హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioPhone Next: రేపటి నుంచి జియోఫోన్ నెక్స్‌ట్ సేల్... ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? ఈఎంఐ ఎంత? తెలుసుకోండి

JioPhone Next: రేపటి నుంచి జియోఫోన్ నెక్స్‌ట్ సేల్... ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? ఈఎంఐ ఎంత? తెలుసుకోండి

JioPhone Next: రేపటి నుంచి జియోఫోన్ నెక్స్‌ట్ సేల్... ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? ఈఎంఐ ఎంత? తెలుసుకోండి
(Image: Soumyadip Choudhury / News18)

JioPhone Next: రేపటి నుంచి జియోఫోన్ నెక్స్‌ట్ సేల్... ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? ఈఎంఐ ఎంత? తెలుసుకోండి (Image: Soumyadip Choudhury / News18)

JioPhone Next | దీపావళి సందర్భంగా జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. కేవలం రూ.300 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్స్, బెనిఫిట్స్ వివరాలు తెలుసుకోండి.

రిలయన్స్ జియో ఇటీవల జియోఫోన్ నెక్స్‌ట్ (JioPhone Next) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. సరిగ్గా దీపావళి రోజున అంటే నవంబర్ 4న ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. కేవలం రూ.1,999 చెల్లించిస్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. మిగతా మొత్తాన్ని ఈఎంఐ ద్వారా (EMI option) చెల్లిస్తే చాలు. వన్ టైమ్ పేమెంట్ ద్వారా కొనాలనుకునేవారు రూ.6,499 చెల్లించాలి. ఈఎంఐ ద్వారా కొనాలనుకుంటే నెలకు కేవలం రూ.300 నుంచి ఈఐఎం ఆప్షన్ మొదలవుతుంది. డేటా బెనిఫిట్స్, వాయిస్ కాల్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేవారు రూ.501 ప్రాసెసింగ్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Nokia T20: ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా టీ20 ట్యాబ్లెట్ సేల్... ధర ఎంతంటే

ఈఎంఐ ఆప్షన్ ఎంచుకునేవారి కోసం రిలయన్స్ జియో నాలుగు రకాల ప్లాన్స్‌ని ప్రకటించింది. ఆల్వేస్ ఆన్ ప్లాన్, లార్జ్ ప్లాన్, ఎక్ఎల్ ప్లాన్, ఎక్ఎక్ఎల్ ప్లాన్స్ అందిస్తోంది. ఈ ప్లాన్స్‌లో రూ.300 నుంచి రూ.600 వరకు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. 18 నుంచి 24 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అంటే యూజర్లకు మొత్తం 8 రకాల ఆప్షన్స్ లభిస్తాయి. ఏ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

Always on Plan: ఆల్వేస్ ఆన్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.300 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.350 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి నెలకు 5జీబీ డేటా + 100 నిమిషాల కాల్స్ లభిస్తాయి.

Poco M4 Pro 5G: నవంబర్​ 9న పోకో ఎం4 ప్రో 5జీ లాంఛింగ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Large Plan: లార్జ్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.450 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.500 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 1.5జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి.

XL Plan: ఎక్స్ఎల్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.500 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.550 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి.

XXL Plan: ఎక్స్‌ఎక్స్ఎల్ ప్లాన్‌లో రెండు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి. నెలకు రూ.550 చొప్పున 24 నెలలు లేదా నెలకు రూ.600 చొప్పున 18 నెలలు చెల్లించాలి. ఈ ప్లాన్ ఎంచుకున్నవారికి అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజూ 2.5జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి.

Jio eSIM: ఆ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? జియో ఇ-సిమ్ ఎలా పొందాలంటే

జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌ను జియోమార్ట్ డిజిటల్ నెట్వర్క్‌లో 30,000 పైగా రీటైల్ పార్ట్‌నర్స్ దగ్గర కొనొచ్చు. మీకు దగ్గర్లోని జియో స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. https://www.jio.com/next వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయొచ్చు. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేస్తే I'm interested పైన క్లిక్ చేయాలి. మీ పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. లేదా వాట్సప్‌లో 70182-70182 నెంబర్‌కు HI అని టైప్ చేసి రిజిస్టర్ చేయొచ్చు. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత దగ్గర్లోని జియోమార్ట్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్‌ట్ కలెక్ట్ చేసుకోవాలి.

First published:

Tags: Jio, JioPhone Next, Reliance Jio

ఉత్తమ కథలు