news18-telugu
Updated: January 29, 2019, 11:38 AM IST
JioRail App: జియో యూజర్ల కోసం ప్రత్యేకంగా రైల్ యాప్ రిలీజ్
జియో యూజర్లకు శుభవార్త. జియో యూజర్ల కోసం ప్రత్యేకంగా రైల్ యాప్ రిలీజ్ చేసింది రిలయెన్స్. జియో ఫోన్లోని జియో రైల్ యాప్‌లో IRCTC రిజర్వ్డ్ టికెట్ బుకింగ్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. యూజర్లు డెబిట్, క్రెడిట్ కార్డులు, ఇ-వ్యాలెట్లతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ కూడా చేయొచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవడం, రైలు సమాచారం, వేళలు, రూట్స్, సీట్ల వివరాలు కూడా జియో ఫోన్లోనే తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి:
IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...జియో రైల్ యాప్ జియో యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా మీరు తత్కాల్ టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ యూజర్లకు IRCTC అకౌంట్ లేకపోతే నేరుగా జియో రైల్ యాప్‌లోనే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. త్వరలో పీఎన్ఆర్ స్టేటస్ ఛేంజ్ అలర్ట్స్, లొకేట్ ట్రెయిన్, ఫుడ్ ఆర్డరింగ్ సేవలు కూడా జియో రైల్ యాప్‌లో అందుబాటులోకి రానున్నాయి. జియో ఫోన్, జియో ఫోన్ 2లో జియో రైల్ యాప్ ఉపయోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?
XIAOMI MI Days Sale: రెడ్మీ, పోకో ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించిన షావోమీ
Published by:
Santhosh Kumar S
First published:
January 29, 2019, 11:20 AM IST