టెలికాం రంగంలో జియో సృష్టించిన సునామి మనకు తెలిసిందే. 2016లో ప్రారంభమైన జియో అనతి కాలంలోనే భారత టెలికాం రంగంలో మొదటి స్థానంలోకి చేరింది. ఫ్రీ టాక్ టైం, డైలీ డేటా తదితర సరికొత్త ఆఫర్లతో భారత టెలికాం రంగానికి కొత్త దారిని చూపించింది. జియో మార్గంలోనే మిగతా సంస్థలు సైతం వెళ్లాల్సిన పరిస్థితిని కల్పించింది జియో. ఫలితంగా దేశంలో ఇంటన్ నెట్ విప్లవం వచ్చిందని చెప్పొచ్చు. మారుమూల పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని ప్రాంతాల ప్రజలు తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్ నెట్ ను పొందగలుగుతున్నారు. జియోమార్ట్ సైతం ప్రస్తుతం నిత్యం 5 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ప్రత్యర్థి బిగ్ బాస్కెట్ నిత్యం 2,83,00 ఆర్డర్లను మాత్రమే డెలివరీ చేస్తోంది. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజాలుగా పేరొందిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ను టార్గెట్ చేసింది జియో. ఇటీవల నిర్వహించిన Annual General Meeting లో జియోఫోన్ నెక్స్ట్ పేరుతో ఫోన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గూగుల్ భాగస్వామ్యంతో ఈ ఫోన్ ను తీసుకువస్తున్నట్లు వివరించింది జియో. ఈ ఫోన్ గేమ్ ఛేంజర్ గా మారుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ 4జీ సపోర్ట్ చేయడంతో పాటు గూగల్, జియోకు చెందిన అన్ని అప్లికేషన్లను సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy M51: ఈ సాంసంగ్ స్మార్ట్ఫోన్ ధర భారీగా తగ్గింది... రూ.4,750 తగ్గింపు పొందండి ఇలా
గతంలో విడుదలైన JioPhone 2ను 100 మిలయన్లకు పై గా విక్రయించి రికార్డ్ సృష్టించిన జియో.. ఈ ఫోన్ల అమ్మకాలను 300 మిలియన్లకు చేర్చాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ కొత్త ఫోన్ టెలికాం రంగం ఆదాయాన్ని మరింత పెంచనుందని తెలుస్తోంది. అయితే ఆన్లైన్ మార్కెట్ అధికంగా సాగుతున్న ఈ రోజుల్లో జియో ఆఫ్ లైన్ ద్వారా ఈ ఫోన్ అమ్మడానికి మంచి ప్లాట్ ఫామ్ ను తయారు చేయనుంది. రిలయన్స్ ఇప్పటికే దేశవ్యాపత్ంగా 8700 స్టోర్స్ ను కలిగి ఉంది. ఇందులో 8200 జియో స్టోర్స్ కాగా 500 రిలయన్స్ డిజిటల్ ఔట్ లెట్స్.
అయిదే ఇందుకు అదనంగా జియో దేశ వ్యాప్తంగా 2,50,000 ఔట్ లెట్స్ ను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. తద్వారా రీఛార్జ్ సర్వీసెస్ తో పాటు జియో ఫోన్లకు సంబంధించిన సేవలను అందిస్తోంది. దీంతో రిలయన్స్ ఇతర ఎలక్ట్రానిక్ తయారీ దారులకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇప్పటికే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ సంస్థలైన షియోమీ, రెడ్ మీ సైతం చిన్న చిన్న పట్టణాల్లో ఔట్ లెట్స్ ను ఏర్పాటు చేసి సేల్స్ ను పెంచుకోవాలని భావిస్తున్నాయి. జియో మార్ట్ లోకి వెళ్లిన కస్టమర్ అక్కడ ఉన్న టాబ్లెట్ ద్వారా నేరుగా ఫోన్ ను లేదా యాక్ససరీస్ ను బుక్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio phone, JioMart, Reliance, Reliance Jio, Reliance JioMart, Smartphone