Home /News /technology /

JOB SCAMS ON WHATSAPP BE CAREFUL ON WHATSAPP JOB LINKS IF YOU CLICK THEN FACE REAL PROBLEMS GH SRD

WhatsApp Scams: వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా వచ్చే జాబ్ లింక్స్‌తో జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు..

WhatsApp Scams

WhatsApp Scams

WhatsApp Scams: ‘wa.me’తో ప్రారంభమయ్యే ఏదైనా లింక్ ప్రాథమికంగా ఒకరి WhatsApp నంబర్‌కు సంబంధించిన URL అని అభ్యర్థులు గుర్తించాలి. WhatsAppలో నంబర్‌ను యాడ్‌ చేయకుండానే ఆ వ్యక్తితో చాట్ చేయవచ్చు. కొన్నిసార్లు, లింక్‌పై క్లిక్ చేయమని మెసేజ్‌లు వస్తుంటాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
మంచి కెరీర్ ఆప్షన్‌ కోసం, ఉద్యోగాల (Jobs) కోసం ప్రయత్నిస్తున్న యువత స్కామ్‌ల బారిన పడుతున్నారు. యువతకు SMS, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా మోసగాళ్లు వల వేస్తున్నారు. చాట్-బేస్డ్‌ డైరెక్ట్ హైరింగ్ ప్లాట్‌ఫారమ్ హైరెక్ట్ (Hirect) నివేదిక ప్రకారం.. భారతదేశంలో దాదాపు 56% మంది ఉద్యోగార్ధులు తమ ఉద్యోగ వేటలో జాబ్ స్కామ్‌(Job Scam)ల ద్వారా ప్రభావితమయ్యారు. 20 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు గల ఉద్యోగార్థులు స్కామర్ల ప్రధాన లక్ష్యమని నివేదిక హైలైట్ చేసింది. నిరాశలో ఉన్న అభ్యర్థులకు అధిక జీతాల పేరిట ఆశ చూపించి, వారి నుంచి స్కామర్లు నగదు వసూలు చేస్తున్నారు.

కొన్ని జాబ్ ఆఫర్‌లు ఇచ్చేవారు బాధితులతో ఆన్‌లైన్‌లో ఉచితంగా పని చేసుకుని ప్రయోజనం పొందుతున్నారు. కొన్ని జాబ్ ఏజెన్సీలు జాబ్‌లో చేరడానికి ముందు శిక్షణ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నాయి. వాట్సాప్‌లో లేదా SMS ద్వారా జాబ్ ఆఫర్స్ అంటూ మెసేజ్‌లు పంపుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు. ‘మీరు మా ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులయ్యారు, శాలరీ రోజుకు రూ.8000. వివరాలను చర్చించడానికి దయచేసి సంప్రదించండి: http://wa.me/9191XXXXXX SSBO.’ వంటి ప్రమాదకరమైన లింక్స్‌ను స్కామర్లు పంపుతున్నారు.

‘wa.me’తో ప్రారంభమయ్యే ఏదైనా లింక్ ప్రాథమికంగా ఒకరి WhatsApp నంబర్‌కు సంబంధించిన URL అని అభ్యర్థులు గుర్తించాలి. WhatsAppలో నంబర్‌ను యాడ్‌ చేయకుండానే ఆ వ్యక్తితో చాట్ చేయవచ్చు. కొన్నిసార్లు, లింక్‌పై క్లిక్ చేయమని మెసేజ్‌లు వస్తుంటాయి.. అవి ఫిషింగ్ వెబ్‌సైట్‌కి దారి మళ్లిస్తాయి.

* డబ్బు అడుగుతారు
నిజమైన ఉద్యోగం పొందడానికి కంపెనీ హెచ్‌ఆర్ విభాగానికి ఎవరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ స్కామర్లు రిజిస్ట్రేషన్ ఛార్జీ, ఏజెన్సీ ఫీజు, అప్లికేషన్ ఛార్జీలు, ట్రైనింగ్ ఫీజు, ఆఫర్ లెటర్ ఫీజుల పేరుతో డబ్బు వసూలు చేస్తారు. మొదట ఉద్యోగం వచ్చిందని ఒప్పించి, ఆపై ఆఫర్ లెటర్‌ను విడుదల చేయడానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా డబ్బు అడుగుతారు.

