Home /News /technology /

KNOW ABOUT THE BEST TABLETS FROM APPLE SAMSUNG LENOVO UNDER RS 50000 IN INDIA HERE IS THE DETAILS AK GH

Best Tablets: మంచి ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? రూ. 50వేల లోపు ధరలో లభిస్తున్న ట్యాబ్‌లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Best Tablets: ప్రత్యేక అవసరాల కోసం చాలామంది స్మార్ట్‌ఫోన్ కంటే ట్యాబ్స్‌నే ఎక్కువగా వాడుతుంటారు. మీరు రూ. 50,000లోపు బెస్ట్ ట్యాబ్ కోసం చూస్తుంటే.. వీటిపై ఓ లుక్కేయండి.

స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది ప్రీమియం గాడ్జెట్లపై దృష్టి పెడుతున్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి ప్రారంభం కావడంతో ఆన్‌లైన్ క్లాసుల కోసం ఎక్కువ మంది ట్యాబ్లెట్స్‌ను ఎంచుకోవడం మొదలుపెట్టారు. ప్రత్యేక అవసరాల కోసం చాలామంది స్మార్ట్‌ఫోన్ కంటే ట్యాబ్స్‌నే ఎక్కువగా వాడుతుంటారు. మీరు రూ. 50,000లోపు బెస్ట్ ట్యాబ్ కోసం చూస్తుంటే.. వీటిపై ఓ లుక్కేయండి.

* శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ (Samsung Galaxy Tab S7 FE)..
శామ్‌సంగ్‌ గెలాక్సీ ట్యాబ్ ఎస్7 ఎఫ్ఈ వైఫై వేరియంట్ ధర రూ. 41,999గా ఉంది. అయితే ఎల్టీఈ (LTE) వెర్షన్ ధర రూ. 46,999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ టాబ్లెట్ 12.4 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్, 128జీబీ వరకు ఇంటర్ననల్ స్టోరేజ్ వంటి స్పెసిఫికేషన్లతో లభిస్తోంది. మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా స్టోరేజ్‌ను 1టీబీ వరకు పొడిగించుకోవచ్చు.

* లెనోవో ట్యాబ్ పీ11 ప్రో (Lenovo Tab P11 Pro)...
లెనోవో ట్యాబ్ పీ11 ప్రో ధర రూ. 44,999గా ఉంది. ఈ ట్యాబ్ అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ టాబ్లెట్ 11.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. టాబ్లెట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌తో 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగిఉంది.

* యాపిల్ ఐప్యాడ్ మినీ (Apple iPad Mini)...
ఇటీవల ప్రారంభించిన యాపిల్ ఐప్యాడ్ మినీ (Apple iPad Mini) 64జీబీ వేరియంట్ ధర రూ. 46,999 నుంచి ప్రారంభమవుతోంది. ఈ ఐప్యాడ్ మినీ యాపిల్ ఏ15 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఐప్యాడ్ మినీ 8.3 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉండటంతో పాటు యాపిల్ పెన్సిల్‌కు సపోర్ట్ చేస్తుంది.

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

* యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ (Apple iPad Air)...
అమెజాన్‌లో ఈ టాబ్లెట్ రూ. 50,900 ధర వద్ద లభిస్తోంది. ఐప్యాడ్ ఎయిర్ ట్యాబ్‌ను గత సంవత్సరం యాపిల్ ఏ14 బయోనిక్ చిప్‌తో విడుదల చేశారు. ఈ ఐప్యాడ్ 10.9 అంగుళాల డిస్ ప్లేను కలిగిఉంది. ఈ ట్యాబ్.. యాపిల్ పెన్సిల్ సపోర్ట్, పవర్ బటన్‌ టచ్‌ఐడీ వంటి ఫీచర్లతో లభిస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Apple, Samsung, Tablet

తదుపరి వార్తలు