Home /News /technology /

JIOMART ANDROID AND IOS APPS LAUNCHED AVAILABLE ON APP STORES SS

JioMart: జియోమార్ట్ యాప్ వచ్చేసింది... ఆఫర్స్ ఇవే

JioMart: జియోమార్ట్ యాప్ వచ్చేసింది... ఆఫర్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

JioMart: జియోమార్ట్ యాప్ వచ్చేసింది... ఆఫర్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

JioMart App | రిలయెన్స్ జియోకు చెందిన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ జియోమార్ట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ రిలీజ్ అయ్యాయి.

    అమెజాన్ ప్యాంట్రీ, ప్లిప్‌కార్ట్ సూపర్‌మార్కెట్, బిగ్ బాస్కెట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌కు పోటీగా రిలయెన్స్ జియోకు చెందిన జియోమార్ట్ వచ్చేసింది. ఇప్పటికే https://www.jiomart.com/ వెబ్‌సైట్ ప్రారంభమైంది. ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ అప్లికేషన్స్ కూడా వచ్చేశాయి. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి జియోమార్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జియోమార్ట్‌లో అన్ని సరుకులపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు... పేటీఎం, మొబీక్విక్ లాంటి పేమెంట్ ఆప్షన్స్ ద్వారా డబ్బులు చెల్లించే వారికి క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఇన్నాళ్లూ జియోమార్ట్ వెబ్‌సైట్ ఉపయోగించి ఆర్డర్స్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు జియోమార్ట్ యాప్ నుంచి ఆర్డర్స్ చేయొచ్చు. దేశంలోని 200 పట్టణాల్లో జియోమార్ట్ సేవలు ప్రారంభమయ్యాయి.

    Savings Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.66 లక్షలు రిటర్న్స్... వివరాలివే

    Redmi Note 9: అదిరిపోయే ఫీచర్స్‌తో రెడ్‌మీ నోట్ 9 రిలీజ్... ధర కూడా తక్కువే

    జియోమార్ట్ నుంచి ఎంత ఆర్డర్ చేసినా ఉచితంగా హోమ్ డెలివరీ లభిస్తుంది. అదే అమెజాన్ ప్యాంట్రీ అయితే రూ.799, ప్లిప్‌కార్ట్ సూపర్‌మార్కెట్‌లో రూ.1,200, గ్రోఫర్స్‌లో రూ.800 ఆర్డర్ చేస్తేనే ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. కానీ జియోమార్ట్ ఆ లిమిట్ ఏమీ పెట్టలేదు. కస్టమర్లు ఎంత తక్కువ ఆర్డర్ చేసినా ఉచితంగా ఇంటికి సరుకులు వస్తాయి. రిలయెన్స్ రీటైల్ కస్టమర్లకు లభించే రిలయెన్స్‌వన్, ఆర్‌వన్ లాయల్టీ ప్రోగ్రామ్‌ జియోమార్ట్ కస్టమర్లకు కూడా లభిస్తుంది. ఇందులో భాగంగా పలు బ్రాండ్లపై ఎక్స్‌క్లూజీవ్ ఆఫర్స్ ఉంటాయి.

    Realme: 20 నిమిషాల్లో 100 పర్సెంట్ ఛార్జింగ్... రియల్‌మీ మరో సంచలనం

    Broadband Plans: ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలా? బెస్ట్ ప్లాన్స్ ఇవే

    జియోమార్ట్ లాంఛ్ అయిన కొన్ని రోజుల్లోనే రోజుకు 2,50,000 పైనే ఆర్డర్స్ లభిస్తున్నాయి. రోజురోజుకీ ఈ ఆర్డర్స్ పెరుగుతున్నాయి. నిత్యావసర సరుకులు, వస్తువులు మాత్రమే కాదు త్వరలో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫార్మాసూటికల్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ లాంటివన్నీ జియోమార్ట్ ద్వారా లభిస్తాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Android, Ios, Jio, JioMart, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు