JioPhone Next: క్వాల్కమ్ చిప్‌తో జియో ఫోన్​ నెక్ట్స్... స్పెసిఫికేషన్స్ ఇవే

JioPhone Next: క్వాల్కమ్ చిప్‌తో జియో ఫోన్​ నెక్ట్స్... స్పెసిఫికేషన్స్ ఇవే (image: Jio)

JioPhone Next | జియోఫోన్ నెక్స్‌ట్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ ప్రాసెసర్ ఉపయోగిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించింది రిలయన్స్ జియో. ఈ ప్రాసెసర్‌తో జియోఫోన్ నెక్స్‌ట్ ఎలా ఉండనుందో తెలుసుకోండి.

  • Share this:
భారత టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్రబిందువైన రిలయన్స్​ జియో (Reliance Jio) ఇప్పుడు యూజర్లకు మరో శుభవార్త చెప్పింది. వినియోగదారులంతా ఎంతగానో ఎదురుచూస్తోన్న అత్యంత చౌకైన ఫోన్​ ‘జియో ఫోన్​ నెక్ట్స్​’ (JioPhone Next) విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ దీపావళి పండుగకు ముందే దీన్ని మార్కెట్​లోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. జియోఫోన్ నెక్స్ట్‌ను అభివృద్ధి చేయడానికి రిలయన్స్ జియో గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జూన్​24న జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో ఆర్​ఐఎల్​ ఛైర్మన్ అండ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ ముఖేష్​ అంబానీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్​ఫోన్​ను పరిచయం చేశారు. మేక్​ ఇన్​ ఇండియా చొరవతో తక్కువ ధరలోనే దీన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి భారతీయుడికి డిజిటల్ సేవలను అందించే లక్ష్యంతో దీన్ని తీసుకొస్తున్నట్లు అంబానీ చెప్పారు. జియో నెక్ట్స్​ ఫోన్​ను తొలుత వినాయక చవితి రోజున లాంచ్​ చేయాలని కంపెనీ భావించింది. అయితే సెమీ కండక్టర్ల కొరత కారణంగా లాంచింగ్​ను దీపావళికి వాయిదా వేసింది. ఇందులో భాగంగా తాజాగా “మేకింగ్ ఆఫ్ జియోఫోన్ నెక్స్ట్” వీడియోను విడుదల చేసింది.

Samsung Galaxy M32 5G: రూ.20,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో రూ.1,199 ధరకే కొనండి ఇలా

మేక్​ ఇండియా చొరవతో..


జియో ఫోన్​ నెక్ట్స్​ మేక్​ ఇన్​ ఇండియా స్మార్ట్​ఫోన్. ప్రస్తుతం దేశంలో 30 కోట్ల మంది 2జీ యూజర్లు ఉండగా.. వారిని 4జీ నెట్​వర్క్​కు మార్చేందుకు ఈ స్మార్ట్​ఫోన్​ ఉపయోగపడనుంది. జియో, గూగుల్​ కలిసి భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్​ సిస్టమ్​ను ఆప్టిమైజ్​ చేసి ఈ స్మార్ట్​ఫోన్​ను రూపొందించాయి. ఈ స్మార్ట్​ఫోన్​లో ఆటోమేటిక్​ రీడ్​ ఎలైడ్​ ఫీచర్​ను కూడా అందించాయి. ఈ ఫీచర్​ మీ స్క్రీన్​ పైన ఉన్న టెక్స్ట్​ను స్మార్ట్​ఫోన్​ చదివి వినిపిస్తుంది. దీంతో పాటు లాంగ్వేజ్​ ట్రాన్స్​లేషన్​, ఆగ్యుమెంటెడ్​ రియాల్టీ ఫిల్టర్స్​తో స్మార్ట్​ కెమెరా, వాయిస్​ అసిస్టెంట్​ లాంటి ఫీచర్లను చేర్చింది.

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చి చూడండి

ఈ ఫోన్​ 5.5 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో వస్తుంది. క్వాల్కమ్​​ స్నాప్​డ్రాగ్రన్​ 215 ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 2 జీబీ, 3జీబీ వేరియంట్లలో ఇది రిలీజ్​ కానుంది. 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్​ ఆప్షనల్లో లభిస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్​ సహాయంతో ఈ స్టోరేజ్​ను పెంచుకోవచ్చు. ​ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఇందులో 13 ఎంపీ సింగ్​ రియర్​ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం 8 ఎంపీ ఫ్రంట్​ కెమెరాను చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ 2,500 ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తుంది. జియో నెక్ట్స్​ స్మార్ట్​ఫోన్​ ప్రారంభ ధర రూ. 3,499 వద్ద ఉండొచ్చని టెక్​ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published: