4G Data: రోజూ 2జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్‌లో ఏది బెస్ట్

4G Data: రోజూ 2జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్‌లో ఏది బెస్ట్ (ప్రతీకాత్మక చిత్రం)

4G Data Plans | మీరు రోజూ 2 జీబీ 4జీ డేటా ఉపయోగిస్తున్నట్టైతే కాస్త ఎక్కువ ధర ఉన్న రీఛార్జ్ ప్లాన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్‌లో ఏది బెస్ట్ తెలుసుకోండి.

  • Share this:
    మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా 4జీ డేటా వాడుతుంటారా? రోజూ 2జీబీ డేటాను మొత్తం వాడేస్తున్నారా? లేదా రోజూ 2జీబీ డేటా ఇచ్చే రీఛార్జ్ ప్లాన్ కోసం వెతుకుతున్నారా? అయితే రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్‌ని ఓసారి చెక్ చేయండి. ఈ మూడు టెలికామ్ కంపెనీలు రోజూ 2జీబీ డేటాతో రీఛార్జ్ ప్లాన్స్‌ను కస్టమర్లకు అందిస్తున్నాయి. అయితే వొడాఫోన్, ఐడియాతో పోలిస్తే రిలయెన్స్ జియో ప్లాన్స్ తక్కువ ధరకే లభిస్తాయి. మరి ఈ మూడు కంపెనీలు రోజూ 2 జీబీ డేటా అందించే ప్లాన్స్‌కు ఏఏ ధరలు ఫిక్స్ చేశాయో తెలుసుకోండి.

    Reliance Jio: రిలయెన్స్ జియోలో రోజూ 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ మూడు ఉన్నాయి. రూ.249, రూ.444, రూ.599 రీఛార్జ్ చేసుకొని రోజూ 2 జీబీ 4జీ డేటాను వాడుకోవచ్చు. జియో నుంచి జియోకు అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉచితం. రూ.249 ప్లాన్‌కు 28 రోజుల వేలిడిటీతో 1000 నిమిషాల నాన్ జియో కాల్స్, రూ.444 ప్లాన్‌కు 46 రోజుల వేలిడిటీతో 2,000 నిమిషాల నాన్ జియో కాల్స్, రూ.599 ప్లాన్‌కు 84 రోజుల వేలిడిటీతో 3,000 నిమిషాల నాన్ జియో కాల్స్ లభిస్తాయి.

    Vodafone: వొడాఫోన్‌లో కూడా రోజూ 2 జీబీ డేటా ఇచ్చే మూడు ప్లాన్స్ ఉన్నాయి. రూ.299, రూ.449, రూ.699 రీఛార్జ్ చేయాలి. రూ.299 రీఛార్జ్ చేస్తే రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిడెట్ కాలింగ్, వొడాఫోన్ ప్లే, జీ5 యాప్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి. ఈ ప్లాన్ వేలిడిటీ 28 రోజులే. రూ.449 రీఛార్జ్ చేసినా అవే బెనిఫిట్స్ వస్తాయి. వేలిడిటీ 46 రోజులు. రూ.699 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది.

    Airtel: ఎయిర్‌టెల్‌లో కూడా మూడు రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. రూ.349, రూ.449, రూ.698 ప్లాన్స్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రూ.349 ప్లాన్ వేలిడిటీ 28 రోజులు, రూ.449 ప్లాన్ వేలిడిటీ 56 రోజులు, రూ.698 వేలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్స్‌తో రోజూ 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

    ఇవి కూడా చదవండి:

    March Bank Holidays: మార్చిలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు... ప్లాన్ చేసుకోండి ఇలా

    Luxury Trains: ఈ లగ్జరీ రైళ్లల్లో ప్రయాణం అద్భుతం... టికెట్ ధర తెలిస్తే షాకే



    Save Money: మీకు రూ.1 కోటి కావాలంటే నెలనెలా జమ చేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published: