షాపింగ్ చేయాలనుకునేవారికి ఇండిపెండెన్స్ డే ఆఫర్ల వర్షం కురుస్తోంది. జియోమార్ట్, స్మార్ట్ సూపర్‌స్టోర్ కలిసి ఫుల్ పైసా వసూల్ సేల్‌ను ప్రారంభించబోతున్నాయి. అతిపెద్ద గ్రాసరీ ఫెస్టివల్ సేల్ ఇది. ఆగస్ట్ 14న సేల్ ప్రారంభం కానుంది. ఆగస్ట్ 18 వరకు సేల్ కొనసాగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1200 పైగా స్మార్ట్ సూపర్ స్టోర్స్, స్మార్ట్ పాయింట్, రిలయన్స్ ఫ్రెష్ స్టోర్లలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. కస్టమర్లు ఇంటికి కావాల్సిన సరుకులు కొనుగోలు చేసి అనేక ఆఫర్స్ పొందొచ్చు. ఈసారి అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన ప్యాకేజ్డ్ ఫుడ్, హోమ్ అండ్ పర్సనల్ కేర్, డెయిరీ, జనరల్ మర్కండైజ్‌పై ఆఫర్స్ ఉన్నాయి.
Unlimited Data Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్స్ ఇవే
Gas Cylinder offer: డబ్బులు లేకపోయినా గ్యాస్ సిలిండర్ బుకింగ్... రూ.900 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా
Alla re alla, Full Paisa Vasool Sale aala!
JioMart brings to you India’s biggest grocery sale from 14th to 18th August.
Extra 10% cashback on SBI Debit & Credit Cards.
Download the #JioMart app or visit https://t.co/BP51e45JIq#FullPaisaVasoolSale pic.twitter.com/wJZbiVhat7
— JioMart (@JioMart) August 13, 2021
జియోమార్ట్ ఫుల్ పైసా వసూల్ సేల్‌లో బిస్కిట్లు, చాక్లెట్లు, షాంపూపై 50 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. సాఫ్ట్ డ్రింక్స్, టూత్‌పేస్ట్, నూడుల్స్, సోప్స్‌పై 33 శాతం కనీస డిస్కౌంట్ పొందొచ్చు. డిటర్జెంట్ సోప్, ఇతర ప్రొడక్ట్స్‌పై 30 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. రూ.1,470 విలువగల బాస్మతీ రైస్, ఆయిల్ కాంబో ప్యాక్‌ను కేవలం రూ.1,049 ధరకే సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లు జియోమార్ట్ యాప్ ద్వారా ఆర్డర్ చేస్తే సరుకులు ఇంటికి వస్తాయి. ఉచితంగా డెలివరీ సర్వీస్‌ను అందిస్తోంది జియోమార్ట్. మినిమమ్ ఆర్డర్ లిమిట్ ఉండదు.
Life Insurance: నెలకు రూ.300 చెల్లిస్తే చాలు... 100 ఏళ్ల వరకు కవరేజీ ఇచ్చే పాలసీ
PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా
రిలయెన్స్ రీటైల్‌కు చెందిన సరికొత్త ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జియోమార్ట్ దేశవ్యాప్తంగా 200 పైగా పట్టణాలు, నగరాల్లో సేవలు అందిస్తోంది. జియోమార్ట్ ఫుల్ పైసా వసూల్ సేల్‌లో గూగుల్ పే ద్వారా పేమెంట్ చేసేవారికి క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. కనీసం రూ.599 సరుకులు కొని గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తే యూజర్లకు స్క్రాచ్ కార్డ్ వస్తుంది. స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇక ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JioMart, Online shopping