హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphones under Rs 10,000: మార్కెట్‌లో రూ.10,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones under Rs 10,000: మార్కెట్‌లో రూ.10,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones under Rs 10,000: మార్కెట్‌లో రూ.10,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones under Rs 10,000: మార్కెట్‌లో రూ.10,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Smartphones under Rs 10,000 | మీరు రూ.10,000 లోపు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ బడ్జెట్‌లో ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ (Best Smartphones) గురించి తెలుసుకోండి.

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్​ వేగంగా వృద్ది చెందుతోంది. ముఖ్యంగా ఇక్కడ బడ్జెట్​ స్మార్ట్‌ఫోన్లకు (Budget Smartphones) విపరీతమైన డిమాండ్​ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని మొబైల్ తయారీ సంస్థలు వరుసగా బడ్జెట్​ ఫోన్లను రిలీజ్​ చేస్తున్నాయి. రూ.10 వేలలోపు ధరలోనే (Smartphones under Rs 10,000) ప్రీమియం ఫీచర్లతో వీటిని విడుదల చేస్తున్నాయి. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్లు మంచి పనితీరు, కెమెరా సామర్థ్యం, మల్టీ టాస్కింగ్ సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. అంతేకాకుండా ఇవి హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో వస్తాయి. ఒకవేళ మీరు తక్కువ ధరలో లభిస్తున్న ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే.. కేవలం రూ. 10 వేలలోపు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్‌ఫోన్లను పరిశీలించండి.

JioPhone Next


రిలయన్స్ జియో నుండి సరసమైన స్మార్ట్‌ఫోన్ 5.45 -అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది క్వాడ్-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 215 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ను కలిగి ఉంటుంది. జియో ఫోన్​ నెక్ట్స్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆధారంగా పనిచేసే ప్రగతి ఓఎస్​పై పనిచేస్తుంది. ఇది 13 -మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8 -మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో వస్తుంది. దీనిలో డ్యూయల్-సిమ్, వై-ఫై, బ్లూటూత్ v4.1తో పాటు వేగవంతమైన 4జీ కనెక్టివిటీని అందించింది. ఇది 3500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Redmi Note 11T 5G: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 11టీ 5జీ సేల్... తొలి సేల్‌లో రూ.2,000 డిస్కౌంట్


Realme Narzo 30A


రియల్​మీ నార్జో 30ఎ బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్. ఇది 6000 mAh భారీ బ్యాటరీతో వస్తుంది. ఒకే ఛార్జ్‌పై రెండు రోజుల బ్యాటరీ బ్యాకప్​ ఇస్తుంది. నార్జో 30A 6.5 -అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది. రియల్​మీ నార్జో 30A మీడియా టెక్​ హీలియో G85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 3 జీబీ ర్యామ్​ను అందించింది. ఇది ఆండ్రాయిడ్​ 10 ఓఎస్​పై పనిచేస్తుంది. దీని వెనుక వైపు 13-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాలను చేర్చింది.

5G Smartphones: రూ.15,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇవే బెస్ట్ మోడల్స్

Redmi 9 Prime


రెడ్మీ 9 ప్రైమ్ మొత్తం రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్​ ​, 4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్​ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 6.53 -అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లేయర్‌తో వస్తుంది. ఇది మీడియాటెక్​ హీలియో G80 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ 9 ప్రైమ్​ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. రెడ్​మీ9 ప్రైమ్​ బాక్స్​లో10W ఛార్జర్‌ను అందించింది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Micromax IN 2B


మైక్రోమ్యాక్స్ ఇన్​ 2బీ స్మార్ట్​ఫోన్​​ 6.52 -అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఎంట్రీ-లెవల్ స్మార్ట్​ఫోన్​ యూనిసాక్​ T610 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇన్​ 2బీ గరిష్టంగా 6 జీబీ ర్యామ్​ ఆప్షన్​తో వస్తుంది. మైక్రోమ్యాక్స్ ఇన్​ 2బీ వెనుక భాగంలో 13 -మెగాపిక్సెల్ డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది.

First published:

Tags: Jio, JioPhone Next, Micromax, Mobile News, Mobiles, Realme, Realme Narzo, Realme UI, Redmi, Reliance Jio, Smartphone

ఉత్తమ కథలు