KNOW HOW FIND YOUR LOST SMART PHONE USING SIMPLE STEPS AND APPLICATIONS EVK
Smartphone Tips : మీ ఫోన్లో ఈ ఫీచర్లు పెట్టుకోండి.. ఫోన్ పోతే కనిపెట్టవచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)
మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకున్నారా? మీ మొబైల్‌ను ఎక్కడైనా మర్చిపోయారా? మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా దొంగిలించారా? పోయిన మొబైల్ దొరకడం చాలా కష్టమే. కానీ కొన్ని అప్లికేషన్లు, టిప్స్‌తో మీరు ఫోన్ పొగొట్టుకొన్న చోటును కనిపెట్టవచ్చు.
బ్యాంకింగ్, షాపింగ్ (Banking & Shopping) తో పాటు అనేక రకాల సేవలను మనం స్మార్ట్ ఫోన్(Services) ద్వారానే పొందుతున్నాం. అయితే.. కొన్ని సార్లు మనం స్మార్ట్ ఫోన్(Smartphone) ను పోగొట్టుకుంటాం. అలాంటి సందర్భాల్లో ఆ ఫోన్లోని బ్యాంకింగ్(Banking) కు సంబంధించిన యాప్ లు, సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ కొన్ని టిప్స్, ట్రిక్స్‌తో మీ స్మార్ట్‌ఫోన్ (Find my smartphone) ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అందు కోసం కొన్ని ప్రత్యేకమైన యాప్‌లు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకొందాం. అన్నింటికన్నా ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఫైండ్ మై డివైజ్ ఫీచర్ (Find My Device) ఉపయోగించుకోవాలి. దాని వల్ల ఎక్కువ లాభం ఉంటుంది.
మీరు యాపిల్ ఐఓఎస్ పరికరాలు వాడుతుంటే.. మీ ఫోన్లో ముఖ్యంగా వ్యూ లొకేషన్, ప్లే ఏ సౌండ్ మార్క్ యాజ్ లాస్ట్ (లాస్ట్ మోడ్), రిమోట్ ఎరాజ్, నోటిఫై వెన్ ఫౌండ్ , నోటిఫై వెన్ లెఫ్ట్ బిహైండ్ వంటి ఫీచర్లను యాప్‌లను వాడడం వల్ల వెంటనే ఫోన్ ఎక్కడుందో ట్రాక్ చేయొచ్చు.
యాపిల్ ఎయిర్‌ట్యాగ్ లాంటి డివైజ్ ట్రాకర్స్ గూగుల్‌లో లేనప్పటికీ ‘ఫైండ్ మై డివైజ్’ పోర్టల్ లేదా ‘ఫైండ్ మై డివైజ్’ యాప్‌తో మిస్ అయిన డివైజ్‌ల ‘లొకేషన్’ను ట్రాక్ చేయవచ్చు.
అంతే కాకుండా స్మార్ట్‌ఫోన్ మీకు దగ్గర్లో ఉన్నట్టు కనిపిస్తే PLAY SOUND క్లిక్ చేయాలి. ఇంట్లో లేదా ఆఫీసులో మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడైనా మర్చిపోతే లొకేట్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. మీ స్మార్ట్‌ఫోన్ లొకేషన్ మీకు దూరంగా కనిపిస్తే SECURE DEVICE పైన క్లిక్ చేసి మెసేజ్, మీ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ టైప్ చేయాలి. స్మార్ట్‌ఫోన్ దొరికినవాళ్లు మిమ్మల్ని కాంటాక్ట్ అవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి.
రింగ్, రికవర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. ‘రింగ్’తో సైలెంట్లో ఉంటే రింగ్ చేయవచ్చు. ‘రికవర్’తో లాకింగ్ చేయవచ్చు. ‘ఫైండ్ మై డివైజ్’తో గూగుల్ ఎకౌంట్‌తో లింకైన పిక్సెల్ బడ్స్, ఇయర్ బడ్స్, వోఎస్ స్మార్ట్‌వాచ్‌లను కూడా ట్రాక్ చేయవచ్చు. పోయిన గ్యాడ్జెట్స్ ఆచూకీ తెలుసుకోవడానికి శాంసంగ్‌లో స్మార్ట్‌ట్యాగ్(బ్లూటూత్), స్మార్ట్‌ట్యాగ్ ప్లస్ (బ్లూటూత్ అండ్ ఆల్ట్రావైడ్బాండ్)లు ఉన్నాయి. యాపిల్, గూగుల్, శాంసంగ్‌తో సంబంధం లేకుండా ఎన్నో కంపెనీలు ట్రాకింగ్ యాప్‌ల వ్యాపారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘టైల్’ ఈ యాప్‌లో సైజ్, సామర్థ్యాలను బట్టీ రకరకాల ట్రాకర్స్ అందుబాటులో ఉన్నాయి.
డేటాను తొలగించవచ్చు..
ఈ ఆప్షన్స్ ఉపయోగించినా మీ స్మార్ట్‌ఫోన్ దొరకడం కష్టం అని భావిస్తే అందులోని కీలకమైన డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఇందుకోసం ERASE DEVICE ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న మీ డేటా మొత్తం డిలిట్ అవుతుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.