హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

JioGames: గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి 'ఛోటా భీమ్'కు వెల్‌కమ్ చెప్పిన జియోగేమ్స్

JioGames: గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి 'ఛోటా భీమ్'కు వెల్‌కమ్ చెప్పిన జియోగేమ్స్

JioGames: గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి 'ఛోటా భీమ్'కు వెల్‌కమ్ చెప్పిన జియోగేమ్స్

JioGames: గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి 'ఛోటా భీమ్'కు వెల్‌కమ్ చెప్పిన జియోగేమ్స్

JioGames | జియోగేమ్స్ ప్లాట్‌ఫామ్‌లో ఛోటా భీమ్ గేమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ వేసవిలో పిల్లలు ఛోటాభీమ్ గేమ్స్ (Chhota Bheem Games) ఎంజాయ్ చేయొచ్చు. త్వరలో మరిన్ని గేమ్స్ ఈ ప్లాట్‌ఫామ్‌లోకి రాబోతున్నాయి.

జియోగేమ్స్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెక్ సంయుక్తంగా కలిసి జియోగేమ్స్ (JioGames) ప్లాట్‌ఫామ్‌లో ఛోటా భీమ్ గేమ్స్ (Chhota Bheem games) లాంఛ్ చేయబోతున్నాయి. పిల్లలు, గేమింగ్ ఔత్సాహికులు వారి ఇష్టమైన ఛోటా భీమ్ గేమ్ ఆడుతూ ఈ మేలో అతని పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేయొచ్చు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లతో పాటు జియో సెట్-టాప్ బాక్స్‌లో, జియోగేమ్స్ యాప్‌లో ఈ గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఛోటా భీమ్ గురించి పిల్లలకు పరిచయం అక్కర్లేదు. అత్యంత గుర్తించదగిన, అత్యంత ఇష్టపడే యానిమేటెడ్ పాత్రలలో ఛోటా భీమ్ ఒకటి. ఖచ్చితంగా పిల్లలకు వేసవి సెలవుల్లో కొంత బోనస్ వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి.

భారతదేశంలో సుదీర్ఘకాలం నడుస్తున్న యానిమేషన్ షోల్లో ఛోటా భీమ్ ఒకటి. దశాబ్దానికి పైగా భారతీయ పిల్లల జీవితంలో ఒక భాగం ఉందీ ఈ క్యారెక్టర్. స్వచ్ఛమైన బంగారు హృదయంతో ధోతీ ధరించిన చిన్నారి ఛోటా భీమ్. తన స్నేహితులతో కలిసి, సరదాగా తిరుగుతూ, ప్రజలకు సాయం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన సాహసాలను చేస్తుంటాడు. ఇప్పుడు జియోగేమ్స్‌కి వినోదాత్మక గేమ్‌లతో, ఛోటా భీమ్ టీమ్ వస్తోంది.

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ సేల్... రూ.25,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

మేము జియోతో అనుబంధాన్ని కలుపుకోవడం పట్ల, జియోగేమ్స్‌లోకి రావడం పట్ల ఆసక్తిగా ఉన్నాం. జియోగేమ్స్ అనేక డివైజ్‌లు, వ్యవస్థల్లో అందుబాటులో ఉంది. భారతదేశం ఇష్టపడే యానిమేటెడ్ షో అయిన ఛోటా భీమ్‌ను గేమ్స్ ద్వారా పిల్లలకు సరికొత్తగా అందిస్తున్నాం. మా అభిమానులు పలు రకాల డివైజ్‌లల్లో తమకు ఇష్టమైన పాత్రలతో కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాం. మేము 5 హైపర్ క్యాజువల్ గేమ్‌లను ప్రారంభించడంతో పాటు త్వరలో మరిన్ని గేమ్స్ తీసుకురాబోతున్నాం.

శ్రీనివాస్ చిలకలపూడి, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, గ్రీన్ గోల్డ్ యానిమేషన్

భారతీయులందరికీ గేమింగ్ ప్రపంచాన్ని అందించడానికి జియోగేమ్స్ ప్రతిష్టాత్మక ప్రయాణం ప్రారంభమైంది. గేమింగ్ ప్రపంచంలోని గేమర్స్, గేమ్ పబ్లిషర్స్, ప్రేక్షకులు, గేమింగ్ కమ్యూనిటీలను ఒకచోట చేర్చే వన్-స్టాప్ హబ్ ఇది. జియోగేమ్స్ స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లతో పాటు సెట్-టాప్ బాక్స్ ద్వారా హోమ్ గేమింగ్ సర్వీస్ అందుబాటులో ఉంది.

Smartphone Offer: ఎస్‌బీఐ కార్డ్ ఉందా? ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్

ఇక గ్రీన్ గోల్డ్ యానిమేషన్ విషయానికి వస్తే ఒరిజినల్ ఇండియన్ యానిమేషన్ సృష్టించడంలో మార్గదర్శక స్థానంలో ఈ సంస్థ ఉంది. 15 ఏళ్లుగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అన్ని కిడ్స్ టీవీ ఛానెళ్లలో గ్రీన్ గోల్డ్ పాపులర్. 10 కోట్లకు పైగా పిల్లల వ్యూయర్‌షిప్ ఉండటం విశేషం. 190 దేశాల్లో గ్రీన్ గోల్డ్ యానిమేషన్ సేవల్ని అందిస్తోంది.

First published:

Tags: Games, Mobile game, Reliance Jio, Video Games

ఉత్తమ కథలు