హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Prepaid Plans: రూ.300 లోపు Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

Prepaid Plans: రూ.300 లోపు Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Prepaid Plans Under Rs 300 | మీరు రిలయెన్స్ జియో కస్టమరా? ఎయిర్‌టెల్ నెట్వర్క్ వాడుతున్నారా? వొడాఫోన్ ఐడియా-Vi సిమ్ ఉపయోగిస్తున్నారా? జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా నుంచి రూ.300 లోపు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi రూ.300 లోపు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. కస్టమర్లు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. అయితే ప్రీపెయిడ్ ప్లాన్‌ను బట్టి వాయిస్ కాలింగ్, డేటా బెనిఫిట్స్ మారతాయి. మరి ఏ ప్లాన్‌పై ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకోండి.

  Jio Rs 249 Plan: రిలయెన్స్ జియో రూ.249 రీఛార్జ్ చేసేవారికి 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేయొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  Jio Rs 199 plan: రిలయెన్స్ జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. డొమెస్టిక్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 1.5 జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. జియో యాప్స్‌కు కాంప్లిమెంటరీగా సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

  Smartphone: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

  Gold Price: బడ్జెట్ ఎఫెక్ట్‌... రూ.1890 తగ్గిన బంగారం ధర

  Airtel Rs 219 plan: ఎయిర్‌టెల్‌లో రూ.219 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మెంబర్‌షిప్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి.

  Airtel Rs 249 plan: ఎయిర్‌టెల్‌లో రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మెంబర్‌షిప్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి.

  Airtel Rs 279 plan: ఎయిర్‌టెల్‌లో రూ.279 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మెంబర్‌షిప్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి. వీటితో పాటు ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.100 క్యాష్ బ్యాక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్ లభిస్తాయి.

  5G Smartphones: 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.30,000 లోపు 6 మొబైల్స్ ఇవే

  SBI Car Loan: డౌన్ పేమెంట్ లేకుండా 100 శాతం లోన్‌తో ఈ కార్ ఇంటికి తీసుకెళ్లొచ్చు

  Airtel Rs 289 plan: ఎయిర్‌టెల్‌లో రూ.289 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మెంబర్‌షిప్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి. వీటితో పాటు 28 రోజుల జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, అప్‌స్కిల్‌లో ఉచితంగా ఆన్‌లైన్ కోర్స్ లభిస్తాయి.

  Airtel Rs 298 plan: ఎయిర్‌టెల్‌లో రూ.298 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మెంబర్‌షిప్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హెలో ట్యూన్స్, అప్‌స్కిల్‌లో ఉచితంగా ఆన్‌లైన్ కోర్స్ లభిస్తాయి.

  Airtel Rs 299 plan: ఎయిర్‌టెల్‌లో రూ.299 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మెంబర్‌షిప్, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా హెలో ట్యూన్స్, అప్‌స్కిల్‌లో ఉచితంగా ఆన్‌లైన్ కోర్స్, ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.100 క్యాష్ బ్యాక్ లభిస్తాయి.

  LIC Policy: ఎల్ఐసీ పాలసీ ఉందా? అయితే ఈ శుభవార్త మీకే

  SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... ఇక ఈ సర్వీస్ కోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు

  Vi Rs 218 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.218 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 6 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ లభిస్తుంది.

  Vi Rs 219 Plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.219 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1 జీబీ డేటా వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ బేసిక్ యాక్సెస్ లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా అదనంగా లభిస్తుంది.

  Vi Rs 248 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.248 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 8జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ లభిస్తుంది.

  Vi Rs 249 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ లభిస్తుంది. వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా అదనంగా లభిస్తుంది. రోల్ ఓవర్ డేటా వర్తిస్తుంది. అంటే వారంలో మొదటి 5 రోజుల్లో ఉపయోగించని డేటాను శని, ఆదివారాలు ఉపయోగించుకోవచ్చు.

  Vi Rs 269 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.269 రీఛార్జ్ చేస్తే 56 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 4జీబీ డేటా, 600ఎస్ఎంఎస్‌లు ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ లభిస్తుంది.

  Vi Rs 299 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.299 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 4జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ క్లాసిక్ యాక్సెస్ లభిస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: AIRTEL, Airtel recharge plans, Jio, Reliance Jio, VODAFONE, Vodafone Idea

  ఉత్తమ కథలు