Home /News /technology /

KNOW HOW IPHONE USERS CAN DELETE SEARCH HISTORY COOKIES ON SAFARI BROWSER SS

How to Delete Search History: మీ సెర్చ్ హిస్టరీని సింపుల్‌గా డిలిట్ చేయండి ఇలా

How to Delete Search History: మీ సెర్చ్ హిస్టరీని సింపుల్‌గా డిలిట్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

How to Delete Search History: మీ సెర్చ్ హిస్టరీని సింపుల్‌గా డిలిట్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

How to Delete Search History | ఇటీవల కాలంలో మొబైల్స్, ఆన్‌లైన్ సర్వీసెస్ ఉపయోగించేవారిలో ప్రైవసీ (User Privacy) గురించి ఆందోళన ఎక్కువైంది. యూజర్ల ప్రైవసీకి రక్షణగా నిలిచే సెట్టింగ్స్ స్మార్ట్‌ఫోన్‌లోనే ఉంటాయి. వాటిని ఉపయోగించడం తెలిస్తే చాలు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam | Hyderabad
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రైవసీకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము మొబైల్‌లో ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో ఎవరికీ తెలియకూడదని స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రైవసీ గురించి ఆలోచించేవారు తమ సెర్చ్ హిస్టరీ (Search History) ఇతరులకు తెలియకూడదని అనుకుంటారు. అంటే వాళ్లు ఏం సెర్చ్ చేశారు? ఏఏ వెబ్‌సైట్స్ చూశారు? అన్న రికార్డ్ తమ మొబైల్‌లో ఉండకూడదని అనుకుంటారు. సెర్చ్ హిస్టరీ ఎలా డిలిట్ చేయాలి? (How to Delete Search History) అని గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటారు. బ్రౌజర్‌లో సెర్చ్ హిస్టరీ డిలిట్ చేయడం చాలా సింపుల్.

ముఖ్యంగా ఐఫోన్ యూజర్లకు స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. చాలామంది ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్స్ గురించి తెలిసింది తక్కువే. సఫారీ బ్రౌజర్ నుంచి సెర్చ్ హిస్టరీ సులువుగా డిలిట్ చేయొచ్చు. ఐఫోన్ యూజర్లు ఎక్కువగా సఫారీ బ్రౌజర్ ఉపయోగిస్తుంటారు. ఈ బ్రౌజర్ నుంచి సెర్చ్ హిస్టరీ డిలిట్ చేయొచ్చు. సెర్చ్ హిస్టరీ మాత్రమే కాదు, కుకీస్ కూడా డిలిట్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్స్ ఉంటాయి. మరి ఐఫోన్ యూజర్లు తమ మొబైల్ నుంచి సెర్చ్ హిస్టరీ, కుకీస్ ఎలా డిలిట్ చేయాలో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.

OnePlus Offer: ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 తగ్గింపు... వారికి మాత్రమే

ఐఫోన్‌లో సెర్చ్ హిస్టరీ డిలిట్ చేయండి ఇలా


ముందుగా ఐఫోన్‌లో సెట్టింగ్స్‌ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత అక్కడ సఫారీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
కింద కనిపించే క్లియర్ హిస్టరీ అండ్ వెబ్‌సైట్ డేటాపై క్లిక్ చేయాలి.
సఫారీ బ్రౌజర్ నుంచి మీ సెర్చ్ హిస్టరీ, కుకీస్, బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయాలి.

ఒకవేళ కుకీస్ మాత్రమే తొలగించి సెర్చ్ హిస్టరీ అలాగే ఉంచాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

ముందుగా ఐఫోన్‌లో సెట్టింగ్స్‌ ఓపెన్ చేయాలి.
ఆ తర్వాత అక్కడ సఫారీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
వెబ్‌సైట్ డేటా సెలెక్ట్ చేసి డిలిట్ చేయాలి.



Mobile Offer: ఈ పాపులర్ మొబైల్‌పై రూ.5,500 తగ్గింపు... తొలిసారి భారీ డిస్కౌంట్

సఫారీ బ్రౌజర్ నుంచి మీ సెర్చ్ హిస్టరీ, కుకీస్, బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయడం వలన మీ ఆటోఫిల్ సమాచారం మారదని గుర్తుంచుకోండి. బ్రౌజర్‌లో మీ సెర్చ్ హిస్టరీ సేవ్ కాకూడదనుకుంటే ప్రైవేట్ బ్రౌజింగ్ ఆన్ చేస్తే చాలు. అంతేకాదు... ఐఫోన్ సెట్టింగ్స్‌లో కూకీస్ బ్లాక్ చేయవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Privacy, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు