WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండి
WhatsApp Banking Services | వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటం వల్ల వాట్సప్ బ్యాంకింగ్ సురక్షితమే. మీ అకౌంట్ సమాచారం ఇతరులకు తెలిసే అవకాశం లేదు. అయితే మీరు మీ అకౌంట్ నెంబర్లు, పిన్, పాస్వర్డ్ లాంటి వివరాలేవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
news18-telugu
Updated: October 3, 2019, 3:11 PM IST

WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు... ఎలా పొందాలో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: October 3, 2019, 3:11 PM IST
వాట్సప్... స్నేహితులు, కుటుంబసభ్యులతో ఛాటింగ్‌కు అడ్డా. నచ్చిన కొటేషన్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడానికి ఓ ప్లాట్‌ఫామ్. ఇప్పుడు మీరు వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు కూడా పొందొచ్చు. బ్యాంకులో మీ అకౌంట్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారమైన రియల్ టైమ్‌లో తెలుసుకోవచ్చు. హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా, సారస్వత్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాంటి బ్యాంకులు ఇప్పటికే వాట్సప్ ద్వారా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. ఈ సేవల కోసం బ్యాంకులు అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయట్లేదు. కస్టమర్లకు వేగంగా సమాచారాన్ని అందివ్వాలన్న ఉద్దేశంతో ఉచితంగానే వాట్సప్‌లో బ్యాంకింగ్ సర్వీసుల్ని అందిస్తున్నాయి. ఇలా వాట్సప్‌లో అకౌంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందించడం వల్ల బ్రాంచ్‌లపై, ఫోన్ బ్యాంకింగ్ డివిజన్‌పై పనిభారం కూడా తగ్గుతుంది. అయితే వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు అనేసరికి కస్టమర్లకు అనేక అనుమానాలు రావడం సహజం. మీరు కూడా వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు ఎలా పొందాలి? ఏఏ సేవలు పొందొచ్చు? వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలతో లాభనష్టాలేంటీ? తెలుసుకోండి.
మీరు వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు పొందాలంటే ముందుగా సంబంధిత నెంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ నెంబర్‌ను బ్యాంక్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. వేర్వేరు బ్యాంకులకు వేర్వేరు ఫోన్ నెంబర్లు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. మీకు వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు కావాలనుకుంటే మిస్డ్ కాల్ ఇవ్వడం తప్పనిసరి. మిస్డ్ కాల్ ద్వారా సేవలు పొందేందుకు మీరు సమ్మతి తెలిపినట్టవుతుంది. ఆ తర్వాత మీకు వాట్సప్‌లో బ్యాంకు నుంచి వెల్కమ్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. మీరు ఆ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఏదైనా బ్యాంక్ సర్వీస్ పొందాలనుకుంటే ముందుగా ‘Hi’ అని టైప్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మెసేజెస్ పంపాల్సి ఉంటుంది.
వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన తర్వాత మీకు గతంలో బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్లో వచ్చిన నోటిఫికేషన్స్ ఇకపై వాట్సప్‌లో వస్తాయి. మీ కార్డులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మినీ స్టేట్మెంట్, ప్రీఅప్రూవ్డ్ లోన్స్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. పైన ఇమేజ్‌లో చూపించినట్టుగా వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్టైతే వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ఏ సేవలకు ఏం టైప్ చేసి పంపాలో బ్యాంకులు వివరిస్తాయి. వేర్వేరు బ్యాంకుల్ని బట్టి ఈ కీవర్డ్స్ మారుతుంటాయి.
