హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioMart: 10 లక్షల డౌన్‌లోడ్స్‌తో జియోమార్ట్ యాప్ సూపర్ హిట్

JioMart: 10 లక్షల డౌన్‌లోడ్స్‌తో జియోమార్ట్ యాప్ సూపర్ హిట్

JioMart: 10 లక్షల డౌన్‌లోడ్స్‌తో జియోమార్ట్ యాప్ సూపర్ హిట్
(ప్రతీకాత్మక చిత్రం)

JioMart: 10 లక్షల డౌన్‌లోడ్స్‌తో జియోమార్ట్ యాప్ సూపర్ హిట్ (ప్రతీకాత్మక చిత్రం)

JioMart | సంచలనాలకు మారుపేరైన రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL జియోమార్ట్ ద్వారా మరిన్ని సంచలనాలు సృష్టిస్తోంది. జియోమార్ట్ యాప్ రిలీజ్ చేసిన కొన్ని రోజుల్లోనే 10 లక్షల డౌన్‌లోడ్స్ దాటడం విశేషం.

  జియోమార్ట్... రిలయెన్స్ నుంచి మరో సంచలనం. కొద్ది రోజుల క్రితం రిలయెన్స్ రీటైల్ బీటా ఆన్‌లైన్ కన్స్యూమర్ గ్రాసరీ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల జియోమార్ట్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్లలో రిలీజ్ చేశారు. కొద్ది రోజుల్లోనే జియోమార్ట్ యాప్ రికార్డులు సృష్టిస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో 10లక్షల డౌన్‌లోడ్స్ మార్కును దాటింది. అంతేకాదు... గూగుల్ ప్లేస్టోర్‌లో షాపింగ్ కేటగిరీలో టాప్ 3 యాప్స్‌లో జియోమార్ట్ కూడా ఉంది. ఇప్పటికే భారతదేశంలోని 200 నగరాలు, పట్టణాల్లో https://www.jiomart.com/ వెబ్‌సైట్ ద్వారా జియోమార్ట్ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు యాప్ కూడా వచ్చింది. జియోమార్ట్ యాప్‌కు భారీ స్పందన భారీగా ఉంది.

  జియోమార్ట్‌కు రోజూ 2.5 లక్షల ఆర్డర్స్ వస్తున్నాయి. ప్రతీ రోజూ ఆర్డర్ల సంఖ్య పెరుగుతోంది. నిత్యావసర వస్తువులు సరుకులతో పాటు ద్వారా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫార్మాసూటికల్, హెల్త్‌కేర్ లాంటివాటికి జియో మార్ట్‌ను విస్తరిస్తాం. రాబోయే రోజుల్లో మరికొన్ని పట్టణాల్లో ప్రారంభించి దేశంలోని ఎక్కువ మంది కస్టమర్లకు సేవలు అందిస్తాం.

  ఏజీఎంలో ముఖేష్ అంబానీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్

  కస్టమర్లు గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి జియోమార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్నాళ్లూ జియోమార్ట్ వెబ్‌సైట్ ఉపయోగించి ఆర్డర్స్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జియోమార్ట్ యాప్ నుంచి ఆర్డర్స్ చేయొచ్చు. జియోమార్ట్ నుంచి ఎంత ఆర్డర్ చేసినా ఉచితంగా హోమ్ డెలివరీ లభిస్తుంది. అదే అమెజాన్ ప్యాంట్రీ అయితే రూ.799, ప్లిప్‌కార్ట్ సూపర్‌మార్కెట్‌లో రూ.1,200, గ్రోఫర్స్‌లో రూ.800 ఆర్డర్ చేస్తేనే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. కానీ జియోమార్ట్ ఆ లిమిట్ ఏమీ పెట్టలేదు. కస్టమర్లు ఎంత తక్కువ ఆర్డర్ చేసినా ఉచితంగా ఇంటికి సరుకులు వస్తాయి. పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, హోమ్, కిచెన్ కేర్ ప్రొడక్ట్స్, బేబీ కేర్ ప్రొడక్ట్స్ కూడా లభిస్తాయి. జియోమార్ట్ ప్లాట్‌ఫామ్ దూసుకెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఫేస్‌బుక్ భాగస్వామ్యం ద్వారా కంపెనీ ఆన్‌లైన్ గ్రాసరీ రంగంలో మార్కెట్‌ లీడర్‌గా ఎదగడం ఖాయం. 2024 నాటికి 50 శాతం మార్కెట్ షేర్ జియోమార్ట్ సాధిస్తుంది.

  గోల్డ్‌మ్యాన్ శాక్స్

  జియోమార్ట్‌లో అన్ని సరుకులపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు... పేటీఎం, మొబీక్విక్ లాంటి పేమెంట్ ఆప్షన్స్ ద్వారా డబ్బులు చెల్లించే వారికి క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. సొడెక్సో కూపన్స్ కూడా రీడీమ్ చేసుకోవచ్చు. రిలయెన్స్ రీటైల్ కస్టమర్లకు లభించే రిలయెన్స్‌వన్, ఆర్‌వన్ లాయల్టీ ప్రోగ్రామ్‌ జియోమార్ట్ కస్టమర్లకు కూడా లభిస్తుంది. ఇందులో భాగంగా పలు బ్రాండ్లపై ఎక్స్‌క్లూజీవ్ ఆఫర్స్ ఉంటాయి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: JioMart, Reliance Industries, Reliance Jio, Reliance JioMart, RIL

  ఉత్తమ కథలు