Jio Postpaid Plus: ఒకే మొబైల్ కనెక్షన్... ఇంట్లో అందరికీ 4జీ డేటా... 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్'తో లాభాలు ఇవే

Jio Postpaid Plus Benefits | జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి వస్తుంది. టారిఫ్ వివరాలు ఇంకా తెలియవు. జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో టారిఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయి.

news18-telugu
Updated: August 13, 2019, 10:39 AM IST
Jio Postpaid Plus: ఒకే మొబైల్ కనెక్షన్... ఇంట్లో అందరికీ 4జీ డేటా... 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్'తో లాభాలు ఇవే
Jio Postpaid Plus: ఒకే మొబైల్ కనెక్షన్... ఇంట్లో అందరికీ 4జీ డేటా...
news18-telugu
Updated: August 13, 2019, 10:39 AM IST
జియోఫైబర్ సంచలనాలు సృష్టించబోతోంది. దాంతోపాటు జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌ను కూడా ప్రకటించింది రిలయెన్స్. అయితే ఇప్పటికే జియో పోస్ట్‌పెయిడ్ సర్వీస్ ఉంది. కానీ... 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' సర్వీస్‌లో సేవలు అదనంగా లభిస్తాయి. జియోఫైబర్ యూజర్లు 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' కూడా తీసుకోవచ్చు. వీరికి ప్లాటినమ్ గ్రేడ్ సర్వీసులు లభిస్తాయి. అంటే జియోఫైబర్ సేవల్ని ఉపయోగిస్తున్నవారికే 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' సర్వీస్ లభిస్తుంది. జియోఫైబర్ తీసుకున్నవాళ్లు 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' కూడా కావాలి అనుకుంటే జియో సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి సిమ్ సెటప్ చేస్తారు. ఇందుకోసం ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' సర్వీస్‌ను మీ డివైజులు అన్నింటికీ వాడుకోవచ్చు. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సెప్టెంబర్ 5 నుంచి అందుబాటులోకి వస్తుంది. టారిఫ్ వివరాలు ఇంకా తెలియవు. జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో టారిఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వస్తాయి.

Read this: JIO Gigafiber: సెప్టెంబర్ 5న గిగాఫైబర్ లాంఛ్... ప్రీమియం ప్లాన్‌తో టీవీ ఉచితం

మీరు ఒక 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' కనెక్షన్ తీసుకుంటే అందులోని 4జీ డేటాను మీ కుటుంబ సభ్యులకు పంచుకోవచ్చు. ఎవరికి ఎంత డేటా షేర్ చేయాలో అంత షేర్ చేయొచ్చు. డేటాను సమర్థవంతంగా, పూర్తిగా ఉపయోగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' యూజర్లకు ఇంటర్నేషనల్ రోమింగ్ తక్కువ ధరకే లభిస్తుంది. మిగతా జియో సబ్‌స్క్రైబర్లకు ఉన్న ఛార్జీల కన్నా 'జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్' యూజర్లకు ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఇక మీ ఇంటి కోసం తీసుకునే ఇంటర్నెట్ కనెక్షన్, టీవీ బిల్, మొబైల్ బిల్ ఇలాంటివన్నీ వేర్వేరుగా లేకుండా మొత్తం ఒకే ప్యాకేజీలో లభిస్తుంది.

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్... లుక్స్ అదుర్స్




ఇవి కూడా చదవండి:

Xiaomi Mi A3: ఆగస్ట్ 23న షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఫీచర్లు ఇవే
Loading...
Jio First Day First Show: సినిమా రిలీజైన రోజే ఇంట్లో టీవీలో చూడొచ్చు

WhatsApp: మీ వాట్సప్‌ని అద్బుతంగా మార్చే 8 ఫీచర్లు ఇవే
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...