోర్టల్ లాంఛ్ చేసింది.
టెలికామ్ అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ (TAFCOP) పేరుతో రూపొందించిన ఈ పోర్టల్ మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పౌరులు ఎవరైనా తమ పేరు మీద ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోవచ్చు. మీ ఆధార్ కార్డుతో జారీ చేసిన సిమ్ కార్డుల వివరాలన్నీ తెలుస్తాయి.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒకరు తమ పేరు మీద గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్స్ తీసుకోవచ్చు. మీ పేరు మీద యాక్టీవ్‌లో ఉన్న సిమ్ కార్డు వివరాలు కూడా ఈ పోర్టల్‌లో తెలుస్తాయి. ఈ పోర్టల్‌లో మీకు సంబంధం లేని ఫోన్ నెంబర్లు కనిపిస్తే రిపోర్ట్ చేయొచ్చు. మరి మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
మీ ఆధార్ కార్డుపై ఉన్న సిమ్ కార్డుల వివరాలు తెలుసుకోండి ఇలా...
Step 1- ముందుగా TAFCOP వెబ్సైట్ https://tafcop.dgtelecom.gov.in/ ఓపెన్ చేయండి.
Step 2- మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి.
Step 3- Request OTP పైన క్లిక్ చేయండి.
Step 4- డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (DoT) మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ పంపిస్తుంది.
Step 5- ఆ ఓటీపీ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయాలి.
Step 6- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ ఆధార్ కార్డుతో తీసుకున్న మొబైల్ నెంబర్ల వివరాలు ఉంటాయి.
Step 7- మీకు సంబంధంలేని ఫోన్ నెంబర్లు కనిపించినా, మీరు ప్రస్తుతం వాడని మొబైల్ నెంబర్స్ ఉన్నా రిపోర్ట్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.