ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్‌కి మారేవారు ముందుగా బడ్జెట్ మొబైల్ ట్రైచేస్తుంటారు. అందుకే స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ బడ్జెట్ సెగ్మెంట్‌లో తమ పట్టు కోసం కొత్తకొత్త మోడల్స్ రిలీజ్ చేస్తుంటాయి. రూ.10,000 లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్స్ (Smartphone Under Rs 10,000) రిలీజ్ చేస్తుంటాయి. ఇటీవల రిలీజ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్లలో భారీ బ్యాటరీ, మంచి కెమెరా, ఎక్కువగా ర్యామ్ ఉంటోంది. బడ్జెట్ రూ.10,000 లోపే అయినా ఈ ప్రైస్‌లోనే 6,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ కెమెరా, 4జీబీ ర్యామ్ లాంటి ఫీచర్స్ అందిస్తున్నాయి. మరి ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌ఫోన్లలో రూ.10,000 లోపు మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.
Redmi 10: రెడ్‌మీ 10 సిరీస్‌లో రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ గత నెలలో లాంఛ్ అయింది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. ఆఫర్‌లో రూ.10,000 లోపే కొనొచ్చు. ఇందులో 6.71 హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్, ర్యామ్ బూస్టర్ ఫీచర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలున్నాయి.
Realme GT 2: రియల్‌మీ జీటీ 2 ఫస్ట్ సేల్ కాసేపట్లో... తొలి సేల్‌లో రూ.5,000 డిస్కౌంట్
Realme C20: రియల్‌మీ సీ20 స్మార్ట్‌ఫోన్ గతేడాది లాంఛ్ అయినా ఇప్పటికీ రూ.10,000 లోపు బడ్జెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ పాపులర్. 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.6,499. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Redmi 9i Sport: రెడ్‌మీ 9ఐ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. ఇందులో 6.53 అంగుళాల హెచ్‍డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్, 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Xiaomi 12 Pro: యాపిల్ ఐఫోన్‌కు పోటీగా షావోమీ 12 ప్రో... ప్రీమియం ఫీచర్స్ అదుర్స్
Micromax IN 2B: మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499. ఇందులో 6.52 అంగుళాల ఫుల్ హెచ్‍డీ+ డిస్‌ప్లే, యూనిసోక్ టీ610 ప్రాసెసర్, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
Infinix Hot 11 2022: ఇన్ఫీనిక్స్ హాట్ 11 2022 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‍డీ+ డిస్‌ప్లే, యూనిసోక్ టీ610 ప్రాసెసర్, 13+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Micromax, Mobile News, Mobiles, Realme, Redmi, Smartphone