Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Prepaid Recharge Plans | తక్కువ ధరలో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ కోసం వెతుకుతున్నవారికి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వేర్వేరు ప్లాన్స్ అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    మీరు తక్కువ బడ్జెట్‌లో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నారా? రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటిస్తున్నాయి. ఈ ప్లాన్స్‌లో ఇంటర్నెట్ డేటా, కాల్స్, ఎస్ఎంఎస్ లాంటి బెనిఫిట్స్ ఉంటాయి. మరి ఈ మూడు కంపెనీలు రూ.200 లోపు అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్‌లో ఏది మీకు ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

    Jio Rs 129 Plan: జియో రూ.129 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా ఉపయోగించుగకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 1000 కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు.

    Jio Rs 149 Plan: జియో రూ.149 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 1జీబీ చొప్పున 24 జీబీ డేటా ఉపయోగించుగకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 300 కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు.

    Jio Rs 199 Plan: జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 1.5 జీబీ చొప్పున 42 జీబీ డేటా ఉపయోగించుగకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. జియో నుంచి నాన్ జియోకు 1,000 కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వాడుకోవచ్చు. జియో యాప్స్ కాంప్లిమెంటరీగా ఉపయోగించుకోవచ్చు.

    Airtel Rs 98 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.98 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 6 జీబీ డేటా వాడుకోవచ్చు.

    Airtel Rs 149 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.149 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

    Airtel Rs 179 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.179 రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీటితో పాటు భారతీ ఆక్సా లైఫ్ నుంచి రూ.2 లక్షల లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ లభిస్తుంది.

    Vodafone Rs 129 Plan: వొడాఫోన్‌లో రూ.129 రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం.

    Vodafone Rs 149 Plan: వొడాఫోన్‌లో రూ.149 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 2 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం.

    Vodafone Rs 199 Plan: వొడాఫోన్‌లో రూ.199 రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 1 జీబీ డేటా వాడుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉచితం. వొడాఫోన్ ప్లే, జీ5 సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

    ఇవి కూడా చదవండి:

    Apple iPhone SE: కొత్త ఐఫోన్ వచ్చేసింది... ధర, ఫీచర్స్ వివరాలివే

    SBI: ఏటీఎం కార్డులు ఉన్నవారికి ఎస్‌బీఐ గుడ్ న్యూస్

    EPF Claim: ఈపీఎఫ్ విత్‌డ్రాలో సమస్యలున్నాయా? ఇలా చేయండి
    Published by:Santhosh Kumar S
    First published: