హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ బుకింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ బుకింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ బుకింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ బుకింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

JioPhone Next Booking | మీరు జియోఫోన్ నెక్స్‌ట్ (JioPhone Next) స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా? వాట్సప్‌లో, జియో వెబ్‌సైట్‌లో, మైజియో యాప్‌లో సింపుల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ బుక్ చేయొచ్చు. ఎలా కొనాలో తెలుసుకోండి.

  దీపావళి కానుకగా రిలయన్స్ జియో (Reliance Jio) నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్‌ట్ (JioPhone Next) సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.1,999 చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత రూ.300 నుంచి రూ.600 వరకు 8 రకాల ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. 18 నెలల నుంచి 24 వరకు ఈఎంఐ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ఎంచుకున్నవారికి డేటా బెనిఫిట్స్, వాయిస్ కాల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. మరి ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈఎంఐ ఆప్షన్ కాకుండా నేరుగా ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారు రూ.6,499 చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్‌ను బుక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.

  WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? మరి ఈ సెట్టింగ్స్ మార్చారా?

  JioPhone Next Booking: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ ఇలా బుక్ చేయండి


  Step 1- ముందుగా https://www.jio.com/next వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

  Step 2- హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేస్తే I'm interested బటన్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.

  Step 3- మీ పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి.

  Step 4- Generate OTP పైన క్లిక్ చేయాలి.

  Step 5- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.

  Step 6- ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

  Step 7- ముందుగా అడ్రస్, పిన్ కోడ్, హౌజ్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేసి Submit పైన క్లిక్ చేయాలి.

  Step 8- Thank you for expressing interest for JioPhone Next అనే మెసేజ్ కనిపిస్తుంది.

  Step 9- మీకు దగ్గర్లోని స్టోర్ నుంచి మీకు కాల్ వస్తుంది.

  Step 10- వెళ్లి జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ కలెక్ట్ చేసుకోవాలి.

  Redmi Note 11 Series: గంటలో 5 లక్షలకు పైగా రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ ఫోన్ల అమ్మకాలు

  వాట్సప్ ద్వారా కూడా జియోఫోన్ నెక్స్‌ట్ బుకింగ్ చేయొచ్చు. ఇందుకోసం వాట్సప్‌లో 70182-70182 నెంబర్ సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నెంబర్‌కు Hi అని టైప్ చేయాలి. జియోఫోన్ నెక్స్‌ట్ బుకింగ్ లింక్ వస్తుంది. క్లిక్ చేయాలి. ఆ తర్వాత పైన చెప్పిన స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. మైజియో యాప్‌లో కూడా బుకింగ్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది.

  ఇదే కాకుండా కస్టమర్లు జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌ను జియోమార్ట్ డిజిటల్ నెట్వర్క్‌లో 30,000 పైగా రీటైల్ పార్ట్‌నర్స్ దగ్గర కొనొచ్చు. మీకు దగ్గర్లోని జియో స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. జియోఫోన్ నెక్స్‌ట్ భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ జియో, గూగుల్ కలిసి రూపొందించిన స్మార్ట్‌ఫోన్. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ప్రగతి ఓఎస్‌ను ప్రత్యేకంగా రూపొందించింది గూగుల్. ఇందులో రీడ్ అలౌడ్, ట్రాన్స్‌లేట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Google, Jio, JioPhone Next, Mobile News, Mobiles, Reliance Jio, Smartphone

  ఉత్తమ కథలు