ఇది కూడా చదవండి : WhatsApp: మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారి వాట్సాప్ స్టేటస్‌ను సీక్రెట్‌ గా ఎలా చూడాలి..? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

* జీతాలు రావు
డబ్బు వసూలు చేయకపోయినా.. కొన్ని చోట్ల సమయం కోల్పోతారు. అభ్యర్థికి కంపెనీ నుంచి ఫ్రాడ్ ఆఫర్ లెటర్ ఇచ్చి తమ పని ప్రారంభించమని చెప్పే జాబ్ స్కామ్‌లు ఉన్నాయి. వారికి అసైన్‌మెంట్‌లు కూడా ఇస్తారు. పని ప్రారంభంలో చాలా తీవ్రంగా కనిపిస్తుంది. అభ్యర్థి మొదటి నెల పూర్తి చేయబోతున్న తరుణంలో, అతను లేదా ఆమెకు మొదటి నెల జీతం 'ఏజెన్సీ ఫీజు'గా పొందడానికి కొంత డబ్బు చెల్లించమని చెబుతారు. తర్వాత అభ్యర్థికి ఎప్పుడూ పూర్తిగా జీతం ఇవ్వరు. ముందుగా చెప్పిన జీతంలో 10% ఇస్తుంటారు. కొన్నిసార్లు పని పూర్తయిన తర్వాత నకిలీ రిక్రూటర్లు అదృశ్యమవుతారు.

* పిరమిడ్ మార్కెటింగ్ లేదా పర్సనల్‌ డేటా థెఫ్ట్‌
కొన్నిసార్లు జాబ్ స్కామర్‌లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని చెబుతారు. కొత్త అభ్యర్థులను తీసుకురావడానికి నిర్దిష్ట కమీషన్ ఇస్తామని ఆశ చూపుతారు. ఇవి ఎక్కువగా క్లాసిక్ పిరమిడ్ మార్కెటింగ్ పథకాలు. వీటి ద్వారా సమయం, శక్తి, డబ్బు వృథా అవుతాయి. మరోవైపు కొన్ని జాబ్ స్కామ్‌లు కేవలం CV, ఇంటి చిరునామా, ప్రభుత్వ IDలు, ITRలు మొదలైన వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా సేకరిస్తుంటాయి.

ఢిల్లీ పోలీసుల సైబర్ క్రైమ్ యూనిట్ ప్రకారం.. స్కామర్లు naukari.com, shine.com వంటి జాబ్ సైట్‌ల నుంచి ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తుల బయో-డేటా/CVని బల్క్‌లో పొందుతారు. CVలో వివరాలు ఫోన్ నంబర్, ఇమెయిల్, విద్యార్హత, మునుపటి ఉద్యోగం మొదలైనవి ఉపయోగించి వల వేస్తుంటారు.

* ముందుజాగ్రత్త చర్యలు

- రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ షెడ్యూల్ మొదలైన వాటికి నిజమైన రిక్రూటర్ డబ్బు డిమాండ్ చేయరని గమనించాలి.

- మోసగాళ్లు నకిలీ ఇమెయిల్‌ నుంచి సంప్రదిస్తారు. ఉద్యోగ సహాయం కోసం ఏదైనా చెల్లింపు చేసే ముందు సంస్థ వివరాలను ధ్రువీకరించుకోవాలి.

- ఆన్‌లైన్ ఫోరమ్‌లలో సదరు సంస్థ వివరాలు చూడాలి. ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు ఉంటే అప్రమత్తం అవ్వాలి.

- ఆఫర్ నిజమైనదా కాదా? తెలుసుకోవడానికి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాలను సంప్రదించాలి. జాబ్ కన్సల్టెంట్ సూచించిన కంపెనీ అధికారుల నుంచి వివరణ కోరవద్దు. వారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ముఠాలో భాగమై ఉండవచ్చు.

- స్పూఫ్డ్ ఇమెయిల్ IDలు, కస్టమర్ కేర్ నంబర్‌లు మొదలైనవాటితో మోసపోకండి. పేర్కొన్న జాబ్ కన్సల్టెంట్‌తో ఏదైనా చర్చించే ముందు ప్రతి క్లెయిమ్‌ను ప్రత్యామ్నాయ ఛానెల్‌లతో క్రాస్ వెరిఫై చేయండి.
Published by:Sridhar Reddy
First published:

Tags: JOBS, Scams, Tech news, Whatsapp

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు