WhatsApp: వాట్సప్‌లో మీ మెసేజెస్, ఫోటోస్ బ్యాకప్ చేయండి ఇలా

WhatsApp Backup | మీరు వాట్సప్ ఇన్‌స్టాల్ చేసేప్పుడే మీ టెక్స్ట్ మెసేజెస్, ఫోటోలను ఆటోమెటిక్ బ్యాకప్‌ పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే ఆ తర్వాత సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: February 8, 2020, 12:37 PM IST
WhatsApp: వాట్సప్‌లో మీ మెసేజెస్, ఫోటోస్ బ్యాకప్ చేయండి ఇలా
WhatsApp: వాట్సప్‌లో మీ మెసేజెస్, ఫోటోస్ బ్యాకప్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
వాట్సప్... పరిచయం అక్కర్లేని ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్. మరి మీరు కూడా వాట్సప్ యాప్ ఉపయోగిస్తున్నారా? ఫోన్ మార్చినప్పుడు వాట్సప్‌లోని ముఖ్యమైన డేటాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కాస్త కష్టమే. కానీ... ముందుగానే మీరు బ్యాకప్ చేసుకుంటే సులువుగా మీ పాత డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాట్సప్‌లోని టెక్స్ట్‌ మెసేజెస్, ఫోటోస్, వీడియోలను బ్యాకప్ చేసుకోవచ్చు. మీ మెసేజ్‌లను గూగుల్ డ్రైవ్‌లోకి, వాట్సప్‌లో వచ్చిన ఫోటోలను గూగుల్ ఫోటోస్‌లోకి అప్‌లోడ్ చేయొచ్చు. మరి వాట్సప్‌లో డేటా ఎలా బ్యాకప్ చేయాలో తెలుసుకోండి.

మీరు వాట్సప్ ఇన్‌స్టాల్ చేసేప్పుడే మీ టెక్స్ట్ మెసేజెస్, ఫోటోలను ఆటోమెటిక్ బ్యాకప్‌ పర్మిషన్ ఇవ్వాలి. లేకపోతే ఆ తర్వాత సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ వాట్సప్ ఓపెన్ చేసి త్రీ డాట్ మెనూ క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి. అందులో Chats క్లిక్ చేసి Chat Backup ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ డేటా బ్యాకప్ చేయడానికి గూగుల్ అకౌంట్‌ని సెలెక్ట్ చేయాలి. వైఫై లేదా వైఫై అండ్ సెల్యులార్ ద్వారా బ్యాకప్ చేయొచ్చు. ఆ తర్వాత 'Back up to Google Drive' పైన క్లిక్ చేయాలి. ఇలా చేస్తే మీరు మ్యాన్యువల్‌గా బ్యాకప్ చేసినట్టు. ఆటోమెటిక్‌గా బ్యాకప్ చేయాలంటే daily, monthly లాంటి ఆప్షన్స్ ఎంచుకోవాలి.

మీరు వాట్సప్ బ్యాకప్ చేసిన తర్వాత గూగుల్ డ్రైవ్‌లో బ్యాకప్స్ ఫోల్డర్‌లో వాట్సప్ బ్యాకప్ ఫైల్ అప్‌లోడ్ అవుతుంది. మీరు వాట్సప్ రీ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఈ బ్యాకప్ కనిపిస్తుంది. ఈ బ్యాకప్‌ని రీస్టోర్ చేస్తే మీ మెసేజెస్ అన్నీ తిరిగివస్తాయి. మీరు ఫోన్ మార్చే ముందు ఇలాగే బ్యాకప్ చేసుకొని, కొత్త ఫోన్‌లో వాట్సప్ రీ ఇన్‌స్టాల్ చేసేప్పుడు గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాకప్ తప్పనిసరిగా రీస్టోర్ చేయాలి. ఇక గూగుల్ ఫోటోస్ యాప్‌లో డివైజ్ ఫోల్డర్స్ సెలెక్ట్ చేయాలి. అందులో వాట్సప్ ఇమేజెస్ ఫోల్డర్ ఆన్ చేస్తే మీ వాట్సప్ ఫోటోలన్నీ గూగుల్ ఫోటోస్‌లో అప్‌లోడ్ అవుతాయి.

ఇవి కూడా చదవండి:

Poco X2 vs Realme X2: పోకో ఎక్స్2, రియల్‌మీ ఎక్స్2... ఈ రెండు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్

Redmi 9: షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి

Airtel Plan: ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్
Published by: Santhosh Kumar S
First published: February 8, 2020, 12:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading