JioFiber | జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్...

జియో వినియోగదారులకు శుభవార్త. తమ యూజర్ల కోసం ఓ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ.

news18-telugu
Updated: July 8, 2020, 8:24 PM IST
JioFiber | జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్...
JioFiber: జియోఫైబర్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
జియో వినియోగదారులకు శుభవార్త. తమ యూజర్ల కోసం ఓ కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఇచ్చింది కంపెనీ. లయన్స్ గేట్ ప్లే నుంచి ప్రీమియం కంటెంట్‌ను చూసే వెసులుబాటు కల్పిస్తోంది. STARZ original, first-run తోపాటు ఇతర టీవీ, సినిమా కంటెంట్ (7500 ఎపిసోడ్లు), ఇతర పాపులర్ ప్రోగ్రాం జియో ఫైబర్ వినియోగదారులు వీక్షించవచ్చు. ఈ రోజు నుంచే ఇది అమల్లోకి వచ్చింది. హారర్, కామెడీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ, సినిమాల కంటెంట్ ఉంటుంది. ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. హిందీ, మరాఠీ, తమిళం, తెలుగు, కన్నడ, భోజ్ పురి భాషల్లో ఈ వీడియోలను వీక్షించవచ్చు. ఈ కాంప్లిమెంటరీని జియోఫైబర్ సిల్వర్ యూజర్లు (ఒక నెల కంటే ఎక్కువ నెలలు ప్లాన్లు) వీక్షించవచ్చు. అలాగే, కొత్త వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. JioTV+ యాప్ నుంచి జియోఫైబర్ యూజర్లు లయన్స్ గేట్ ప్లే కంటెంట్ చూడవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా లాగిన్ లేదా యాప్ డౌన్ లోడ్ చేయాల్సిన అవసరం లేదు.

గోల్డ్ ప్లాన్ భిన్నరకాలైన సేవలను అందిస్తుంది. అంతకన్నా ఎక్కువ కంటెంట్‌ను వీక్షించాలనుకునే జియోఫైబర్ యూజర్లు గోల్డ్ ప్లాన్ తీసుకోవచ్చు. ఈ గోల్డ్ ప్లాన్‌లో హై స్పీడ్, ఎక్కువ బ్రాడ్ బ్యాండ్ డాటా లభిస్తుంది. గోల్డ్ ప్లాన్‌లో 250 Mbps స్పీడ్, అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ (నెలకి 1750 జీబీ డేటా), భారత్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, అంతర్జాతీయంగా తక్కువ ధరకే కాల్స్ అందిస్తుంది. దీని ఎనీటైమ్ టీవీ (భారత్‌లో అత్యంత భారీ కంటెంట్ గమ్యం) ద్వారా ప్రీమియం ఓటీటీ ప్లాట్ ఫాంలకు యాక్సెస్ లభిస్తుంది. Lionsgate Play, Zee5, Amazon Prime Video, Disney+ Hotstar, SonyLiv, SunNxt, Voot, AltBalaji, HoiChoi, Shemaroome, JioCinema and JioSaavn లాంటి వాటికి యాక్సెస్ లభిస్తుంది. అన్ లిమిటెడ్ వీడియో కాలింగ్, కాన్ఫరెన్సింగ్ (టీవీ వీడియో కాలింగ్ ) సౌకర్యం కూడా లభిస్తుంది. అన్ లిమిటెడ్ మ్యూజిక్, గేమ్స్, జియోయాప్స్‌ని అన్ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 8, 2020, 8:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading