హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Meta Event: మెటా 'ఫ్యూయెల్ ఫర్ ఇండియా-2021' ఈవెంట్‌లో పాల్గొన్న ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ... మెటా CBOతో సంభాషణ

Meta Event: మెటా 'ఫ్యూయెల్ ఫర్ ఇండియా-2021' ఈవెంట్‌లో పాల్గొన్న ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ... మెటా CBOతో సంభాషణ

Meta Event: మెటా 'ఫ్యూయెల్ ఫర్ ఇండియా-2021' ఈవెంట్‌లో పాల్గొన్న ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ... మెటా CBOతో సంభాషణ

Meta Event: మెటా 'ఫ్యూయెల్ ఫర్ ఇండియా-2021' ఈవెంట్‌లో పాల్గొన్న ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ... మెటా CBOతో సంభాషణ

Meta Event | మెటా 'ఫ్యూయెల్ ఫర్ ఇండియా-2021' ఈవెంట్‌లో రిలయన్స్ రిటైల్, జియో ప్లాట్‌ఫాంల డైరెక్టర్ ఇషా అంబానీ (Isha Ambani), జియో ప్లాట్‌ఫాం స్ట్రాటజీ హెడ్ అండ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ (Akash Ambani) పాల్గొన్నారు. వాట్సప్‌లో జియోమార్ట్ ద్వారా వినియోగదారులకు మునుపెన్నడూ లేని అనుభవాన్ని అందిస్తున్నట్టు తెలిపారు.

ఇంకా చదవండి ...

మెటా (Meta)గా పేరు మార్చుకున్న ఫేస్‌బుక్‌ సంస్థ, ఫ్యూయెల్ ఫర్ ఇండియా-2021 (Fuel for India 2021) ఈవెంట్‌ను బుధవారం నిర్వహించింది. ఈ ఈవెంట్ రెండో ఎడిషన్.. భారతదేశంలోని డిజిటల్ కమ్యూనిటీలు, క్రియేటర్లు, వ్యవస్థాపకులు, చిన్న వ్యాపారాలపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఫ్యూయెలింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ రిటైల్’ థీమ్‌పై చర్చించారు మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (CBO) మార్నె లెవ్నీ (Marne Levine). రిలయన్స్ రిటైల్, జియో ప్లాట్‌ఫాంల డైరెక్టర్ ఇషా అంబానీ , జియో ప్లాట్‌ఫాం స్ట్రాటజీ హెడ్ అండ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ వర్చువల్‌ విధానంలో మాట్లాడారు మార్నె. ఈ సందర్భంగా ఆమె అడిగిన ప్రశ్నలు.. వాటికి ఇషా, ఆకాశ్ ఇచ్చిన సమాధానాలు చూద్దాం.

ఒకటో ప్రశ్న

మార్నె: భారతదేశంలో కొన్ని కోట్లమందికి రిలయన్స్ జియో తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది విప్లవాత్మకమైన నిర్ణయం. ప్రజలకు, వ్యాపారాలకు ఈ నిర్ణయం మేలు చేసింది. మీ భాగస్వామిగా ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. చిన్న వ్యాపారాలు, వ్యవస్థాపకులకు సాధికారత కల్పించాలనే ఆలోచనను మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ముందుగా నేను భారతదేశంలో రిటైల్ రంగం భవిష్యత్తు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మహమ్మారి నేపథ్యంలో మన భాగస్వామ్యం, నిర్దేశిత లక్ష్యాలను చేరుకోగలిగిందని మీరు భావిస్తున్నారా?

ఇషా: చిన్న వ్యాపారాలు మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని మేము నమ్ముతున్నాం. చిన్న దుకాణాలు, చిల్లర వ్యాపారులు డిజిటల్ విధానంలోకి మారాలనే పాఠాన్ని మహమ్మారి మనకు నేర్పించింది. ఈ మార్పు అత్యవసరమనే సత్యాన్ని అందరూ గ్రహించారు. ఇలాంటి వ్యాపారాలను డిజిటల్‌ విధానంలోకి తీసుకువచ్చే బాధ్యతను మనం వేగవంతం చేయాలనేది అర్థమైంది. మన భాగస్వామ్య శక్తి ద్వారా వాట్సాప్ ప్లాట్‌ఫాం బలాన్ని అన్ని అవసరాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించడం మంచి విషయం. జియో సబ్‌స్క్రైబర్‌లకు నిర్దిష్ట డిజిటల్-కామర్స్ సొల్యూషన్స్‌ను త్వరగా అభివృద్ధి చేయడం, రూపొందించడం ద్వారా ఈ వ్యాపారాలకు మద్దతునివ్వడం మాకు సహజమైన పురోగతిలా అనిపించింది.

ఆకాష్: ప్రస్తుతం మాకు 5 లక్షలకు పైగా రిటైలర్స్ బలం ఉంది. ఈ సంఖ్య రోజురోజుకు వృద్ధి చెందుతోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రిటైల్‌లో జియో మార్ట్ (JioMart) నెట్‌వర్క్ పరిధిని విస్తరించాం. మెటా భాగస్వామ్యంతో మేము మెరుగైన లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాం. వాట్సాప్‌ బృందం సహకారంతో వినియోగదారులకు మరిన్ని సేవలను చేరువ చేయాలనుకుంటున్నాం. వాట్సాప్ ద్వారా సులభంగా షాపింగ్ చేయడంలో సహాయపడటమే కాకుండా రిటైలర్లు స్టాక్ పెంచడానికి, మార్జిన్‌లను మెరుగుపరచడానికి, వాటిని పొందడానికి సహాయపడే స్థానిక ఫీచర్లను రూపొందించాలని భావిస్తున్నాం. ఈ ఫీచర్ల ద్వారా రిటైలర్లు తమ రెగ్యులర్ యూజర్ బేస్‌తో సంబంధాలను అలాగే ఉంచుకోవడంతో పాటు కొత్త ఆర్డర్‌లను పొందగలుగుతారు.

