JIOPHONE USERS TO GET 300 MINUTES OF OUTGOING VOICE CALLS PER MONTH FREE NS
Jio Phone: కరోనా కష్టకాలంలో జియో ఫోన్ వినియోగదారులకు బంపరాఫర్.. రీఛార్జ్ చేయకున్నా కాల్స్ మాట్లాడే ఛాన్స్.. ఇంకా..
ప్రతీకాత్మక చిత్రం
కరోనా కష్టకాలంలో జియో ఫోన్ వినియోగదారులకు సంస్థ శుభవార్త చెప్పింది. రీఛార్జ్ చేయకుండానే కాల్స్ మాట్లాడే అవకాశాన్ని కల్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అనేక వినూత్న ఆఫర్లతో దేశంలో టెలికాం రంగంలో జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జియో తీసుకువచ్చిన తక్కువ ధరకు డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్లతో మిగతా కంపెనీలు కూడా అదే బాటలో పయనించక తప్పని పరిస్థితి ఏర్పడింది. జియో ఫోన్స్ తో తక్కువ ధరకు పేదలకు ఫోన్ తో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కరోనా కష్టకాలంలో జియో ఫోన్ వినియోగదారులకు కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చి మంచి మనస్సు చాటింది. ఎలాంటి రీఛార్జ్ చేయించకున్నా నిత్యం పది నిమిషాలు అంటే నెలకు 300 నిమిషాల పాటు ఔట్ గోయింగ్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది జియో. ఈ ఆఫర్ ఈ కరోనా విపత్తు ముగిసే వారకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది సంస్థ.
ఈ కరోనా కష్టకాలంలో రీఛార్జ్ చేసుకోలేకపోతున్న జియో ఫోన్ వినియోగదారులకు ఈ ప్లాన్ తో ప్రయోజనం చేకూరనుంది. వారు ఎలాంటి రీఛార్జ్ చేసుకోకుండానే నిత్యం పది నిమిషాల పాటు కాల్స్ మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. ఈ ఆఫర్ తో పాటు మరో సూపర్ ఆఫర్ ను జియో ఫోన్ కస్టమర్లకు అందించింది కంపెనీ. జియో ఫోన్ ఖాతాదారులు ఏ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకున్నా.. అదే విలువైన ప్లాన్ ను ఉచితంగా పొందవచ్చు. ఉదాహరణకు జియో ఫోన్ వినియోగదారులు రూ. 75 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే.. మరో రూ. 75 ప్లాన్ ను ఉచితంగా పొందవచ్చు. ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ప్రతీ భారతీయుడికి సాయం అందించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని జియో స్పష్టం చేసింది. Reliance Retail: ప్రపంచంలోనే రెండో వేగవంతమైన రిటైలర్‌గా రిలయన్స్ రిటైల్ సంస్థ.. Reliance Foundation: ఉత్తరఖండ్ రాష్ట్రానికి అండగా రిలయన్స్ ఫౌండేషన్.. కరోనాపై పోరాటానికి భారీ ఆర్థిక సాయం
రిలయన్స్ ఫౌండేషన్ సేవలు..
దేశంపై కరోనా మహమ్మారి విరుచుకపడుతున్న ఈ సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులను రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నారు. దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లకు భోజన సదుపాయం అందించడానికి రిలయన్స్ ఫౌండేషన్ మిషన్ అన్న సేవ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంకా దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సీజన్ కు తీవ్ర కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కొరతను అధిగమించడానికి రిలయన్స్ ఫౌండేషన్ యుద్ధప్రాతిపదికన ఆక్సీజన్ తయారీని చేపట్టింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఆక్సీజన్ వినియోగంలో 11 శాతం ఉచితంగా రిలయన్స్ నుంచే సరఫరా అవుతోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.