హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఐఫోన్‌ ఆర్డర్‌ పెట్టాడు.. డెలివరీ అయిన ఐటెం చూసి షాక్ అయ్యాడు.. చివరకు ఇలా..

Flipkart: ఐఫోన్‌ ఆర్డర్‌ పెట్టాడు.. డెలివరీ అయిన ఐటెం చూసి షాక్ అయ్యాడు.. చివరకు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కస్టమర్లకు కొన్ని రకాల ఈ-కామర్స్ ఫ్రాడ్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఐఫోన్‌ ఆర్డర్‌ పెడితే నిర్మా సబ్బుతో పాటు కీప్యాడ్‌ ఫోన్‌ డెలివరీ చేశారు. తర్వాత ఏం జరిగిందంటే..

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుతం ఆన్‌లైన్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. వంట సామగ్రి నుంచి యాపిల్‌ ఐఫోన్‌ వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌(Order) చేస్తున్నారు. అయితే అదే స్థాయిలో మోసాలు కూడా జరుగుతున్నాయి. కస్టమర్లకు కొన్ని రకాల ఈ-కామర్స్ ఫ్రాడ్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. ఐఫోన్‌ ఆర్డర్‌ పెడితే నిర్మా సబ్బుతో పాటు కీప్యాడ్‌ ఫోన్‌ డెలివరీ(Delivery) చేశారు. అది చూసి షాక్‌ తిన్న కస్టమర్‌ కన్సూమర్‌ కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌కు రూ.25,000 ఫైన్‌ వేస్తూ కమిషన్‌ దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చింది.

అసలు కథ ఏంటంటే

కర్నాటక రాష్ర్టంలో జిల్లా కేంద్రమైన కొప్పల్ పట్టణానికి చెందిన ఎస్ హర్ష అనే విద్యార్థి రెండేళ్ల కిందట అంటే 2021లో ఆన్‌లైన్‌లో రూ.48,999 విలువైన ఐఫోన్ 11 (గ్రీన్‌ 650 జీబీ) కోసం ఆర్డర్ చేశాడు. దాని బదులు 140 గ్రాములు ఉన్న డిటర్జెంట్‌ సోప్‌, చిన్న కీ ప్యాడ్‌ ఫోన్‌ డెలివరీ అయ్యాయి. బాక్స్‌ విప్పి చూసిన హర్ష షాక్‌ అయ్యాడు. తనకు న్యాయం కావాలంటూ కొప్పల్‌లోని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. కొప్పల్‌లోని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. ఐఫోన్‌ ఆర్డర్‌ చేస్తే నిర్మా సబ్బు డెలివరీ అయిందని ఫిర్యాదు చేశాడు. దీనికి కారణమైన ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు తనకు విక్రయించిన సేన్ రిటైల్స్‌పై అదే ఏడాది ఫిర్యాదు చేశాడు.

కన్సూమర్‌ ఫోరం తీర్పు

ఈ ఫిర్యాదుపై కన్సూమర్‌ ఫోరం విచారణ చేపట్టింది. ఫోరం ఛైర్మన్ ఎ.జి మల్దార్, మహిళా సభ్యురాలు జి.ఇ సౌభాగ్యలక్ష్మి, మరో సభ్యులు జి.ఎస్ పాటిల్‌లతో కూడిన కమిషన్ ఇటీవల తీర్పు వెలువరించింది. ఐఫోన్‌కు బదులుగా వేరే వాటిని డెలివరీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ ఘటనలో దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిటైలర్‌కు మొట్టికాయలేసింది.

తమ సేవల్లో లోపం కారణంగా కస్టమర్‌ను ఇబ్బందులకు గురి చేసినందుకు, అతడిని మానసికంగా వేధించినందుకు సంస్థతో పాటు రిటైల్‌కు కూడా జరిమానా విధించింది. ఆ కస్టమర్‌కు రూ.25 వేలు జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అంతేకాకుండా ఫోన్‌ ఖరీదును రూ.48,999 మొత్తాన్ని 8 నెలల్లోగా కస్టమర్‌కు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది.

Central Scheme: గుడ్ న్యూస్.. విద్యార్థులకు రూ.10 లక్షలు ఇస్తున్న కేంద్ర పథకం..

బాధ్యత వహించాల్సిందే..

ఈ కేసును ఉదహరిస్తూ కమిషన్‌ కొన్ని విషయాల గురించి ప్రస్తావించింది. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో ప్రతిఒక్కరూ ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ సేవలను వినియోగించుకుంటున్నారు. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతున్నాయి. వారికి బాధ్యతాయుతమైన సేవలు అందించాల్సిన అవసరం సదరు ఈ కామర్స్‌ సంస్థతో పాటు, రిటైలర్‌కు కూడా ఉంటుందని సూచించింది. వారి నిర్లక్ష్యంతోనే కొన్ని సందర్భాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని కమిషన్‌ మండిపడింది.

కస్టమర్స్‌ అవసరాలను ఆసరాగా చేసుకుని వారిని మోసం చేసే హక్కు ఎవరికీ లేదని వినియోగదారుల హక్కుల సంఘం అభిప్రాయపడింది. కమిషన్‌ తీర్పును అభినందిస్తూ నెటిజన్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వాటితో అయినా ఆన్‌లైన్‌ డెలివరీలు సక్రమంగా జరుగుతాయని భావిస్తున్నారు.

First published:

Tags: 5g technology, Iphone, Technology

ఉత్తమ కథలు