జియో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత చవకైనా స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ను (JioPhone Next) రిలీజ్ చేసింది. రిలయన్స్ జియో (Reilance Jio), గూగుల్ (Google) కలిసి మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. దివాళీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనొచ్చు. అన్ని స్టోర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. ఎంట్రీ ధర రూ.1,999 మాత్రమే. మిగతా మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. ఈఎంఐ ఆఫ్షన్స్ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈఎంఐ ఆప్షన్ వద్దనుకుంటే రూ.6,499 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. వినియోగదారులు సులభంగా జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ కొనడం కోసం తక్కువ ధర నిర్ణయించింది కంపెనీ. రిలయన్స్ రీటైల్ నెట్‌వర్క్‌లో ఉన్న జియోమార్ట్ డిజిటల్ రీటైల్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఇప్పటికీ 2జీ నెట్వర్క్ ఉపయోగిస్తున్న కోట్లాది మంది యూజర్లకు 4జీ నెట్‌వర్క్‌ను అందించడం కోసం చవకైన స్మార్ట్‌ఫోన్ రూపొందించింది జియో.
జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గూగుల్ ఆండ్రాయిడ్‌పై పనిచేసే ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ రూపొందించడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇంగ్లీష్‌లోనే కాదు... 10 భారతీయ భాషల్లో కూడా ఉపయోగించొచ్చు. ఒక్క బటన్ క్లిక్ చేసి స్క్రీన్‌పైనే ట్రాన్స్లేషన్ చేయొచ్చు. యూజర్లు తమ సొంత భాషలో టెక్స్‌ను చదవొచ్చు.
Vivo Offer: కొత్త ఫోన్ కొనాలా? కేవలం రూ.101 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్స్ సొంతం చేసుకోవచ్చు
ఇందులో ట్రాన్స్‌లేట్ నౌ ఫీచర్ కూడా ఉంది. ఏ యాప్‌లో మొబైల్ స్క్రీన్ లేదా ఇమేజ్ను తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. ఇక రీడ్ ఎలౌడ్ ఫీచర్ ద్వారా స్క్రీన్ పైన ఉన్న టెక్స్ట్ నుంచి యూజర్లు తమకు కావాల్సిన భాషలో చదివి వినిపించుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే బిల్ట్ ఇన్ ఫిల్టర్స్ ఉన్నాయి. సూపర్ నైట్ ఫోటోగ్రఫీ ఫీచర్ ఉండటం విశేషం.
జియోమార్ట్ డిజిటల్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్ట్ కొనడానికి రిజిస్టర్ చేయొచ్చు. లేదా https://www.jio.com/next లింక్‌లో రిజిస్టర్ చేయొచ్చు. వాట్సప్‌లో 70182-70182 నెంబర్‌కు HI అని టైప్ చేసి రిజిస్టర్ చేయొచ్చు. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత దగ్గర్లోని జియోమార్ట్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్ట్ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
Google Pixel 4A: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,000 తగ్గింది... ఎస్బీఐ కార్డుతో మరో 10 శాతం డిస్కౌంట్
జియోఫోన్ నెక్స్ట్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ 5.45 అంగుళాల మల్టీటచ్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మెమొరీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
జియోఫోన్ నెక్స్ట్ స్మార్ట్‌ఫోన్‌లో 3500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Jio, JioPhone Next, Reliance Jio