ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా 75శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియాను అతిగా (Social media over use) ఉపయోగిస్తున్నారు. తాజాగా వెలువడిన సర్వేలో University of Michigan ఇలాంటి షాకింగ్ విషయాలు బోలెడు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు 60శాతానికి పైగా పేరెంట్స్ తాము బుల్లియింగ్, సైబర్ బుల్లియింగ్ (cyber-bullying) బారిన పడినట్టు చెప్పుకొచ్చారు. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మందికి పైగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వచ్చాయని, శారీరకంగా తాము స్తబ్దుగా మారామని, డిప్రెషన్, ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులు తమలో వచ్చాయని చెప్పినట్టు సర్వేలో సేకరించిన డేటా వెల్లడిస్తుండడం విశేషం.
కోవిడ్-19తో COVID-19 తాము పిల్లల ఆరోగ్యంపై బెంగపెట్టుకున్నట్టు సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులు వివరించారు. కుటుంబాలకు ఇదో పెద్ద సవాలుగా మారింది. తమ దినచర్యలో వచ్చిన విపరీతమైన మార్పుల కారణంగా తమ ఆరోగ్యంపై దీని ప్రభావం చాలా నెగటివ్ గా ఉండచ్చని దిగులు చెందుతున్నారు. చిన్నపిల్లల వైద్యుల Ann Arbor అభిప్రాయం ప్రకారం చిన్నారుల లైఫ్ స్టైల్ లో వచ్చిన భారీ మార్పులు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. సర్వేలో భాగంగా 2,027 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించారు. కోవిడ్-19 ప్రభావం యువత, చిన్నారుల తల్లిదండ్రుల్లో ఏస్థాయిలో ఉంటుందో అన్న ఆందోళనను సర్వేలో అంచనా వేశారు. వీరి ప్రపంచం తలకిందులైనట్టు సర్వేలో తేలింది.
సైబర్-బుల్లియింగ్
పిల్లలు అతిగా సోషల్ మీడియా వాడటం అతిపెద్ద నంబర్ 1 సమస్యగా 72శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. ఆతరువాతి స్థానంలో సైబర్-బుల్లియింగ్, ఆన్ లైన్ హెరాస్మెంట్, ఇంటర్నెట్ సేఫ్టీ (internet safety) వంటి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చిన పేరెంట్స్ అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయని సర్వేలో పాల్గొన్నవారు కుండబద్ధలు కొట్టారు. తమలో యాంక్జ్సైటీ, సుసైడల్ టెండెన్సీలు తలెత్తినట్టు వీరు వివరించారు.
వ్యసనాలకు బానిసలవుతున్న టీనేజర్స్
కొందరు టీనేజీ పిల్లల తల్లిదండ్రులైతే తమ పిల్లలు పలు వ్యసనాలకు బానిసలవుతున్నట్టు వాపోయారు. ధూమపానం, ఆల్కహాల్, డ్రగ్స్, e-సిగరెట్ల వ్యాపింగ్ విపరీతంగా పెరుగుతోందని, ఇది టీనేజర్లను వ్యవసపరులను చేస్తోందంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేకాదు తమ పిల్లలకు ఎక్కడ కోవిడ్-19 సోకుతుందోనన్న భయం తల్లిదండ్రులను భయపెడుతోందని సర్వేలో తేలింది. ఇదే సమయంలో రేసిజం విపరీతంగా పెరిగిందని నల్లజాతి వారు ఫిర్యాదు చేస్తున్నారు. తమ టీనేజర్లు, చిన్నారులపై జాత్యహంకార (racism) దాడులు ఈమధ్య కాలంలో బాగా పెరిగినట్టు వీరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Facebook, Instagram, Social Media, Twitter