హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Phones Under Rs.10000: బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రూ.10వేలలో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..

Phones Under Rs.10000: బడ్జెట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా..? రూ.10వేలలో బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇండియాలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా రూ.10వేల ప్రైస్ రేంజ్‌లో చాలా కంపెనీలు బెస్ట్ మోడళ్లను రిలీజ్ చేశాయి. మీరు కూడా ఇదే ధరలో బడ్జెట్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి.

ఇండియాలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ కొనసాగుతోంది. ముఖ్యంగా రూ.10వేల ప్రైస్ రేంజ్‌లో చాలా కంపెనీలు బెస్ట్ మోడళ్లను రిలీజ్ చేశాయి. మీరు కూడా ఇదే ధరలో బడ్జెట్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి.

* Redmi 9A Sport

రెడ్‌మీ 9A ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.53-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2GB RAM, 3GB RAM వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. 32GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ లభిస్తుంది. ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 5MP ఫ్రంట్‌ కెమెరా, 13MP రియర్‌ కెమెరా ఉన్నాయి.

* Realme Narzo 50i

రియల్‌మీ నార్జో 50i స్మార్ట్‌ఫోన్‌ ఫుల్‌ HD డిస్‌ప్లేతో పాటు లాంగ్‌ బ్యాటరీ లైఫ్‌ని, బెస్ట్‌ గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. 5000 mAh బ్యాటరీ 43 రోజుల వరకు స్టాండ్‌బై టైమ్ అందిస్తుంది. 88.7 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, 16.5 సెం.మీ (6.5 అంగుళాల) స్క్రీన్ గేమింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి. 5MP ఫ్రంట్ కెమెరా, 8MP రియర్‌ కెమెరా ఉన్నాయి. 2GB, 4GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తాయి. వీటిల్లో వరుసగా 32GB, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లు ఉన్నాయి.

* OPPO A15s

ఒప్పో A15s ఆక్టా-కోర్ MediaTek Helio P35 (MT6765) ప్రాసెసర్ ద్వారా రన్‌ అవుతుంది. ఈ ఫోన్‌ 4GB RAM, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 4230 mAh బ్యాటరీతో వస్తుంది. 13-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. ఇందులో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఆప్షన్‌ ఉంది.

* Jio Phone Next

జియో ఫోన్ నెక్ట్స్‌ 720x1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 18:9 యాస్పెక్ట్‌ రేషియో, 5.45-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. దీని డిస్‌ప్లే స్క్రీన్‌కి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. జియో ఫోన్ నెక్స్ట్ క్వాడ్-కోర్ క్వాల్కమ్ 215 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 9 Pie ఆపరేటింగ్ సిస్టమ్‌ ద్వారా పని చేస్తుంది. 2 GB RAM, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఫీచర్‌లు ఉన్నాయి. 8MP ఫ్రంట్ కెమెరా, 13MP రియర్‌ కెమెరాలు, 3500 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

* I KALL K570 Smartphone

ఐ కాల్‌ K570 స్మార్ట్‌ఫోన్‌ HD డిస్‌ప్లే, 4GB RAM, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ డివైజ్‌ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం USB టైప్-C ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఫ్లాష్‌తో 13MP ఫ్రంట్ కెమెరా, 23MP రియర్‌ కెమెరా, 4G LTE కనెక్టివిటీ Wi-Fi, బ్లూటూత్, GPS వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. చక్కని డిస్‌ప్లేతో సహా మీకు అవసరమైన అన్ని ఫీచర్‌లను కలిగి ఉంది.5000 mAh బ్యాటరీని అందిస్తుంది. ఆండ్రాయిడ్‌ v10(Q)పై రన్‌ అవుతుంది.

* Nokia C01 Plus 4G

నోకియా C01 ప్లస్ 4G ఆక్టా-కోర్ ప్రాసెసర్, 4G కనెక్టివిటీని అందిస్తుంది. ఆండ్రాయిడ్‌ 11పై రన్‌ అవుతుంది. ఆక్టా-కోర్ ప్రాససర్‌, 2GB రామ్‌, 16GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 2 MP ఫ్రంట్‌ కెమెరా, 5MP రియర్‌ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11పై ఫోన్‌ రన్‌ అవుతుంది.

* Lava X2

లావా X2 స్మార్ట్‌ఫోన్‌ 6.50-అంగుళాల డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. ఇది 2GB RAM, 32GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను అందిస్తుంది. 5,000 mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ, వెనుకవైపు 8-MP కెమెరా, 5MP ఫ్రంట్‌ కెమెరా వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌పై రన్‌ అవుతుంది.

* Lenovo A5

లెనోవో A5 ఫోన్‌ 1.5 GHz క్వాడ్-కోర్ MediaTek MT6739 ప్రాసెసర్‌తో రన్‌ అవుతుంది. 2GB RAM, 32GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది. 13 MP రియర్‌ కెమెరా, 8MP ఫ్రంట్‌ కెమెరాలు ఉన్నాయి. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫోన్ 720x1440 పిక్సెల్‌ల రిజల్యూషన్, 18:9 యాస్పెక్ట్ రేషియోతో 5.45-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఆండ్రాయిడ్ 8.1 ఓఎస్‌పై పని చేస్తుంది.

Price Cut: ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది... 90Hz డిస్‌ప్లే, 48MP కెమెరా, 5000mAh బ్యాటరీ

Exchange Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.13,250 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్... అమొలెడ్ డిస్‌ప్లే, 50MP కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ

* POCO C31

పోకో C31 అనేది MediaTek Helio G35 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ 720x1600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.53 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 4GB RAM, 64GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 5000 mAh బ్యాటరీ వంటి ఫీచర్‌లు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 10పై రన్ అవుతుంది. 8MP ఫ్రంట్‌ కెమెరా, 13 MP + 2 MP + 2 MP రియర్‌ కెమెరా సెటప్‌తో వస్తుంది.

First published:

Tags: POCO, Redmi, Smartphones

ఉత్తమ కథలు