
JioMart Bestival Sale 2020: జియోమార్ట్‌లో ఫెస్టివల్ సేల్... భారీ డిస్కౌంట్స్ మీరూ పొందొచ్చు ఇలా
(image: JioMart)
JioMart Bestival Sale 2020 | దీపావళి పండుగ కోసం సరుకులు కొనాలనుకుంటున్నారా? జియోమార్ట్ బెస్టివల్ సేల్ ప్రకటించింది. ఆఫర్స్ వివరాలు తెలుసుకోండి.
జియోమార్ట్‌లో బెస్టివల్ సేల్ పేరుతో ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. నవంబర్ 8 వరకు ఈ సేల్ కొనసాగుతుంది. రిలయెన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన ఆన్‌లైన్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ ప్రకటించిన అతిపెద్ద సేల్ ఇది. దీపావళి సందర్భంగా భారీ ఆఫర్స్, డిస్కౌంట్స్ ప్రకటించింది. చిరువ్యాపారాలు, కిరాణా షాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు జియోమార్ట్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్ సేల్‌లో స్వీట్స్, డ్రైఫ్రూట్స్, చాక్లెట్స్, బిస్కిట్స్, కుకీస్, బేన్, మైదా, కిచన్ అప్లయెన్సెస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది జియోమార్ట్. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఫోన్‌పే రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. పేటీఎం యూపీఐ యూజర్లు కూడా రూ.750 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. మోబీక్విక్ కస్టమర్లు రూ.50 సూపర్ క్యాష్ పొందొచ్చు.
దీపావళి కోసం స్వీట్లు కొనాలనుకునేవారికి రసగుల్లా, గులాబ్ జామ్ కిలో ప్యాక్‌పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇక సోన్ పాప్డీ, బేసన్ లడ్డూ 400 గ్రామ్ ప్యాక్ కొంటే 50 శాతం తగ్గింపు లభిస్తుంది. 132 గ్రాములపైన చాక్లెట్లు కొనేవారికి 30 శాతం తగ్గింపు లభిస్తుంది. క్యాడ్బరీ సెలబ్రేషన్స్, డైరీమిల్క్, కిట్‌క్యాట్, మంచ్, ఫైవ్ స్టార్ చాక్లెట్లపై ఆఫర్స్ ఉన్నాయి. ఉత్సవ డ్రైఫ్రూట్ దివాళీ గిఫ్ట్ ప్యాక్ కొనేవారికి 50 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇక బేసన్, మైదా, రవ్వ 500 గ్రాముల పైన కొనేవారికి 50 శాతం తగ్గింపు లభిస్తుంది. గుడ్ లైఫ్ బాదాం అరకిలో ప్యాక్ రూ.315 ధరకే కొనొచ్చు. సేల్ లేనప్పుడు ధర రూ.449. గుడ్ లైఫ్ కాజు అరకిలో రూ.399 ధరకే కొనొచ్చు. ఇక సఫోలా యాక్టీవ్ ఆయిల్ 5 లీటర్ + చార్మినార్ సెలెక్ట్ బాస్మతీ రైస్ 5 కేజీ ప్యాక్‌ను రూ.879 ధరకే కొనొచ్చు.
కోల్డ్ డ్రిక్స్ కొనాలనుకునేవారికీ భారీ ఆఫర్స్ ఉన్నాయి. 650 ఎంఎల్ లేదా 750 ఎంఎల్ కోల్డ్ డ్రింక్స్ కొంటే 25 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్, హెల్త్ డ్రింక్స్, సప్లిమెంట్స్, టీ, కాఫీపై భారీ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్‌ని జియోమార్ట్‌తో పాటు రిలయెన్స్ ఫ్రెష్, స్మార్ట్ సూపర్‌స్టోర్‌లో కూడా పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:November 03, 2020, 10:33 am