Home /News /technology /

KEEWAY K LIGHT 250V LAUNCHED IN INDIA AND THIS IS SMALLEST VTWIN MOTORCYCLE UMG GH

Keeway: ఇండియాలో కీవే K-Light 250V బైక్ లాంచ్.. ఈ స్మాలెస్ట్ V-ట్విన్ బైక్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇండియాలో కొత్త బైక్ లాంచ్

ఇండియాలో కొత్త బైక్ లాంచ్

ప్రముఖ హంగేరియన్ వాహన తయారీ సంస్థ కీవే (Keeway) ఇండియాలో అద్భుతమైన టూవీలర్స్‌ లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ కంపెనీ భారత్‌లో మరో అదిరిపోయే బైక్ తీసుకొచ్చింది. కీవే మోటార్స్ ఈరోజు కె-లైట్ 250V (Keeway K-Light 250V) బైక్‌ను రూ.2.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభం ధరతో లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
ప్రముఖ హంగేరియన్ వాహన తయారీ సంస్థ కీవే (Keeway) ఇండియాలో అద్భుతమైన టూవీలర్స్‌ లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ కంపెనీ భారత్‌లో మరో అదిరిపోయే బైక్ తీసుకొచ్చింది. కీవే మోటార్స్ ఈరోజు కె-లైట్ 250V (Keeway K-Light 250V) బైక్‌ను రూ.2.89 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభం ధరతో లాంచ్ చేసింది. 8,500 rpm వద్ద గరిష్టంగా 18.7hp, 5,500 rpm వద్ద గరిష్టంగా 19Nm ఉత్పత్తి చేసే 249cc V-ట్విన్ ఇంజన్‌తో ఈ క్రూయిజర్ బైక్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఎయిర్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ 8-వాల్వ్ ఇంజన్‌ను 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఈ బైక్ మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. బైక్ ధరలు, ఫీచర్లపై ఇప్పుడో లుక్కేద్దాం.

రెండు-సిలిండర్ల పిస్టన్ ఇంజన్ లేదా V-ట్విన్ ఇంజన్‌తో వచ్చిన ఈ బైక్ డిస్‌ప్లేస్‌మెంట్ చాలా చిన్నగా ఉండటం గమనార్హం. ఈ బైక్ వీల్‌బేస్ 1,530 మిమీ ఉండగా.. సీటు హైట్ 715 మిమీ ఉంది. అంటే ఈ బైక్ సీటు స్పెండర్ ప్లస్ వంటి బైక్స్‌ సీట్ల కంటే చాలా తక్కువ ఎత్తు ఉంటుంది. దీని బరువు 179 కిలోలు. ఫ్యూయల్ ట్యాంక్ 20 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. బైక్‌కు రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు అందించారు. డ్యూయల్-ఛానల్ ABS కూడా ఆఫర్ చేశారు. ముందు టైర్ సైజు 120/80-16 ఉండగా, వెనుక టైర్ సైజ్ 140/70-16గా ఉంది. ఈ బైక్ ఫార్వర్డ్-సెట్ ఫుట్‌పెగ్‌లు, వైడ్ హ్యాండిల్‌బార్‌తో సౌకర్యవంతమైన రైడ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ముందు, వెనుక హైడ్రాలిక్ సస్పెన్షన్‌లో టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది.



హెడ్‌లైట్ క్లస్టర్‌లో రౌండ్ DRL ద్వారా ఫ్రేమ్ చేసిన చిన్న ఎల్ఈడీ ఉంటుంది. టెయిల్ ఎండ్‌లో ఎల్ఈడీ బ్రేక్ లైట్ కూడా ఉంది. ఈ బైక్ మ్యాట్ బ్లూ, మ్యాట్ డార్క్ గ్రే, మాట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. మ్యాట్ బ్లూ ధర రూ. 2.89 లక్షలు కాగా, మ్యాట్ డార్క్ గ్రే ధర రూ. 2.99 లక్షలు, మ్యాట్ బ్లాక్ కలర్ బైక్ ధర 3.09 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈవన్నీ కూడా ఎక్స్-షోరూమ్ ధరలు అని గమనించాలి. డిజైన్ విషయానికొస్తే.. ఈ బైక్ మోడిఫైడ్ బజాజ్ అవెంజర్ లేదా హ్యార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాబ్ వంటి బైక్స్ లాగా కనిపిస్తుంది. ఇందులో మెటాలిక్ ఫినిషింగ్‌లో సైడ్ ప్యానెల్‌లు, అల్లాయ్ వీల్స్, షార్ట్ టెయిల్ సెక్షన్ హైలెట్‌గా నిలుస్తున్నాయి.

సిటీల్లో తిరగడానికి.. అలాగే సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది. పిలియన్ పెద్దగా కనిపించడం లేదు కానీ సీటు సౌకర్యవంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. సుదూర ప్రయాణాలకు ఈ సీటు అనుకూలంగా ఉండొచ్చు. కీవే కనెక్ట్ ఫీచర్ కూడా అందించారు. ఈ ఫీచర్‌తో బైక్‌ను 2.5 మీటర్లలోపు ట్రాక్ చేయవచ్చు. జియో-ఫెన్సింగ్, రైడ్ రికార్డులు, లొకేషన్ షేరింగ్, మ్యాగ్జిమమ్‌ స్పీడ్ లిమిట్‌ను సెట్ చేయడం వంటి ఇతర ఫీచర్లు సైతం ఉన్నాయి. కీవే కె-లైట్ 250 క్రూయిజర్ బైక్ క్లాసిక్ 350 వంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల నుంచి పోటీని ఎదుర్కొంటుంది.
Published by:Mahesh
First published:

Tags: Auto News, Bike, New bikes, Sports bike

తదుపరి వార్తలు