దిగ్గజ టెలికాం సంస్థ జియో నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ జియోఫోన్ నెక్స్ట్ (Jio Phone Next) విడుదలైన విషయం తెలిసిందే. తక్కువ ధరకే భారతీయులకు స్మార్ట్ ఫోన్ అందించాలన్న లక్ష్యంతో జియో, గూగుల్ సంయుక్తంగా ఈ ఫోన్ ను తీసుకువచ్చాయి. ఈ ఫోన్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్(Pragati OS)పై పని చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్(Operating System) సరికొత్త ఫీచర్లతో యూజర్లు మంచి అనుభూతిని ఇవ్వనుంది. గూగుల్ ప్లే స్టోర్(Google Play Store) లో అందుబాటులో ఉన్న మిలియన్ల కొద్దీ యాప్(Mobile Apps) లు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తాయి. ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లు(Security Features) సైతం ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నాయి. కేవలం రూ.1,999 ఎంట్రీ ప్రైస్ చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. మిగతా మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కేవలం రూ.300 నుంచే ప్రారంభం అవుతుంది. ఈఎంఐ ఆప్షన్ (EMI Option) ఎంచుకునేవారికి డేటా, వాయిస్ కాల్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎంచుకునే ఆప్షన్‌ను బట్టి బెనిఫిట్స్ మారుతుంటాయి.
మొత్తం నాలుగు కేటగిరీల్లో ఎనిమిది రకాల ఈఎంఐ ఆప్షన్స్ ప్రకటించింది రిలయన్స్ జియో. రూ.300 నుంచి రూ.600 వరకు ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. దీపావళి నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. జియోమార్ట్ డిజిటల్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్ట్ కొనడానికి రిజిస్టర్ చేయొచ్చు. లేదా https://www.jio.com/next లింక్‌లో రిజిస్టర్ చేయొచ్చు. వాట్సప్‌లో 70182-70182 నెంబర్‌కు HI అని టైప్ చేసి కూడా రిజిస్టర్ చేయొచ్చు. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత దగ్గర్లోని జియోమార్ట్ రీటైలర్ దగ్గర జియోఫోన్ నెక్స్ట్ కలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
జియో ఫోన్ నెక్స్ట్ మీ దగ్గరలోని స్టోర్ లో అందుబాటులోకి రాగానే మీకు సమాచారం అందాలంటే ఇలా చేయండి..
-ముందుగా jio.com ను ఓపెన్ చేయాలి. స్కీన్ పై JioPhone Next అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-అనంతరం ‘I am Interested’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
-పేరు, ఫోన్ నంబర్ ను నమోదు చేయాలి. అనంతరం I agree to the Terms and Conditionsను సెలక్ట్ చేయాలి.
Reliance JioPhone Next: రూ.1,999 ఎంట్రీ ధరతో జియోఫోన్ నెక్స్ట్.. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రత్యేకతలివే..
-అనంతరం Generate OTPపై క్లిక్ చేయాల్సి ఉంటుంది.
-మీకు మొబైల్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
-అక్కడ మీ చిరునామా, పిన్ కోడ్, ఇంటి నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
-జీయోఫోన్ నెక్స్ట్ మీ దగ్గరలోని స్టోర్ లో అందుబాటులోకి రాగానే ఇక మీకు మెసేజ్ వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, Jio phone, JioMart, Reliance Jio