'Joker' Malware: 24 యాప్స్‌లో 'జోకర్' మాల్‌వేర్... మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి

'Joker' Malware | ఇప్పటికే వీటిని డౌన్‌లోడ్ చేసుకున్నవారికి ముప్పు పొంచే ఉంది. ఈ కింద లిస్ట్‌లో ఉన్న యాప్స్‌ని గతంలో మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసినట్టైతే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.

news18-telugu
Updated: September 10, 2019, 2:48 PM IST
'Joker' Malware: 24 యాప్స్‌లో 'జోకర్' మాల్‌వేర్... మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి
'Joker' Malware: 24 యాప్స్‌లో 'జోకర్' మాల్‌వేర్... మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: September 10, 2019, 2:48 PM IST
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు షాకింగ్ న్యూస్. గూగుల్ ప్లే స్టోర్‌లోని 24 యాప్స్‌లో మాల్‌వేర్ ఉందన్న విషయం బయటపడింది. ఆ మాల్‌వేర్‌కు 'జోకర్' అని పేరు పెట్టారు సైబర్ నిపుణులు. ఒకవేళ మీ ఫోన్‌లో ఆ 24 యాప్స్ ఉంటే వెంటనే డిలిట్ చేయడం మంచిది. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ Aleksejs Kuprins 'జోకర్' మాల్‌వేర్ గురించి వెల్లడించారు. భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, మలేషియా, అమెరికా, యూకే, యూఏఈ లాంటి అనేక దేశాల్లో స్మార్ట్‌ఫోన్ యూజర్లను 'జోకర్' మాల్‌వేర్ టార్గెట్ చేసినట్టు తేలింది. ప్రస్తుతానికి 24 యాప్స్‌లో 'జోకర్' మాల్‌వేర్ ఉన్నట్టు గుర్తించారు. వీటిని సుమారు 472,000 సార్లు డౌన్‌లోడ్ చేశారని అంచనా. ఈ విషయాన్ని తెలుసుకున్న గూగుల్ వెంటనే ఆ 24 యాప్స్‌ని తొలగించింది. అయితే ఇప్పటికే వీటిని డౌన్‌లోడ్ చేసుకున్నవారికి ముప్పు పొంచే ఉంది. ఈ కింద లిస్ట్‌లో ఉన్న యాప్స్‌ని గతంలో మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసినట్టైతే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు.

'జోకర్' మాల్‌వేర్ ఉన్న ఆ 24 యాప్స్ ఇవే...


Advocate Wallpaper

Age Face
Altar Message
Antivirus Security – Security Scan


Beach Camera
Loading...
Board picture editing
Certain Wallpaper
Climate SMS
Collate Face Scanner
Cute Camera
Dazzle Wallpaper
Declare Message
Display Camera
Great VPN
Humour Camera
Ignite Clean
Leaf Face Scanner
Mini Camera
Print Plant scan
Rapid Face Scanner
Reward Clean
Ruddy SMS
Soby Camera
Spark Wallpaper

యాప్స్‌లో మాల్‌వేర్ గుర్తించడం ఇదే మొదటి సారి కాదు. గత నెలలో CamScanner స్కానింగ్ యాప్‌లో కూడా మాల్‌వేర్ ఉన్న విషయాన్ని కాస్పర్‌స్కీ బయటపెట్టింది.

Photos: రిలయెన్స్ ట్రెండ్స్‌ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి


ఇవి కూడా చదవండి:

Good News: ఆ రైలు టికెట్ బుక్ చేస్తే ఐఆర్‌సీటీసీ నుంచి ట్యాక్సీ సేవలు

Camera Tips: ఫోటోలు బాగా రావాలా? స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఎంత ఉండాలో తెలుసుకోండి

SBI Alert: ఎస్‌బీఐ కార్డు వాడుతున్నారా? ఈ విషయాలు గుర్తున్నాయా?
First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...