హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

AHA New CEO: కీలక నిర్ణయం తీసుకున్న ఆహా.. కొత్త సీఈఓ నియామకం..

AHA New CEO: కీలక నిర్ణయం తీసుకున్న ఆహా.. కొత్త సీఈఓ నియామకం..

AHA New CEO: కీలక నిర్ణయం తీసుకున్న ఆహా.. కొత్త సీఈఓ నియామకం..

AHA New CEO: కీలక నిర్ణయం తీసుకున్న ఆహా.. కొత్త సీఈఓ నియామకం..

ఓటీటీ లో అత్యంత ఆదరణ పొందిన ప్లాట్‌ఫామ్‌ ఆహా. ఇప్పటికే తెలుగులో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ ప్లాట్‌ఫామ్‌ త్వరలోనే ప్రాంతీయ భాషల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఓటీటీ లో(OTT) అత్యంత ఆదరణ పొందిన ప్లాట్‌ఫామ్‌ ఆహా(AHA). ఇప్పటికే తెలుగులో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న ఈ ప్లాట్‌ఫామ్‌ త్వరలోనే ప్రాంతీయ భాషల్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగానే.. రాబోయే మూడేళ్లలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఇక తాజాగా ఆహా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సీఈఓగా ఉన్న అజిత్ ఠాకూర్‌ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఆహా స్టూడియోలో ముఖ్యమైన విభాగాలను పర్యవేక్షించనున్నారు. తాజాగా అజిత్ ఠాకూర్ స్థానంలో రవికాంత్ సబ్నవీస్ కొత్త సీఈఓగా(New CEO) బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ సందర్భంగా ఆహా సంస్థ ప్రమోటర్ రాము రావు జూపల్లి మాట్లాడుతూ.. కొత్త సీఈఓగా రవికాంత్ ఎన్నికైనందుకు సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో పరిశ్రమలను విస్తరించిన అననుభం ఆహాకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భారతదేశంలో స్వదేశీ వ్యాపారాల పెరుగుదల, కొత్త వెంచర్లను ప్రోత్సహించడం మరియు అభివృద్ధి చెందుతున్న ప్రతిభను పెంపొందించడం అతని ప్రత్యేకమని అన్నారు. రవికాంత్ యొక్క అసమానమైన నాయకత్వంలో దాని తదుపరి దశకు ఆహాను నడిపిస్తారని మేము విశ్వసిస్తున్నామని అన్నారు.

ఠాకూర్‌ని బోర్డులోకి తీసుకోవడంపై ఆహా ప్రమోటర్ అల్లు అరవింద్ మాట్లాడారు. "అజిత్ సంస్థ ప్రారంభించినప్పటి నుండి ఆహాతో ఉన్నారు. అతను తెలుగువారి హృదయాలను కొల్లగొట్టే బ్రాండ్‌గా ఆహాను నిర్మించగలిగాడని అభినందించారు. తెలుగు నుంచి ఆహాను తమిళంలోకి విస్తరించారని అన్నారు. అతడి సేవలకు గుర్తింపుగానే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌గా ప్రమోట్ చేస్తున్నామని తెలిపారు. అతడు కొత్త పోస్టుకు వెళ్లినా.. ఆహాకు మార్గదర్శకత్వం చేస్తూనే ఉంటాడని అన్నారు. అంతే కాకుండా.. ఆహా స్టూడియోతో సహా కొత్త కార్యక్రమాలను నిర్మించడంపై దృష్టి పెడతాడని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

Anganwadi Jobs: మహిళా అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

కొత్త సీఈఓగా ఎన్నికైన సబ్నవిస్‌కు 30 సంవత్సరాల అనుభవం ఉంది. స్టార్ టీవీ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, ఫోర్స్ ఇండియా ఫార్ములా వన్ టీమ్, యునైటెడ్ బ్రూవరీస్, హీంజ్ ఇండియా మరియు కొనాగ్రా ఫుడ్స్‌తో సహా విభిన్న పరిశ్రమలలో సంస్థల్లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. సబ్నవిస్ ప్రస్తుతం TiE - ముంబై యొక్క చార్టర్ మెంబర్‌గా.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వెస్ట్రన్ రీజినల్ కౌన్సిల్ యొక్క స్టార్టప్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్-కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు.

రవికాంత్ సబ్నవిస్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబం చూసి ఆనందించేలా ఆహాలో సరికొత్త షోలు, రోజువారీ సిరీస్ నుంచి సినిమాలు, గేమ్‌లు, వార్తలతో వినోద భరితంగా మారుస్తామని తెలిపారు.  ఇప్పటికే అన్ని జోనర్స్ ను కవర్ చేస్తూ.. ప్రతీ ప్రేక్షకుడి ఆదరాభిమానాలు చోరగొంటున్న ఆహాలో ఇక నుంచి ఇంత కంటే మించి వినోదభరితంగా కంటెంట్ ను అందించే ప్రయత్నం చేస్తానన్నారు. భారతదేశం నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కథలను ఎలా చెప్పాలో పునర్నిర్వచించాలనే లక్ష్యంతో తాము ఉన్నట్లు తెలిపారు.

Ram Charan : సూపర్ స్టైలీష్ లుక్‌లో రామ్ చరణ్ .. అదిరిన గేమ్ ఛేంజర్ ఫస్ట్ లుక్..

విస్తరణ ఇలా.. 

తెలుగులో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ను 2020లో ప్రారంభించారు. 100 శాతం లోకల్ కంటెంట్ ను అందించాలనే ఉద్దేశ్యంతో దీనిని తీసుకొచ్చారు. ప్రతీ శుక్రవారం.. నెలలో 4 నుంచి 5 శుక్రవారాల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల విడుదలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తెలుగులో అద్భుతంగా విజయవంతం అయిన ఈ ఓటీటీ ఇటీవల తమిళంలో కూడా ప్రారంభించారు. త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది.

First published:

Tags: 5g technology, Aha app, Cinema, New ceo

ఉత్తమ కథలు