ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నవారికి అలర్ట్. ఆండ్రాయిడ్ యాప్స్‌ని జోకర్ మాల్‌వేర్ ముప్పుతిప్పలు పెడుతోంది. జోకర్ మాల్‌వేర్ ఉన్న యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగిస్తున్నకొద్దీ మరిన్ని యాప్స్‌లో ఈ మాల్‌వేర్ బయటపడుతోంది. ఇప్పటికే జోకర్ మాల్‌వేర్ ఉందన్న కారణంతో అనేక యాప్స్‌ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది గూగుల్. ఇప్పుడు మరో 34 యాప్స్‌లో ఈ మాల్‌వేర్ బయటపడటం ఆండ్రాయిడ్ యూజర్లను కలవరపరుస్తోంది. దీంతో జోకర్ మాల్‌వేర్ ఉన్న యాప్స్ వంద వరకు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు. ఇంకా ఎన్ని యాప్స్‌లో ఈ మాల్‌వేర్ ఉందో తెలియదు. ఈ యాప్స్ ఏవైనా ఉపయోగిస్తున్నట్టైతే యూజర్లు వెంటనే వాటిని డిలిట్ చేయడం అవసరం. గూగుల్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన 34 యాప్స్ జాబితా ఇదే.
Smartphones: మేడ్ ఇన్ చైనా ఫోన్లు వద్దా? నాన్ చైనీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే... ధర రూ.10,000 లోపే
September Smartphones: సెప్టెంబర్‌లో రిలీజైన బెస్ట్ 12 స్మార్ట్‌ఫోన్స్ ఇవే
All Good PDF Scanner
Mint Leaf Message-Your Private Message
Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
Tangram App Lock
Direct Messenger
Private SMS
One Sentence Translator – Multifunctional Translator
Style Photo Collage
Meticulous Scanner
Desire Translate
Talent Photo Editor – Blur focus
Care Message
Part Message
Paper Doc Scanner
Blue Scanner
Hummingbird PDF Converter – Photo to PDF
All Good PDF Scanner
com.imagecompress.android
com.relax.relaxation.androidsms
com.file.recovefiles
com.training.memorygame
Push Message- Texting & SMS
Fingertip GameBox
com.contact.withme.texts
com.cheery.message.sendsms (ఇదే పేరుతో రెండు యాప్స్ ఉన్నాయి)
com.LPlocker.lockapps
Safety AppLock
Emoji Wallpaper
com.hmvoice.friendsms
com.peason.lovinglovemessage
com.remindme.alram
Convenient Scanner 2
Separate Doc Scanner
ఈ 34 యాప్స్‌లో హానికరమైన జోకర్ మాల్‌వేర్ ఉంది. వీటిని ప్లేస్టోర్ నుంచి గూగుల్ డిలిట్ చేసింది. అయితే వీటిని ఇప్పటికే డౌన్‌లౌడ్ చేసినవారు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ యాప్స్ ఉపయోగిస్తే ముప్పు తప్పదు. అందుకే వెంటనే వాటిని డిలిట్ చేయాలి. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే అన్-ఇన్‌స్టాల్ చేయండి. ఈ యాప్‌కు సంబంధించిన ఇతర ఫైల్స్ ఎవైనా ఉంటే డిలిట్ చేయండి. ఆండ్రాయిడ్ యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్ కొత్తేమీ కాదు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా యాప్స్‌లో ఈ మాల్‌వేర్ బయటపడుతూ ఉంది. యూజర్ల క్లిక్స్‌ని నియంత్రించడం, ఎస్ఎంఎస్‌లను ట్రాక్ చేస్తూ ఉండటం, యూజర్ల ప్రమేయం లేకుండా అవసరం లేని పెయిడ్ ప్రీమియం సర్వీసుల్ని సబ్‌స్క్రైబ్ చేస్తూ ఉండటం జోకర్ మాల్‌వేర్ చేసే పని.