App: స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే... మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

Mobile App | యూజర్ల ప్రమేయం లేకుండా ప్రీమియం థర్డ్ పార్టీ సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్టే తేలింది. అంటే... మీరు ఈ కీబోర్డ్ యాప్ వాడుతున్నట్టైతే మీకు తెలియకుండా మీ అకౌంట్ల నుంచి పేమెంట్స్ జరిగిపోతుంటాయి.

news18-telugu
Updated: November 8, 2019, 11:43 AM IST
App: స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే... మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ
App: స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉంటే... మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీ స్మార్ట్‌ఫోన్ చాలా సేఫ్ అని మీరు అనుకున్నా... ఏదో ఓ రూపంలో ముప్పు పొంచుకొస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు మాల్‌వేర్ ఎటాక్స్ జరుగుతూనే ఉంటాయి. అలాంటి యాప్స్‌ని గుర్తించి గూగుల్ నిత్యం తొలగిస్తూనే ఉన్నా కొత్తకొత్త యాప్స్‌లో మాల్‌వేర్ బయటపడుతోంది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి వచ్చింది. ai.type కీబోర్డ్ యాప్‌లో మాల్‌వేర్ ఉన్న విషయం యూజర్లను కలకలం రేపుతోంది. మొబైల్ టెక్నాలజీ సంస్థ అప్‌స్ట్రీమ్‌కు చెందిన పరిశోధకులు ai.type కీబోర్డ్ యాప్‌ యూజర్లను దోచుకున్నట్టు బయటపెట్టారు. ఈ యాప్ కీబోర్డ్ ఉపయోగించే యూజర్ల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. యూజర్ల ప్రమేయం లేకుండా ప్రీమియం థర్డ్ పార్టీ సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నట్టే తేలింది. అంటే... మీరు ఈ కీబోర్డ్ యాప్ వాడుతున్నట్టైతే మీకు తెలియకుండా మీ అకౌంట్ల నుంచి పేమెంట్స్ జరిగిపోతుంటాయి.

ఇప్పటివరకు 1.4 కోట్ల పేమెంట్ రిక్వెస్ట్‌లు వెళ్లినట్టు అప్‌స్ట్రీమ్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. సెక్యూరిటీ-డీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆ రిక్వెస్టులను బ్లాక్ చేశారు. 110,000 డివైజ్‌ల నుంచి ఈ రిక్వెస్ట్‌లు వచ్చినట్టు గుర్తించారు. వాస్తవానికి ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి 2019 జూన్‌లోనే గూగుల్ తొలగించినా అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నవారు చిక్కుల్లో ఉన్నట్టే. ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో లేకపోయినా థర్డ్ పార్టీ యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉంది. అక్కడ్నుంచి లక్షలాది మంది డౌన్‌లోడ్స్ చేస్తూనే ఉన్నారు. మీరు ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే డిలిట్ చేయడం మంచిది.

Indian Railways: రైలు పట్టాలపై ప్రత్యక్షమైన యముడు... బెదిరిపోయిన ప్రయాణికులు





ఇవి కూడా చదవండి:

Credit Card: మీ క్రెడిట్ కార్డుపై లిమిట్ తక్కువగా ఉంటే పెంచుకోండి ఇలా

Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి
Loading...
WhatsApp: వాట్సప్‌ గ్రూప్‌లో కొత్త ఫీచర్... సెట్టింగ్స్ ఇవే
First published: November 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com