భారతదేశంలో లీడింగ్ గేమింగ్ సర్వీస్ అయిన జియోగేమ్స్ (JioGames) ఇండియాలో క్లౌడ్ గేమింగ్ సేవల్ని అందించేందుకు యుబిటస్ కేకేతో ఒప్పందం చేసుకుంది. భారతదేశానికి చెందిన స్వంత క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ జియోగేమ్స్‌క్లౌడ్ (JioGamesCloud), కన్సోల్ లాంటి గేమింగ్‌ను అన్ని డివైజ్‌లకు యాక్సెస్ అందించబోతోంది. అతిపెద్ద డిజిటల్ నెట్వర్క్ ఉన్న జియో తన శక్తిని ఉపయోగించుకుంటూ, జియోగేమ్స్‌క్లౌడ్ ద్వారా గేమింగ్ బెంచ్‌మార్క్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. జియోగేమ్స్‌క్లౌడ్ ప్రస్తుతం జియో సెట్ టాప్ బాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, వెబ్ బ్రౌజర్‌లలో అందుబాటులో ఉంది. జియోగేమ్స్‌క్లౌడ్ సెట్ టాప్ బాక్స్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు ఎంపిక చేసిన వెబ్ బ్రౌజర్‌లలో పరిమిత కాలం పాటు ఉచితంగా లభిస్తుంది.
యుబిటస్ అగ్రశ్రేణి గేమింగ్ కంపెనీలకు సాంకేతికతను అందిస్తోంది. కంటెంట్ గేమింగ్ కంపెనీల నుంచి ప్రసిద్ధ, ప్రముఖ టైటిల్స్‌కు లైసెన్స్ ఇస్తోంది. జియోగేమ్స్‌క్లౌడ్ పరికరాల సామర్థ్యం, కంప్యూటింగ్ శక్తి పరిమితులను తొలగించడం ద్వారా గేమర్‌లకు అధిక-నాణ్యత గేమ్‌ప్లేను అందించేందుకు కృషి చేయనుంది. రిలయన్స్ జియో సొంత జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ పరిచయంతో, హై-లేటెన్సీ, లాగ్స్ లాంటి నెట్‌వర్క్ పరిమితులు కూడా తొలగించబడ్డాయి. క్లౌడ్ గేమింగ్, 5జీ కలిసి భారతదేశంలో గేమింగ్ పరిశ్రమను విప్లవాత్మకంగా మార్చబోతున్నాయి. జియోగేమ్స్‌క్లౌడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, గేమ్ లైబ్రరీని అందిస్తోంది. గేమర్‌లు తమకు ఇష్టమైన గేమ్‌లను, తమకు నచ్చిన డివైజ్‌లో ఆడొచ్చు.
Lenovo Tab P11 5G: ఇండియాలో తొలి 5జీ ట్యాబ్లెట్ రిలీజ్... ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌లో జియోగేమ్స్ ఓ భాగం. భారతీయులందరికీ గేమింగ్ ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రతిష్టాత్మక ప్రయాణంలో జియోగేమ్స్ ముందుకెళ్తోంది. గేమింగ్ ప్రపంచంలోని బహుళ వాటాదారులైన గేమర్స్, గేమ్ పబ్లిషర్స్, ప్రేక్షకులు, గేమింగ్ కమ్యూటినీస్‌ను ఒకే వేదికపైకి చేర్చే వన్-స్టాప్ హబ్. జియోగేమ్స్ స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు, సెట్-టాప్ బాక్స్ ద్వారా హోమ్ గేమింగ్ లాంటి వేర్వేరు పరికరాలలో అందుబాటులో ఉంది. ఇది క్లౌడ్ గేమింగ్, లైవ్ స్ట్రీమింగ్, ఇస్పోర్ట్స్ లాంటి సేవల్ని క్లౌడ్ టెక్నాలజీ అందిస్తోంది. గేమ్స్ ఆడటానికి https://jiogames.page.link/pqcZ లింక్ క్లిక్ చేసి ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో జియోగేమ్స్ డౌన్‌లోడ్ చేయండి.
Gmail Full: జీమెయిల్‌లో అవసరంలేని మెయిల్స్ ఒకేసారి డిలిట్ చేయండిలా
జియో స్వంత స్వదేశీ క్లౌడ్ గేమింగ్ టెక్నాలజీ జియోగేమ్స్‌క్లౌడ్. గేమింగ్ పరిశ్రమలో పూర్తి గేమ్-ఛేంజర్ కానుంది. ఇంటెన్సివ్ గ్రాఫిక్-హెవీ గేమ్‌లను ఆడేందుకు ఇన్నాళ్లూ కన్సోల్, యాక్సెసరీస్ లాంటి ఖరీదైన హార్డ్‌వేర్ అవసరాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎలాంటి హార్డ్‌వేర్ స్ట్రింగ్‌లు లేకుండా నేరుగా జియోగేమ్స్ యాప్‌లో ఈ గేమ్స్ ఆడొచ్చు. అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు, జియో సెట్-టాప్ బాక్స్, ప్రసిద్ధ వెబ్ బ్రౌజర్‌లలో క్లౌడ్ టెక్నాలజీ ద్వారా ఇదంతా పనిచేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, JioGames, Smartphone, Video Games