Home /News /technology /

JioMeet: 50 లక్షల డౌన్‌లోడ్స్‌తో జియో మీట్ సరికొత్త రికార్డు

JioMeet: 50 లక్షల డౌన్‌లోడ్స్‌తో జియో మీట్ సరికొత్త రికార్డు

JioMeet: 50 లక్షల డౌన్‌లోడ్స్‌తో జియో మీట్ సరికొత్త రికార్డు

JioMeet: 50 లక్షల డౌన్‌లోడ్స్‌తో జియో మీట్ సరికొత్త రికార్డు

JioMeet | సంచలనాలకు మారుపేరైన రిలయెన్స్ జియో వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ జియో మీట్‌తోనూ సంచలనాలు సృష్టిస్తోంది.

    రిలయెన్స్ జియో నుంచి వచ్చిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జియోమీట్ సరికొత్త రికార్డులు సృష్టించింది. లాంఛ్ అయిన కొద్ది రోజుల్లోనే ఏకంగా 50 లక్షల డౌన్‌లోడ్స్‌తో సంచలనం సృష్టించింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL 43వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఈ విషయాన్ని తెలిపారు. అంతేకాదు... జియోమీట్ సత్తా ఏంటో ఈ మీటింగ్ ద్వారా తెలిసిపోయింది. రిలయెన్స్ ఏజీఎం ఈసారి వర్చువల్ మీటింగ్ ద్వారా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వర్చువల్ మీటింగ్ కోసం జియోమీట్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించడం విశేషం. 40 దేశాల్లో 468 పట్టణాల నుంచి 3,21,000 మంది జియో మీట్ ద్వారా రిలయెన్స్ ఏజీఎంలో పాల్గొనడం విశేషం. ఎక్కడా ఎలాంటి సాంకేతిక లోపం లేకుండా వర్చువల్ మీటింగ్ సాఫీగా సాగింది. జియోమీట్ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ద్వారా ఎంత భారీ మీటింగ్ అయినా ఆర్గనైజ్ చేయడం సాధ్యమని రిలయెన్స్ వర్చువల్ ఏజీఎం నిరూపించింది. మరో వీడియా కాన్ఫరెన్సింగ్ యాప్ అయిన జూమ్‌కు జియోమీట్ గట్టి పోటీ ఇస్తోంది.

    RIL AGM 2020: జియో మరో సంచలనం... Jio TV+ ప్రకటించిన రిలయెన్స్

    Jio OS: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు శుభవార్త... త్వరలో జియో ఆపరేటింగ్ సిస్టమ్

    కరోనా వైరస్ సంక్షోభ కాలంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌కి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారు, క్లైంట్లతో మీటింగ్స్ పెట్టుకునేవారు వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాంటివారికి జియోమీట్ ద్వారా సరైన ప్లాట్‌ఫామ్‌ను అందించింది రిలయెన్స్ జియో. మీటింగ్ షెడ్యూల్ నుంచి స్క్రీన్ షేరింగ్ వరకు వీడియో కాన్ఫరెన్స్‌కు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఈ యాప్ ఉపయోగించి 100 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించొచ్చు. 24 గంటల పాటు జియోమీట్ పనిచేస్తుంది. కేవలం ప్రొఫెషనల్ అవసరాలకు మాత్రమే కాకుండా పర్సనల్ వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం కూడా ఈ యాప్ ఉపయోగించొచ్చు. జియోమీట్ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌తో పాటు యాపిల్ యాప్ స్టోర్‌లో కూడా అందుబాటులో ఉంది. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌లో కూడా జియోమీట్ ఉపయోగించొచ్చు. ఈ సేవలన్నీ ఉచితం.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Jio, JioMeet, Mukesh Ambani, Reliance, Reliance Industries, Reliance Jio, RIL

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు