అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అత్యంత చౌకైన స్మార్ట్ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ (JioPhone Next)ను టెలికాం దిగ్గజం జియో(Jio) రిలీజ్ చేసింది. రిలయన్స్ జియో (Reilance Jio), గూగుల్ (Google) కలిసి మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ఫోన్ను రూపొందించాయి. దీపావళి(Diwali 2021) నుంచి ఈ స్మార్ట్ఫోన్(Smartphone)ను కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్(Phone) ఎంట్రీ ధర రూ.1,999 మాత్రమే కావడం విశేషం. మిగతా మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించే అవకాశాన్ని కల్పించింది జియో. ఈఎంఐ ఆప్షన్ వద్దనుకుంటే రూ.6,499 చెల్లించి ఈ స్మార్ట్ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 2జీ నెట్వర్క్ నే ఉపయోగిస్తున్న కోట్లాది మంది యూజర్లకు 4జీ నెట్వర్క్ సేవలను అందించడం కోసం ఇంత తక్కువ ధరకు స్మార్ట్ఫోన్ ను అందించింది జియో. జియో నెక్స్ట్ ఫోన్ ఎలా ఉంటుందోని ఎదురు చూస్తున్న వారి కోసం తాజాగా ఈ ఫోన్ అన్ బాక్సింగ్ వీడియో సైతం విడుదలైంది.
ఇదిలా ఉంటే.. ఈ ఫోన్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్(Pragati OS)పై పని చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ను గూగుల్, జియో కలిసి అభివృద్ధి చేశాయి. భారతీయ వినియోగదారులు అవసరాలను తీర్చడమే లక్ష్యంగా Google, Jio సంయుక్తంగా ఈ JioPhone Nextను తీర్చిదిద్దాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్(Operating System) సరికొత్త ఫీచర్లతో యూజర్లు మంచి అనుభూతిని ఇవ్వనుంది. గూగుల్ ప్లే స్టోర్(Google Play Store) లో అందుబాటులో ఉన్న మిలియన్ల కొద్దీ యాప్(Mobile Apps) లు ఈ ఆపరేటింగ్ సిస్టమపై పని చేస్తాయి. ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లు(Security Features) సైతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నాయి.
Reliance JioPhone Next: రూ.1,999 ఎంట్రీ ధరతో జియోఫోన్ నెక్స్ట్.. ఆపరేటిగ్ సిస్టమ్ ప్రత్యేకతలివే..
#WATCH | Reliance's JioPhone Next jointly designed by Jio & Google.
JioPhone Next is a first-of-its-kind smartphone featuring Pragati OS, an optimized version of Android made for the JioPhone Next. pic.twitter.com/A2mknOOtDN
— ANI (@ANI) October 30, 2021
జియోమార్ట్ డిజిటల్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్ట్ కొనడానికి ముందుగానే రిజిస్టర్ చేయొచ్చు. లేదా https://www.jio.com/next లింక్ ద్వారా సైతం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇంకా వాట్సాప్ లో 70182-70182 నంబర్ కు HI అని టైప్ మెసేజ్ చేసి సైతం రిజిస్టర్ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత దగ్గర్లోని జియోమార్ట్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్ట్ ను తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Jio, Jio phone, Reliance Jio, Reliance JioMart