హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..

Smart Tv: స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరల్లో లభ్యం.. కేవలం రూ.7,990 మాత్రమే..

smart tv

smart tv

స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కార్బన్ తాజాగా స్మార్ట్ టీవీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకే సారి మూడు ఎల్​ఈడీ స్మార్ట్​టీవీలను లాంచ్​ చేసింది. కంపెనీ తన ఆఫ్​లైన్​ మార్కెట్​ను విస్తరించుకునేందుకు రిలయన్స్ డిజిటల్​​తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఇంకా చదవండి ...

స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కార్బన్ తాజాగా స్మార్ట్ టీవీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకే సారి మూడు ఎల్​ఈడీ స్మార్ట్​టీవీలను లాంచ్​ చేసింది. కంపెనీ తన ఆఫ్​లైన్​ మార్కెట్​ను విస్తరించుకునేందుకు రిలయన్స్ డిజిటల్​​తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఈ స్మార్ట్​టీవీలను రిలయన్స్​ డిజిటల్​ స్టోర్స్​లలో కొనుగోలు చేయవచ్చు. భారత ప్రభుత్వం చేపట్టిన 'మేడ్ ఇన్ ఇండియా', 'మేడ్ ఫర్ ఇండియా' చొరవతో ఈ మూడు ఎల్​ఈడీ స్మార్ట్​టీవీలను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్​టీవీలలో క్వాలిటీ డిజైన్​, ఇన్​ బిల్ట్​ యాప్ స్టోర్​ను అందించింది. స్మార్ట్​ఫోన్​తో ఈ స్మార్ట్​టీవీని కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాగా, రాబోయే రెండేళ్లలో 15 మోడళ్లకు స్మార్ట్​ ఎల్​ఈడీ టీవీ మార్కెట్​ను విస్తరించాలని కార్బన్​ లక్ష్యంగా పెట్టుకుంది.

Amazon Final Days Offers: అమెజాన్ ఫైనల్ డేస్ ఆఫర్స్.. తగ్గిన స్మార్ట్ ఫోన్ ధరలు.. కొన్ని గంటల్లో ముగియనున్న ఆఫర్..


ఈ స్మార్ట్ టీవీల లాంచింగ్​పై కార్బన్ ఎండీ పర్దీప్ జైన్ మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారులు మేడ్ ఇన్​ ఇండియా ఉత్పత్తులపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే మేడ్​ ఇండియా చొరవతో ఒకేసారి మూడు స్మార్ట్​ ఎల్​ఈడీ టీవీలను లాంచ్​ చేశాం. బడ్జెట్​ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లను అందించాం” అని చెప్పారు.

Airtel KYC Fraud: ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ ముసుగులో మోసం.. ఆ కేటుగాళ్లు ఏం చేస్తారో తెలుసా..


ఇంట్లోనే థియేటర్​ ఎక్స్​పీరియన్స్​..

కార్బన్ ప్రస్తుతం 32, 39, 24 అంగుళాల స్మార్ట్​టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఎల్​ఈడీ టీవీ మొత్తం మూడు మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. KJW39SKHD, KJW32SKHD (బేజిల్​ లెస్​ డిజైన్), KJWY32SKHD పేర్లతో ఇవి విడుదలయ్యాయి. వీటితో పాటు KJW24NSHD, KJW32NSHD ఎల్​ఈడీ మోడళ్లను కూడా సంస్థ ఆవిష్కరించింది. ఈ స్మార్ట్​టీవీలు వినియోగదారులకు మంచి ఎంటర్​టైన్​మెంట్​ అనుభవాన్ని అందిస్తాయి.

Girl Alone: ఇంట్లో ఒంటరిగా బాలిక.. పక్కింట్లో అదే సమయం కోసం వేచి చూసిన యువకుడు.. చివరకు బాలిక ఇంట్లోకి వెళ్లి..


ఇవి శక్తివంతమైన సౌండ్ సిస్టమ్‌ గల బెజెల్-లెస్ డిజైన్‌తో వస్తాయి. అయితే ఏయే టీవీలకు ఎంత ధర నిర్ణయించిన విషయాన్ని మాత్రం కంపెనీ ఇప్పటివరకు రివీల్​ చేయలేదు. కానీ స్మార్ట్​ ఎల్​ఈడీ టీవీల ప్రారంభ ధర రూ. 7,990 నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఈ స్మార్ట్ టీవీలలోని బ్యూటిఫుల్ హెచ్‌డీ డిస్​ప్లే, ఫ్లోయింగ్​ సౌండ్, వైడ్​ వ్యూయింగ్​ యాంగిల్​ మంచి థియేటర్​ అనుభవాన్ని అందిస్తాయి. ఈ టీవీల్లో ప్రీ ఇన్​స్టాల్​ మూవీ బాక్స్​ను కూడా అమర్చింది. దీన్ని మల్టిపుల్​ డివైజ్​లకు కనెక్ట్​ చేసుకోవచ్చు.​

First published:

Tags: Budget, Smart TV, Technology

ఉత్తమ కథలు