ఇషా: ఆకాష్‌కు నాకు వ్యక్తిగతంగా ఇది గొప్ప విషయం. ఎందుకంటే జియో నెట్‌వర్క్, జియో మార్ట్ ద్వారా మిలియన్ల కొద్దీ చిన్న చిల్లర వ్యాపారులు డిజిటల్‌ విధానంలోకి మారేలా చేయాలన్న మా నాన్న లక్ష్యానికి మేము చేరువ అవుతున్నాం. ఇది మమ్మల్ని ప్రేరేపించే, ప్రోత్సహించే అంశం.

రెండో ప్రశ్న

మార్నె: ఇది మంచి దూరదృష్టి. ఎందుకంటే JioMart వ్యాపారాలకు విలువను జోడించడమే కాకుండా భౌతిక, సామాజిక, ఆర్థిక ప్రభావాన్ని కూడా కలిగి ఉంది. చిన్న వ్యాపారులు ముందు నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది ఈ-కామర్స్ రంగంతో జతకలిశారు. ఇది వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని ఎలా మార్చింది?

ఆకాష్: వాట్సాప్ ద్వారా జియోమార్ట్ సేవలు పొందడం సులభం. వాట్సాప్‌ను ఉపయోగించడానికి చాలా సులభం. కాబట్టి వస్తువుల కోసం ఆర్డర్ చేసేటప్పుడు కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సాంకేతికతకు సైతం ఎటువంటి అడ్డంకులు లేవు. డిజిటల్ షాపింగ్ అనేది ఇప్పుడు వాట్సాప్‌ ద్వారా జియోమార్ట్‌కు మెసేజింగ్ చేయడానికి పొడిగింపు వంటిదే. ఇది వినియోగదారుల సౌలభ్యంలో వచ్చిన ఒక విప్లవంగా చెప్పుకోవచ్చు.

ఇషా: కస్టమర్ చేయాల్సిందల్లా కేవలం జియోమార్ట్‌లో ఆర్డర్ చేయడమే. బ్రెడ్, బటర్, కూరగాయలు, పానీయాలు, ఆ రోజు లేదా ఆ వారంలో మీ ఇంట్లో కావాల్సినవన్నీ పొందవచ్చు.

మూడో ప్రశ్న

మార్నె: ఇది సులభమైన ప్రక్రియ. కానీ ఇందుకు ఎంతో కష్టపడి పనిచేయాల్సి వచ్చిందని నాకు తెలుసు. జియోమార్ట్‌ సేవల విషయంలో మా పార్ట్నర్‌షిప్‌ను నమ్మినందుకు మీకు ధన్యవాదాలు. నేను బలమైన జియో సబ్‌స్క్రైబర్ బేస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. Jio మొబైల్ లక్షలాది మంది ప్రజలకు చౌకైన డేటా ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. భారతదేశంలోని మొబైల్ ఫోన్ వినియోగదారులలో ఎక్కువ మంది ప్రీ-పెయిడ్ రీఛార్జ్ ఫార్మాట్‌నే అనుసరిస్తున్నారు. అయితే వాట్సాప్ ద్వారా జియో మొబైల్ రీఛార్జ్ ఎలా పనిచేస్తుంది? ప్రజలకు ఆ అనుభవాన్ని ఎలా సులభతరం చేస్తోంది? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను.

ఆకాష్: Jio, Meta ఒప్పందాలతో ప్రజలకు మరిన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్‌లో జియో వాడకం కూడా ఇలాంటి మార్గంలో ఒకటి. ఇది 'ప్రీపెయిడ్ రీఛార్జ్'ని సులభతరం చేస్తోంది. వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా సులభమైన సేవలందిస్తూ, మెరుగైన అనుభవాన్ని ఇస్తుంది.

నాలుగో ప్రశ్న

మార్నె: వాట్సాప్ ద్వారా UPI చెల్లింపులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీనిద్వారా జియోమొబైల్ రీఛార్జ్ ప్రక్రియ మరింత సరళంగా మారుతుందని నేను భావిస్తున్నాను. మీ ఆలోచన కూడా అలాగే ఉందా?

ఇషా: అవును. కొన్నిసార్లు బయటికి వెళ్లడం కష్టంగా భావించే వృద్ధులకు, వాట్సాప్ ద్వారా జియో రీఛార్జ్ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాట్సాప్‌ పేమెంట్స్ ఫీచర్ సైతం ఇందుకు దోహదం చేస్తుంది.

ఆకాష్: ఎండ్-టు-ఎండ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు వాట్సాప్ ద్వారా పేమెంట్స్ చేయడం, రీఛార్జ్ చేయగల సామర్థ్యం కల్పించడం ద్వారా మిలియన్ల కొద్దీ జియో సబ్‌స్క్రైబర్లకు మెరుగైన సేవలందించవచ్చు.

First published:

Tags: Akash Ambani, Isha Ambani, JioMart, Meta, Reliance Jio, Whatsapp

ఉత్తమ కథలు