Home /News /technology /

Smartphones: రూ. 40 వేలలోపు బెస్ట్ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా?.. అయితే ఈ 7 ఫోన్లపై ఓ లుక్కేయండి

Smartphones: రూ. 40 వేలలోపు బెస్ట్ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తున్నారా?.. అయితే ఈ 7 ఫోన్లపై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రూ. 40,000 కేటగిరీలో గల ప్రీమియం స్మార్ట్​ఫోన్లకు సైతం మంచి డిమాండ్​ ఏర్పడింది. ఈ శ్రేణిలోని చాలా స్మార్ట్‌ఫోన్లు 120Hz డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మంచి కెమెరా క్వాలిటీతో వస్తున్నాయి.

భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్​ఫోన్లతో పాటు మిడ్​రేంజ్​, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్​ కూడా విస్తరిస్తోంది. రూ. 40,000 కేటగిరీలో గల ప్రీమియం స్మార్ట్​ఫోన్లకు సైతం మంచి డిమాండ్​ ఏర్పడింది. ఈ శ్రేణిలోని చాలా స్మార్ట్‌ఫోన్లు 120Hz డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, మంచి కెమెరా క్వాలిటీతో వస్తున్నాయి. మరోవైపు, క్వాల్​కామ్​ స్నాప్‌డ్రాగన్ 888 చిప్‌సెట్‌ ప్రాసెసర్​తో పనిచేస్తున్నాయి. మీరు దాదాపు రూ. 40 వేల ధరలో బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తుంటే.. ఈ ఏడు ఫోన్లను పరిశీలించండి.

* వన్​ప్లస్​ 9 ఆర్ (OnePlus 9R)
రూ. 40 వేలలోపు బెస్ట్ ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​ కోసం చూస్తుంటే, వన్​ప్లస్​ 9R బెస్ట్ ఆప్షన్​గా చెప్పవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​ రూ. 39,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 6.5 అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4,500mAh బ్యాటరీతో వస్తుంది. దీనిలోని 48 మెగాపిక్సెల్ మెయిన్​ కెమెరా 60fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయగలదు.

* శామ్​సంగ్ గెలాక్సీ M52 5G (Samsung Galaxy M52 5G)
ఈ జాబితాలో అత్యంత సరసమైన ఫోన్, శామ్​సంగ్ గెలాక్సీ M52 5G. ఇది కేవలం రూ. 30 వేల ధర వద్ద లభిస్తుంది. దీనిలో మిడ్​రేంజ్​ చిప్‌సెట్ అయిన స్నాప్‌డ్రాగన్ 778 SoCని అందించింది. ఎంపిక చేసిన ఈ–కామర్స్ సైట్ల నుంచి డిస్కౌంట్​పై దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది 6.67 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్​ప్లేతో వస్తుంది. దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్​ను అందించింది. దీనిలోని 5,000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.

* వివో ఎక్స్​ 60 (Vivo X60)
వివో ఎక్స్​ 60 ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్ రూ. 37,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్‌తో కూడిన 6.56 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 870 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీని వెనుక ప్యానెల్​లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందించింది.

* షియోమి ఎంఐ 11ఎక్స్​ ప్రో (Xiaomi Mi 11X Pro)
షియోమి ఎంఐ 11 ఎక్స్​ ప్రో రూ. 39,999 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 6.67- అంగుళాల ఫుల్- హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది క్వాల్​కామ్​ స్నాప్‌డ్రాగన్ 888 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీని ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌లో 108-మెగాపిక్సెల్ శామ్​సంగ్​ హెచ్​ఎం2 సెన్సార్​ కెమెరాను అమర్చింది. దీనిలో 33W ఫాస్ట్ ఛార్జింగ్​, 2.5W వద్ద రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4,520mAh బ్యాటరీని అందించింది.

* ఐక్యూ 7 5జీ (iQoo 7 5G)
ఐక్యూ 7 5జీ స్మార్ట్​ఫోన్​ రూ. 31,990 ధర వద్ద లభిస్తుంది. వన్​ప్లస్​ 9 ఆర్​, వివో ఎక్స్​60 వలే ఐక్యూ 7 5జీ కూడా క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్​ 870 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 6.62 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్​లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను చేర్చింది. దీనిలో 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 4,400mAh బ్యాటరీని అందించింది.

* రియల్​మీ జీటీ5G (Realme GT 5G)
రియల్​మీ ఈ ఏడాది ప్రారంభంలో 'అత్యంత సరసమైన' ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్​గా​ రియల్​మీ జీటీ 5జీని లాంచ్​ చేసింది. దీన్ని రూ. 37,999 ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.43 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మొత్తం మూడు కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీనిలోని ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనిలో 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిచ్చే 4,500mAh బ్యాటరీని చేర్చింది.

Redmi Note 11T 5G: రూ.15,000 లోపు మరో 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

Smartphone Tips: పొరపాటున ఫోటోలు, వీడియోలు డిలిట్ చేశారా? ఇలా తిరిగి పొందొచ్చు

* ఐఫోన్​ ఎస్​ఈ 2020 (iPhone SE 2020)
ఐఫోన్​లో అత్యంత సరసమైన స్మార్ట్​ఫోన్​గా ఐఫోన్​ ఎస్​ఈ గతేడాది రిలీజైంది. ఈ ఫోన్​ రూ. 34,999 ధర వద్ద లభిస్తుంది. ఐఫోన్ ఎస్​ఈ​ A13 బయోనిక్ చిప్‌సెట్​తో పనిచేస్తుంది. దీని వెనుకవైపు 12 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. మరోవైపు, సెల్ఫీల కోసం 7 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలను చేర్చింది. అయితే దీనిలో వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్​ ఉన్నప్పటికీ.. 5G సపోర్ట్​ లేదు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Smartphones

తదుపరి వార్తలు