హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఇవే...

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఇవే...

బ్యాంకింగ్, షాపింగ్ (Banking & Shopping) తో పాటు అనేక రకాల సేవలను మనం స్మార్ట్ ఫోన్(Services) ద్వారానే పొందుతున్నాం. అయితే.. కొన్ని సార్లు మనం స్మార్ట్ ఫోన్(Smartphone) ను పోగొట్టుకుంటాం. అలాంటి సందర్భాల్లో ఆ ఫోన్లోని బ్యాంకింగ్(Banking) కు సంబంధించిన యాప్ లు, సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది.

బ్యాంకింగ్, షాపింగ్ (Banking & Shopping) తో పాటు అనేక రకాల సేవలను మనం స్మార్ట్ ఫోన్(Services) ద్వారానే పొందుతున్నాం. అయితే.. కొన్ని సార్లు మనం స్మార్ట్ ఫోన్(Smartphone) ను పోగొట్టుకుంటాం. అలాంటి సందర్భాల్లో ఆ ఫోన్లోని బ్యాంకింగ్(Banking) కు సంబంధించిన యాప్ లు, సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించిన వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది.

JioPhone Next | భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్‌ట్ (JioPhone Next) స్మార్ట్‌ఫోన్ సేల్ మొదలైంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి.

  దీపావళి సందర్భంగా జియోఫోన్ నెక్స్‌ట్ (JioPhone Next) స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. మీకు దగ్గర్లో ఉన్న జియో స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. లేదా జియోఫోన్ నెక్స్‌ట్ కోసం రిజిస్టర్ చేయొచ్చు. ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ కొనడానికి కేవలం రూ.1,999 చెల్లిస్తే చాలు. ఆ తర్వాత 18 నుంచి 24 నెలల మధ్య రూ.300 నుంచి రూ.600 వరకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా లభించే బెనిఫిట్స్ తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయుల అవసరాలకు తగ్గట్టుగా రిలయన్స్ జియో (Reliance Jio), గూగుల్ (Google) కలిసి సంయుక్తంగా రూపొందించాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్స్ చాలా ఉన్నాయి.

  WhatsApp: వాట్సప్ వాడుతున్నారా? మరి ఈ సెట్టింగ్స్ మార్చారా?

  జియోఫోన్ నెక్స్‌ట్ స్పెసిఫికేషన్స్


  జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌లో 5.45 అంగుళాల మల్టీటచ్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉండటం విశేషం. జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్యూఎం-215 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ను జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేకంగా రూపొందించింది క్వాల్కమ్. జియోఫోన్ నెక్స్‌ట్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తుంది. మెమొరీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవడానికి స్లాట్ కూడా ఉంది.

  Jio eSIM: ఆ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? జియో ఇ-సిమ్ ఎలా పొందాలంటే

  జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌లో 3500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 5వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు క్లిక్ చేయడానికి 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట కెమెరా ఉంది. కెమెరాలో సూపర్ నైట్ ఫోటోగ్రఫీ ఫీచర్ ఉండటం విశేషం. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

  Nokia T20: ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా టీ20 ట్యాబ్లెట్ సేల్... ధర ఎంతంటే

  జియోఫోన్ నెక్స్‌ట్ స్పెషల్ ఫీచర్స్


  జియోఫోన్ నెక్స్‌ట్ కోసం గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్‌తో (Pragati OS) పనిచేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేస్తుంది. జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌ను ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మళయాలం లాంటి 10 భారతీయ భాషల్లో కూడా ఉపయోగించొచ్చు. స్క్రీన్‌పైన ఉన్న టెక్స్‌ట్‌ను వెంటనే అనువదించడానికి ట్రాన్స్‌లేషన్ ఫీచర్ ఉంది. దీని ద్వారా యూజర్లు తమ సొంత భాషలో టెక్స్‌ను చదవొచ్చు.

  ట్రాన్స్‌లేట్ నౌ ఫీచర్‌తో ఏ యాప్‌లో మొబైల్ స్క్రీన్ లేదా ఇమేజ్‌ను తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేయొచ్చు. ఇక స్క్రీన్ పైన ఉన్న టెక్స్‌ట్‌ను స్మార్ట్‌ఫోన్ చదివి వినిపిస్తుంది. ఇందుకోసం రీడ్ ఎలౌడ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు కావాల్సిన భాషలో టెక్స్‌ట్‌ను చదివి వినిపించుకోవచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android, Google, Jio, JioPhone Next, Mobile News, Mobiles, Reliance Jio, Smartphone

  ఉత్తమ కథలు