హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

AC Buying Guide: ఏసీలో ఎన్ని రకాలు? మీ ఇంటికి ఏది కరెక్ట్? తెలుసుకోండి

AC Buying Guide: ఏసీలో ఎన్ని రకాలు? మీ ఇంటికి ఏది కరెక్ట్? తెలుసుకోండి

AC Buying Guide: ఏసీలో ఎన్ని రకాలు? మీ ఇంటికి ఏది కరెక్ట్? తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

AC Buying Guide: ఏసీలో ఎన్ని రకాలు? మీ ఇంటికి ఏది కరెక్ట్? తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

AC Buying Guide | వేసవిలో ఎయిర్ కండీషనర్ (Air Conditioner) కొనాలనుకుంటున్నారా? ఏసీలో ఎన్ని రకాలు? మీ ఇంటికి ఏది కరెక్ట్? అన్న విషయం తెలుసా? గదిని బట్టి ఏసీ ఎంచుకోవాల్సి ఉంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే, రాబోయే రెండు నెలల్లో ఎండలు మరింత మండిపోవడం ఖాయం. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి 50 డిగ్రీల వైపు వెళ్తుంటాయి. ఎండాకాలంలో ఎయిర్ కండీషనర్లకు (Air Conditioner) డిమాండ్ ఎక్కువ ఉండటం మామూలే. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఇ-కామర్స్ కంపెనీలు ఏసీలపై ఆఫర్స్ (AC Offers) ప్రకటిస్తుంటాయి. మరి మీరు కూడా వేసవితాపాన్ని తట్టుకోవడం కోసం ఏసీ కొనాలనుకుంటున్నారా? అసలు ఏసీలో ఎన్నిరకాలు ఉంటాయో తెలుసా? విండో ఏసీ (Window AC), పోర్టబుల్ ఏసీ, స్ప్లిట్ ఏసీ, సెంట్రల్ ఏసీ... వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసా? మీరు ఏసీ కొనేముందు ఈ అంశాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. మరి ఈ ఏసీల మధ్య తేడాలేంటో తెలుసుకోండి.

విండో ఏసీ

పేరులో ఉన్నట్టుగానే విండో ఏసీ అంటే కిటికీలో అమర్చుకోగలిగే ఏసీ అని అర్థం చేసుకోవచ్చు. వీటి ధర కాస్త తక్కువగా ఉంటుంది. రూ.25,000 లోపే విండో ఏసీ కొనొచ్చు. మంచి బ్రాండ్, ఎక్కువ ఫీచర్స్ కావాలనుకుంటే రూ.40,000 వరకు ఖర్చు చేయాలి. విండో ఏసీ ఇన్‌స్టాల్ చేయడం చాలా ఈజీ. అయితే మీ బెడ్‌రూమ్‌కు కిటికీ ఉంటేనే విండో ఏసీ తీసుకోవాలి. ఏసీ యూనిట్‌లో కొంత భాగం కిటికీ నుంచి ఇంటి బయటకు వెళ్తుంది.

Price Cut: ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... లేటెస్ట్ రేట్స్ ఇవే

పోర్టబుల్ ఏసీ

మంచి బ్రాండ్‌ల నుంచి పోర్టబుల్ ఏసీలు చాలా తక్కువగా అందుబాటులో ఉంటాయి. కొన్ని కంపెనీలు మాత్రమే పోర్టబుల్ ఏసీలు ఆఫర్ చేస్తున్నాయి. చిన్న గది ఉన్నవారికి పోర్టబుల్ ఏసీ అనుకూలంగా ఉంటుంది. వీటిలో ఫీచర్స్, ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి. వీలైనంతవరకు పోర్టబుల్ ఏసీ తీసుకోకపోవడమే మంచిది. ఇతర టైప్ ఏసీ ఏర్పాటు చేసుకోవడానికి గదిలో వీలు లేకపోతేనే పోర్టబుల్ ఏసీ తీసుకోవాలి. లేకపోతే ఇతర ఏసీలు చూడొచ్చు.

స్ప్లిట్ ఏసీ

స్ప్లిట్ ఏసీ ఎక్కువగా కనిపించే ఎయిర్ కండీషనర్స్‌లో ఒకటి. ఇది పాపులర్ ఏసీ టైప్ కూడా. స్ప్లిట్ ఏసీ ఇన్‌స్టాల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే గదిలోపల స్ప్లిట్ ఏసీ ఇన్‌స్టాల్ చేస్తే, ఆ ఏసీకి సంబంధించిన యూనిట్‌ను గది బయట బాల్కనీలో లేదా టెర్రాస్‌పై ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. మీకు బాల్కనీ, టెర్రాస్ లాంటివి అందుబాటులో లేకపోతే స్ప్లిట్ ఏసీ ఇన్‌స్టాల్ చేయడం కష్టం. అలాంటప్పుడు విండో ఏసీ తీసుకోవాలి. గది అనుకూలంగా ఉంటే స్ప్లిట్ ఏసీ తీసుకోవచ్చు. అయితే విండో ఏసీ కన్నా ధర కాస్త ఎక్కువ. స్ప్లిట్ ఏసీ ధర రూ.35,000 నుంచి ప్రారంభం అవుతుంది. మంచి ఫీచర్స్ ఉన్న స్ప్లిట్ ఏసీ తీసుకోవాలంటే రూ.70,000 వరకు ఖర్చు చేయాలి.

Exchange Offer: ఈ మొబైల్ కొంటే రూ.15,000 పైనే ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్

సెంట్రల్ ఏసీ

సెంట్రల్ ఏసీలు ఎక్కువగా ఆఫీసుల్లో, పెద్దపెద్ద హాల్స్‌లో కనిపిస్తాయి. ఇళ్లల్లో సెంట్రల్ ఏసీలు ఏర్పాటు చేసుకునేవారు చాలా తక్కువ. సెంట్రల్ ఏసీ ధర కూడా ఎక్కువ. విశాలమైన సొంతిల్లు ఉంటేనే సెంట్రల్ ఏసీ గురించి ఆలోచించాలి. అపార్ట్‌మెంట్స్, చిన్న ఇళ్లల్లో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. కమర్షియల్ బిల్డింగ్స్‌కి మాత్రమే సెంట్రల్ ఏసీ అనుకూలంగా ఉంటుంది.

First published:

Tags: Ac, Air conditioners, Amazon, Flipkart

ఉత్తమ కథలు