Home /News /technology /

JIOMEET FACILITY NOW AVAILABLE ON WHATSAPP TO START MEETING WITH OTHERS FULL DETAILS HERE PRV GH

WhatsApp Jiomeet Channel: వాట్సాప్‌లో జియోమీట్‌ సేవలు ప్రారంభం.. వాట్సాప్‌లోనే నేరుగా మీటింగ్స్ స్టార్ట్ చేసే ఆప్షన్‌!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Jio) వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ జియోమీట్‌ (Jiomeet)ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ వీడియో మీటింగ్స్‌ నిర్వహించవచ్చు. అయితే తాజాగా ఈ ప్లాట్‌ఫామ్‌ సేవలు వాట్సాప్‌ (WhatsApp)లో కూడా అందుబాటులోకి వచ్చా?

ఇంకా చదవండి ...
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ జియోమీట్‌ (Jiomeet)ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్‌ల వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌లకు (Video conferencing platform) పోటీగా జియోమీట్‌ను రిలయన్స్ సంస్థ (Reliance company) పరిచయం చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ వీడియో మీటింగ్స్‌ నిర్వహించవచ్చు. అయితే తాజాగా ఈ ప్లాట్‌ఫామ్‌ సేవలు వాట్సాప్‌ (WhatsApp)లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మీటింగ్స్‌ను నేరుగా వాట్సాప్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. జియోమీట్‌ యాప్ ఓపెన్ చేయకుండానే వాట్సాప్‌ని ఉపయోగించి ఆఫీస్‌లోని వ్యక్తులతో మీటింగ్స్‌ను షెడ్యూల్ చేయవచ్చు. వాట్సాప్‌లోని కొత్త జియోమీట్ ఛానెల్ (Jiomeet Channel) మీకు జియోమీట్‌లోని అన్ని ఫీచర్లను ఒకే క్లిక్‌తో అందిస్తుంది. ఈ కొత్త ఛానెల్ +918369100100 నంబర్ ద్వారా అందుబాటులో ఉంది. ఈ నంబర్‌ను సేవ్ చేసుకోవడం ద్వారా వాట్సాప్‌లోనే జియోమీట్ అన్ని సేవలను ఆస్వాదించవచ్చు.

వాట్సాప్  (WhatsApp) ఛానెల్ ఉపయోగించి జియోమీట్‌ మీటింగ్స్‌ను సింపుల్‌గా మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు మీటింగ్ లింక్‌ని క్రియేట్ చేయవచ్చు, దాన్ని గ్రూప్‌లో షేర్ చేయవచ్చు, ఈ మీటింగ్స్‌ను మేనేజ్ చేయవచ్చు. మీటింగ్స్‌లో ఏవైనా మార్పులు చేస్తే వాటికి సంబంధించిన అప్‌డేట్‌లను కూడా పొందవచ్చు. అలానే ఈ ఛానెల్ జియోమీట్‌పై ఫీడ్‌బ్యాక్, క్వరీలు, హెల్ప్ వంటి సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. జియోమీట్‌ వాట్సాప్ ఛానెల్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ఓఎస్, విండోస్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కూడా యాక్సెస్ చేయవచ్చు.

* మీటింగ్స్‌ను స్టార్ట్ చేయడానికి జియోమీట్ వాట్సాప్ ఛానెల్‌ని ఎలా ఉపయోగించాలి*

- కొత్త జియోమీట్ వాట్సాప్ ఛానెల్ నంబర్ +91-8369100100ని మీ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి.

- ఈ నంబర్‌కి హాయ్ అని ఒక మెసేజ్ పంపించాలి.

- ఇప్పుడు మీకు సైన్-అప్, జాయిన్‌ మీటింగ్ (Join meeting), ఎంటర్ అధర్ నంబర్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకవేళ మీరు మీ వాట్సాప్ ఫోన్ నంబర్‌తోనే జియోమీట్‌లో రిజిస్టర్ కానట్లయితే సైన్ అప్ అనే ఆప్షన్‌పై ట్యాప్ చేసి తర్వాతి సూచనలు పాటిస్తే సరిపోతుంది.

- ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయి ఉన్నట్లయితే స్టార్ట్ ఏ మీటింగ్ (Start A Meeting), ప్లాన్ ఏ మీటింగ్ (Plan A Meeting), జాయిన్ మీటింగ్ (Join Meeting) అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ ఆప్షన్‌లలో మీకు నచ్చిన ఆప్షన్‌ని ఎంచుకొని మీటింగ్స్ చేసుకోవచ్చు.

- స్టార్ట్ ఏ మీటింగ్ అనే ఆప్షన్‌ను ఎంచుకున్నట్లయితే వన్ టైమ్ మీటింగ్, పర్సనల్ మీటింగ్ ఐడీ అనే ఆప్షన్స్‌ పొందవచ్చు. వన్ టైమ్ మీటింగ్‌ను సెలక్ట్ చేసుకొని మీరు మీటింగ్ స్టార్ట్ చేయవచ్చు. దానిని వాట్సాప్ గ్రూప్‌లో ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. పర్సనల్ మీటింగ్ ఐడీ ఆప్షన్‌పై నొక్కి మీటింగ్ వివరాలు తెలుసుకోవచ్చు.

- ప్లాన్ ఏ మీటింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు ఈరోజు, రేపు లేదా మీకు నచ్చిన డేట్‌లో మీటింగ్ ప్లాన్ చేయవచ్చు.

- ఇంకా అందుబాటులో ఉన్న మరిన్ని ఫీచర్లను ఉపయోగించి మీరు జియోమీట్‌ సేవలను పూర్తిస్థాయిలో పొందవచ్చు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ల్లో జూమ్, గూగుల్ మీట్, మైక్రోసాఫ్ట్ టీమ్స్‌, జియోమీట్ బాగా పాపులర్ అయ్యాయి. అయితే వీటిలో జియోమీట్ తప్ప ఇతర వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌లేవీ వాట్సాప్ ఛానెల్‌ ఇంకా ప్రారంభించలేదు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Group call, Reliance Jio WiFi Calling, Whatsapp

తదుపరి వార్తలు