Home /News /technology /

KNOW ABOUT RELIANCE JIO AIRTEL AND VODAFONE IDEA PLANS OFFERS 3GB DATA PER DAY SS

Prepaid Plans: రోజుకు 3 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే

Prepaid Plans: రోజుకు 3 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Prepaid Plans: రోజుకు 3 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

3GB Mobile Data per day | స్మార్ట్‌ఫోన్‌లో 4జీ డేటా ఎక్కువగా ఉపయోగించేవారి కోసం రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్నాయి.

    లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారా? స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు, వీడియోలు ఎక్కువగా చూస్తున్నారా? వర్క్ ఫ్రమ్ హోమ్‌లో బిజీగా ఉన్నారా? మీ స్మార్ట్‌ఫోన్‌లో రోజూ 4జీ డేటా సరిపోవట్లేదా? అయితే మీరు రోజూ 3 జీబీ డేటా అందించే ప్లాన్స్ గురించి తెలుసుకోవాలి. ఎక్కువగా రోజూ 1.5 జీబీ లేదా 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవడం అలవాటు. కానీ ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా ఈ 4జీ డేటా ఏమాత్రం సరిపోవట్లేదు. అందుకే ఎక్కువ డేటా ఇచ్చే ప్లాన్స్ కోసం యూజర్లు సెర్చ్ చేస్తున్నారు. రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రోజూ 3 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. మరి వాటిలో మీకు ఏది బెస్ట్... తెలుసుకోండి.

    Reliance Jio: రిలయెన్స్ జియోలో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3 జీబీ డేటా పొందొచ్చు. వేలిడిటీ 28 రోజులు. అంటే మొత్తం 84 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 3జీబీ లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ స్పీడ్‌లో అన్‌లిమిటెడ్ డేటా వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడొచ్చు. 1000 నిమిషాల జియో నుంచి నాన్ జియో కాల్స్ వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా యాక్సెస్ చేయొచ్చు.

    Airtel: ఎయిర్‌టెల్‌లో రూ.398 రీఛార్జ్ చేస్తే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. మొత్తం 84 జీబీ డేటా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

    Vodafone Idea: వొడాఫోన్ ఐడియాలో రూ.398 రీఛార్జ్ చేసుకుంటే రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. 28 రోజుల వేలిడిటీ ఉంటుంది. మొత్తం 84 జీబీ వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.

    ఇవి కూడా చదవండి:

    JioPOS Lite App: ఈ జియో యాప్‌తో మీరూ డబ్బులు సంపాదించొచ్చు

    Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్



    Aadhaar Services: ఈ 7 ఆధార్ సేవల్ని ఇంటి నుంచే పొందొచ్చు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans, Business, BUSINESS NEWS, IDEA, Jio, Reliance Jio, VODAFONE, Vodafone Idea

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు