news18-telugu
Updated: September 4, 2020, 6:40 PM IST
Jio: రోటీ, కప్డా ఔర్ డేటా... టెలికాం రంగంలో నాలుగేళ్లలో జియో సంచలనాలెన్నో
(ప్రతీకాత్మక చిత్రం)
రిలయెన్స్ జియో రాకముందు ఒక జీబీ 4జీ డేటాకు యూజర్లు ఎంత ఖర్చు చేసేవారో తెలుసా? సుమారు రూ.250. మరి ఇప్పుడు ఒక జీబీ డేటాకు యూజర్లు ఎంత చెల్లిస్తున్నారో తెలుసా? కేవలం రూ.12 మాత్రమే. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు రిలయెన్స్ జియో ఏ విధంగా శ్రీకారం చుట్టిందో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. రోటీ, కప్డా ఔర్ మకాన్ అనే నానుడి కాస్తా రోటీ, కప్డా ఔర్ డేటాగా మారిపోయింది. ఒకప్పుడు 4జీ డేటా పొందడం, ఉపయోగించడం విలాసవంతంగా భావించేవారు. కానీ ఇప్పుడు 4జీ డేటా నిత్యావసరాల్లో ఒకటిగా మారింది. ఇందుకు కారణం రిలయెన్స్ జియో అన్న మాటను ఎవరూ కాదనలేరు. భారతదేశంలో టెలికాం రంగం చరిత్ర చెప్పుకోవాలంటే జియోకు ముందు, జియో తర్వాత అని విభజించి చెప్పాల్సిందే. ఆ స్థాయిలో జియో సంచలనాలు సృష్టించింది. సరికొత్త డేటా విప్లవానికి నాంది వేసింది.
అది 2016 సెప్టెంబర్ మాసం. అంటే సరిగ్గా నాలుగేళ్ల క్రితం. యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ రిలయెన్స్ జియోను ప్రకటించారు. అప్పుడు ప్రపంచంలో మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న 230 దేశాల్లో భారతదేశం 155వ స్థానంలో ఉంది. మరి ఇప్పుడు... ఇండియా టాప్ 10 లో నిలిచింది. నాలుగేళ్ల క్రితం 2016 సెప్టెంబర్ 5న 4జీ ఎల్టీఈ సేవలు ప్రారంభమయ్యాయి. అప్పుడు నెలకు 300 మిలియన్ జీబీ డేటా ఉపయోగించేవారు. ఇప్పుడు నెలకు 6 బిలియన్ డేటా ఉపయోగిస్తున్నారు. అందులో జియో వాటా 60% ఉండటం విశేషం.
Aadhaar Charges: ఆధార్ సెంటర్లో ఛార్జీలు ఎంత చెల్లించాలో తెలుసా?
UPI Payment: గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్స్ చేసినవారికి గుడ్ న్యూస్

ప్రతీకాత్మక చిత్రం
ఇదే కాదు... ఇలాంటి ఆశ్చర్యకరమైన లెక్కలు ఎన్నో ఉన్నాయి. నెలలో ఉపయోగించే మొబైల్ డేటా వినియోగం ఏకంగా 1900% పెరిగింది. ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2015 లో నెలకు 30 జీబీ డేటా ఉపయోగిస్తుంటే, 2020లో నెలకు 600 కోట్ల జీబీ డేటా ఉపయోగిస్తున్నారు. ఒక సబ్‌స్క్రైబర్ వినియోగించే డేటా 4200% పెరిగింది. ఇక ట్రాయ్ లెక్కలు చూస్తే 2016లో నెలకు సగటున 0.24జీబీ డేటా వాడేవారు. 2020 లెక్కల ప్రకారం నెలకు సగటున 10.4జీబీ డేటా ఉపయోగిస్తున్నారు. 2016లో ఒక సినిమా డౌన్లోడ్ చేయడానికి రూ.266 ఖర్చయ్యేది. కానీ 2020లో ఒక సినిమా డౌన్‌లోడ్‌కు అయ్యే ఖర్చు రూ.18.
ప్రస్తుతం ప్రతీ ఇంట్లో 4 సభ్యులు 50జీబీ డేటా ఉపయోగిస్తున్నారు. నెలకు రూ.400 నుంచి రూ.500 ఖర్చు చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం జియో కమర్షియల్‌గా ప్రారంభమైనప్పుడు ఒక జీబీకి సగటున రూ.185 నుంచి రూ.200 ఖర్చయ్యేది. అంటే 50జీబీ డేటా ఉపయోగించాలంటే రూ.10,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రూ.500 లోపే 50 జీబీ డేటా వస్తోంది. ట్రాయ్ పర్ఫామెన్స్ రిపోర్ట్ ప్రకారం డేటాకు అయ్యే ఖర్చు ఏకంగా 1400% తగ్గింది. ఒక జీబీ డేటా ధర రూ.185 నుంచి రూ.12 కు దిగొచ్చింది. ఇక వాయిస్ కాల్స్ వినియోగం నెలకు 100 శాతం పెరిగింది. గతంలో నెలకు 366 నిమిషాలు మాట్లాడితే, ఇప్పుడు నెలకు 712 నిమిషాలు మాట్లాడుతున్నారు.
FASTag: అలర్ట్... ఫాస్ట్ ట్యాగ్‌పై కొత్త రూల్స్ ప్రకటించిన మోదీ ప్రభుత్వం
Realme 7 Pro vs OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్‌కు పోటీగా రియల్మీ 7 ప్రో... ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్

ప్రతీకాత్మక చిత్రం
ఇక భారతదేశంలో యాప్ డౌన్లోడ్ కూడా 190% పెరిగింది. ప్రపంచ యావరేజ్ 45% మాత్రమే. యాప్ అన్నీ రిపోర్ట్ ప్రకారం 2016లో 6.5 బిలియన్ యాప్స్ డౌన్లోడ్ చేస్తే, 2019లో 19 బిలియన్ యాప్స్ డౌన్లోడ్ చేయడం విశేషం. అంటే భారతదేశంలో ఒక సెకండ్‌కు 602 యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారన్నమాట. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా డేటా విప్లవం చూడొచ్చు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో 16 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు ఉన్నారు. వీరిలో జియో యూజర్లే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సబ్స్క్రైబర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2016 లో 11.97 కోట్ల మంది ఇంటర్నెట్ సబ్స్క్రైబర్లు ఉంటే 2020 లో 26.84 కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీరిలో 70% జియో కారణంగా పెరిగారు.
Published by:
Santhosh Kumar S
First published:
September 4, 2020, 6:39 PM IST