మీరు రిలయెన్స్ జియో కస్టమరా? ఎయిర్టెల్ నెట్వర్క్ వాడుతున్నారా? తక్కువ ధరలో ప్రీపెయిడ్ ప్లాన్ కోసం వెతుకుతున్నారా? రూ.250 లోపు రిలయెన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా-Vi, బీఎస్ఎన్ఎల్ నుంచి ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటే వాయిస్ కాల్స్‌తో పాటు, డేటా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇటీవల రిలయెన్స్ జియో ప్లాన్స్ అప్డేట్ అయ్యాయి. కాట్టి బెనిఫిట్స్‌లో మార్పులు కూడా ఉంటాయి. మరి రిలయెన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా-Vi, బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.250 లోపు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకోండి.
Jio Rs 249 Plan: రిలయెన్స్ జియో రూ.249 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్స్‌కి యాక్సెస్ లభిస్తుంది.
Jio Rs 199 Plan: రిలయెన్స్ జియో రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్స్‌కి యాక్సెస్ లభిస్తుంది.
Jio Rs 149 Plan: రిలయెన్స్ జియో రూ.149 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. జియో యాప్స్‌కి యాక్సెస్ లభిస్తుంది.
Airtel Rs 199 plan: ఎయిర్‌టెల్‌లో రూ.199 రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజీ 1జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు ఉచితం. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తుంది. దీంతో పాటు భారతీ ఆక్సా లైఫ్ ఇన్స్యూరెన్స్ కూడా లభిస్తుంది.
Airtel Rs 219 plan: ఎయిర్‌టెల్‌లో రూ.219 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తుంది.
Airtel Rs 249 plan: ఎయిర్‌టెల్‌లో రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ సబ్స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్, ఉచితంగా ఆన్లైన్ కోర్సులకు యాక్సెస్ లభిస్తుంది. ఫాస్ట్ ట్యాగ్‌పై రూ.150 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
Vi Rs 199 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.199 రీఛార్జ్ చేస్తే 24 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది.
Vi Rs 249 plan: వొడాఫోన్ ఐడియా-Vi రూ.249 రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వీఐ మూవీస్, టీవీ యాక్సెస్ లభిస్తుంది.
BSNL Rs 247 Plan: బీఎస్ఎన్ఎల్ రూ.247 ప్లాన్ రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 250 నిమిషాలు మాత్రమే కాల్స్ చేసే అవకాశం ఉంటుంది. రోజూ 3జీబీ డేటా ఉపయోగించొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. వేలిడిటీ 28 రోజులు.
BSNL Rs 199 Plan: బీఎస్ఎన్ఎల్ రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 2జీబీ డేటా ఉపయోగించొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. వేలిడిటీ 28 రోజులు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.