వాట్సప్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండటం వల్ల వాట్సప్ బ్యాంకింగ్ సురక్షితమే. మీ అకౌంట్ సమాచారం ఇతరులకు తెలిసే అవకాశం లేదు. అయితే మీరు మీ అకౌంట్ నెంబర్లు, పిన్, పాస్వర్డ్ లాంటి వివరాలేవీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సమాచారం తెలుసుకోవడం తప్ప లావాదేవీలు చేయడం వాట్సప్ బ్యాంకింగ్‌లో సాధ్యం సాదు. ఒకవేళ మీ ఫోన్ పోయినట్టైతే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు. లేకపోతే మీ ఫోన్ ఎవరికైనా దొరికితే వాళ్లు మీ అకౌంట్ సమాచారాన్ని ఈజీగా తెలుసుకోగలరు. ఒకవేళ మీ ఫోన్ పోతే వెంటనే “Lost/Stolen: Please deactivate my account" అని టైప్ చేసి support@whatsapp.com ఇమెయిల్ ఐడీకి మెయిల్ పంపాలి. కంట్రీకోడ్తో కలిపి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే మీ 10 అంకెల ఫోన్ నెంబర్ ముందు కంట్రీ కోడ్ +91 తప్పనిసరిగా ఉండాలి. మీరు మెయిల్ పంపిన వెంటనే మీ వాట్సప్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. లేదా మీరు వెంటనే కొత్త సిమ్ తీసుకొని, కొత్త ఫోన్లో వాట్సప్ యాక్టివేట్ చేయాలి. దీంతో పోగొట్టుకున్న ఫోన్లో వాట్సప్ డీయాక్టివేట్ అవుతుంది.
Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Post Office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో టైమ్ డిపాజిట్ అకౌంట్... లాభాలేంటో తెలుసా?
IRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
Credit Card: క్రెడిట్ కార్డ్ ఉందా? లిమిట్ పెంచుకోండి ఇలా
WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు పొందండి ఇలా...
మీరు వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు పొందాలంటే ముందుగా సంబంధిత నెంబర్‌కు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ నెంబర్‌ను బ్యాంక్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. వేర్వేరు బ్యాంకులకు వేర్వేరు ఫోన్ నెంబర్లు ఉంటాయన్న విషయం గుర్తుంచుకోవాలి. మీకు వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలు కావాలనుకుంటే మిస్డ్ కాల్ ఇవ్వడం తప్పనిసరి. మిస్డ్ కాల్ ద్వారా సేవలు పొందేందుకు మీరు సమ్మతి తెలిపినట్టవుతుంది. ఆ తర్వాత మీకు వాట్సప్‌లో బ్యాంకు నుంచి వెల్కమ్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. మీరు ఆ నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి. ఏదైనా బ్యాంక్ సర్వీస్ పొందాలనుకుంటే ముందుగా ‘Hi’ అని టైప్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ మీద వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని బట్టి మెసేజెస్ పంపాల్సి ఉంటుంది.

(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp Banking: వాట్సప్‌లో ఏఏ బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు?
వాట్సప్ బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన తర్వాత మీకు గతంలో బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్లో వచ్చిన నోటిఫికేషన్స్ ఇకపై వాట్సప్‌లో వస్తాయి. మీ కార్డులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, మినీ స్టేట్మెంట్, ప్రీఅప్రూవ్డ్ లోన్స్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. పైన ఇమేజ్‌లో చూపించినట్టుగా వివరాలు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నట్టైతే వాటి వివరాలను తెలుసుకోవచ్చు. ఏ సేవలకు ఏం టైప్ చేసి పంపాలో బ్యాంకులు వివరిస్తాయి. వేర్వేరు బ్యాంకుల్ని బట్టి ఈ కీవర్డ్స్ మారుతుంటాయి.
చందా కొచ్చర్ కేసులో ఆర్బీఐకి హైకోర్టు నోటీసులు...
రూ.2వేల నోటును రద్దు చేస్తారా.. కేంద్రం వివరణ ఇదీ..
Bank Jobs: ఐడీబీఐ బ్యాంక్‌లో జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్
SBI Loan: కస్టమర్లకు గుడ్ న్యూస్... ఎస్బీఐలో తగ్గనున్న మీ ఈఎంఐ
Good News: త్వరలో ఇన్స్యూరెన్స్ పాలసీలు అమ్మనున్న పోస్ట్‌మ్యాన్
SBI YONO: డిసెంబర్ 10 నుంచి ఎస్బీఐ యోనో షాపింగ్ ఫెస్టివల్... 50% వరకు డిస్కౌంట్స్
WhatsApp Banking: వాట్సప్‌లో బ్యాంకింగ్ సేవలతో లాభనష్టాలేంటీ?
Loading...